You Are Here: Home » ఇతర » ఆఫర్‌ వస్తే తెలుగులో నటిస్తా – బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌

ఆఫర్‌ వస్తే తెలుగులో నటిస్తా – బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌

బాలీవుడ్‌ భామలు భాగ్యనగర బాట పడుతున్నారు…తమ అందచందాలతో అభిమానుల హృదయాలను కొల్లగొడుతున్నారు. సినిమా ప్రచారాలతో పాటు పలు బ్రాండ్ల ప్రచారానికి సైతం సై అంటున్నారు. సరికొత్త రీతిలో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాల్లో సందడి చేస్తున్నారు. తాజాగా రెండు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బాలీవుడ్గ భామలు కత్రినాెకైఫ్‌, రవీనాటాండన్‌లో హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ‘స్టైల్‌’ ప్రతినిధితో వారు ముచ్చటించారు. ఆ వివరాలు ఈ వారం ‘స్టైల్‌’లో మీకోసం..
natyతెలుగు చిత్ర పరిశ్రమలో తనకు ఎంతోమంది స్నేహితులు ఉన్నారని, తెలుగులో మంచి ఆఫర్‌ వస్తే నటించేందుకు సిద్ధమని బాలీవుడ్‌ నటి రవీనాటాండన్‌ అన్నారు. చాలా రోజుల తరువాత భాగ్యనగరానికి వచ్చానని, తెలుగులో ఐదు సినిమాల్లో నటించినట్లు గత స్మృతు లను నెమరువేసుకున్నారు. మగువలకు అవసరమైన ఆభరణాలన్నీ అందించేందుకు హైదరాబాద్‌ లోని మాదాపూర్‌ హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన విని యోగదారుల అభరణాల ప్రదర్శనను బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా రవీనా టాండన్‌ మాట్లాడుతూ బంగారంపై పెట్టుబడి పెట్టడం ఇప్పుడు ఎంతో లాభదాయకమన్నారు. అందుకోసమే ఒకప్పుడు మహిళలకు ప్రత్యేకమైన బంగారం ప్రస్తుతం మగవారి హృదయాలను దోచుకుంటుందని అన్నారు. భారతదేశంలోనే విభిన్న రకాల ఆభరణాలతోపాటు సాంప్రదాయ ఆభరణాలన్నింటిని ఒకే వేదికపై తెచ్చి హైటెక్స్‌ ఇంటర్‌నేషనల్‌ జెమ్స్‌జువెల్లరీ ఎక్స్‌పోసిషన్‌ 2012 రూపంలో అందించడం ఒక విశేషం అన్నారు.

ఇంకా దే శవ్యాప్తంగా జరిగిన అన్ని జువెల్లరీ షోలకంటే హైటెక్స్‌ ఇంటర్‌నేషనల్‌ జెమ్సెజువెల్లరీ ఎక్స్‌పొసిషన్‌ 2012 ఎంతో అత్యున్నతమైనదని కితాబిచ్చారు. అందుకే పత్యేకమైన విభిన్న డి జైన్‌లతో కూడిన ఆభర ణాలను తీసుకోవడానికి తాను ఇక్కడికి వచ్చానన్నారు.ఈ సందర్భంగా ఎఒజె మీడియా ఎమ్‌డి సుమేష్‌ వధేరా మాట్లాడుతూ ఈ 8వ హైటెక్స్‌ ఇంటర్‌నేషనల్‌ జెమ్సె జువెల్లరీ ఎక్స్‌పోసిషన్‌ 2012 స్ర్తీలకు ఎంతో ప్రత్యేకమైన పండగలలో ఒకటైన వరలక్ష్మివ్రతంకు ముందే వచ్చి ఆభరణప్రియులకు ఒక పండుగ వాతావర ణాన్ని ల్పించింది. ఈ బి2సి జెమ్‌ జువెల్లరీ ప్రదర్శనలో 100పైగా ప్రముఖ కంపెనీలతో పాటు ఈ రంగంలో దేశంలోనే పేరెన్నికగన్న ప్రముఖ రిటైలర్స్‌ పాల్గొన్నారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top