You Are Here: Home » చిన్నారి » తెలుసా...!! » ఆయుర్వేదం- అపొహలు

ఆయుర్వేదం- అపొహలు

ఆయుర్వేదం- అపొహలు

ayurvedam-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema
భారతీయ వారసత్వ సంపదల్లో ఆయుర్వేదానిది అగ్రస్థానం. ఇంటికోడి చందానా దాని విలువను గ్రహించలేకుండా ఉన్నాము. ఈ మధ్య మళ్ళీ ఆయుర్వేదం పూర్వ వైభవం దిశగా ప్రయాణం సాగిస్తోంది.
ఆయుర్వేదం అంటే జీవానికి సంబంధించిన జ్ఞానం అని అర్థం. ఇది అధర్వణ వేదంలోని ఉపవేదం అని చెబుతారు. మిగిలిన అన్ని రకాల వైద్యాలు ఆయుర్వేదం నుంచే ఉద్భవించాయి. ఆయుర్వేదానికి సంబంధించిన చరివూతను ఒకసారి తిరగేస్తే ఆయుర్వేదంలో సర్జరీతో సహా అన్ని ప్రక్రియలు ఉన్నాయి. ఈ ప్రక్రియలే మరింత అభివృద్ధిపరిచి ఆధునిక వైద్యంలో ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదం భారతదేశంలో పుట్టి అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పటికీ ఆయుర్వేదానికి సంబంధించి ఎన్నో అపోహలు, అనుమానాలు. ఆ అనుమానాల నివృత్తి దిశగా…

అపోహ: ఆయుర్వేదం అంటే కేవలం మసాజ్ మాత్రమే
నిజం: ఆయుర్వేదం అమ్మ ఇచ్చే సంరక్షణ లాంటిది. ఈ వైద్య విధానంలో కేవలం పై పూతలే కాదు లోపలి నుంచి చికిత్స అందిస్తారు. ప్రేమతో, బాధను తప్పకుండా నివృత్తి చేయ్యాలన్న తపనతో పవిత్ర భావనను జోడించి చికిత్స అందిస్తారు. అందులో భాగంగా మసాజ్ కూడా ఉంటుంది. ఇది రక్తవూపసరణను మెరుగు పరుస్తుంది. కొన్ని సార్లు పట్టు తప్పిన నాడీ వ్యవస్థను తిరిగి సక్రమ మార్గంలో పెట్టడానికి ఉపకరిస్తుంది. అంతేకాదు నూనె మందును శరీరంలోకి పంపడానికి మంచి మాధ్యమంగా పనిచేస్తుంది. కనుక మసాజ్ చాలా శాస్త్రీయమైంది.కానీ ఆయుర్వేదం అంటే కేవలం మసాజ్ మాత్రమే కాదు.
అపోహ: ఆయుర్వేద మందుల వాడుతున్నపుడు ఆహారం, అలవాట్ల విషయంలో తప్పకుండా పథ్యం పాటించాల్సి ఉంటుంది.

నిజం: సమస్యలో భాగంలో ఆహారం, అలవాట్ల విషయంలో నియమాలు పాటించాల్సి ఉంటుంది. కానీ చికిత్సలో భాగంగా కాదు. ఉదాహరణకు కిడ్నీలో రాళ్లు ఉన్నపుడు కాల్షియం ఎక్కువగా ఉండే పాలకూర, టమాట, కాలీఫ్లవర్ వంటి పదార్థాలు తినకూడదు. ఎటువంటి చికిత్స తీసుకుంటున్నా ఇలాంటివి తప్పనిసరి.

అపోహ: ఆయుర్వేదానికి శాస్త్రీయత లేదు
నిజం: మార్కెట్లో లభించే ఆయుర్వేద మందులన్ని డగ్స్ కంట్రోల్ ఆఫ్ ఇండియా వారు పరిశీలించి అనుమతినిచ్చినవే. ఇవి టాక్సికాలజీ, ఫార్మకాలజీ టెస్ట్‌లన్నింటిని పూర్తి చేసుకుని మార్కెట్లోకి వస్తాయి. ఆయుర్వేదంలో ప్రత్యేక కోర్సులు దేశంలోని అనేక యూనివర్సిటీలు నిర్వహిస్తున్నాయి. అనేక మంది ఈ కోర్సులు పూర్తిచేసి వైద్యం చేసే అర్హత కలిగి ఉన్నారన్న పట్టాతో యూనివర్సిటి నుంచి బయటికి వస్తున్నారు. అదీ కాకుండా ఎంతో మందికి చికిత్స అనంతరం చేయించుకున్న తర్వాత చేయించుకున్న పరీక్షలలో సమస్య పూర్తిగా నయమైనట్టు రుజువులు కూడా ఉన్నాయి. ఇక ఆయుర్వేదానికి శాస్త్రీయత లేదన్న ప్రశ్న ఉత్పన్నమవడమే ఉండదు.

అపోహ: ఆయుర్వేద వైద్యంలో గుణం చాలా నెమ్మదిగా కనిపిస్తుంది
నిజం: ఇది నిజం కాదు. మందులు ఎంత కాలం వాడాలనేది సమస్య తీవ్రత, వ్యక్తి వయసు, సమస్య ఎంత కాలంగా ఉందన్న దానిమీద ఆధార పడి ఉంటుంది.

అపోహ: ఆయుర్వేదం మందులు వేడి చేస్తాయి.
నిజం: కొన్ని సమస్యల చికిత్సకు తప్పకుండా శరీరంలో కొంత వేడి పుట్టించడం అవసరమవుతుంది. అందువల్ల జీర్ణశక్తి పెంపొందుతుంది. మందులు త్వరగా రక్తంలో కలిసే అవకాశం ఏర్పడుతుంది. కానీ అన్ని మందులు వేడి చేస్తాయనడం కేవలం అపోహ మాత్రమే.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top