You Are Here: Home » సఖి » రుచి » ఆపిల్‌గ్రేప్స్‌ క్రస్డ్‌ఐస్‌

ఆపిల్‌గ్రేప్స్‌ క్రస్డ్‌ఐస్‌

ఆపిల్‌గ్రేప్స్‌ క్రస్డ్‌ఐస్‌

కావలసిన పదార్థాలు : ఆపిల్‌రసం-రెండు కప్పులు, ద్రాక్షరసం- రెండుకప్పులు, నిమ్మరసం-అరకప్పు, పంచదార సిరప్‌- అరకప్పు, ఐస్‌ ముక్కలు-కావాల్సినన్ని, ఆపిల్‌ముక్కలు-కాసిన్ని,

తయారీ విధానం : ముందుగా కావాల్సినన్ని ఐస్‌ ముక్కల్ని తీసుకుని మరీ మెత్తగా కాకుండా ఓ మోస్తరుగా చితగ్గొట్టి గ్లాసుల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లో ఆపిల్‌, ద్రాక్ష రసాలను (ఆపిల్‌, గ్రేప్స్‌ ముక్కలను విడివిడిగా జ్యూసర్‌లో వేసి బ్లెండ్‌ చేస్తే రసం తీసి పెట్టుకోవాల్సి నిమ్మరసం, పంచదార సిరప్‌లను వరుసగా వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని ఐస్‌ ముక్కలు వేసిన గ్లాసుల్లోకి కాస్త వెలితి ఉండేటట్లుగా పోయాలి. చివర్లో తరిగి ఉంచుక్కున్న ఆపిల్‌ ముక్కలను పైన చల్లితే ఆపిల్‌ గ్రేప్స్‌ క్రస్ట్‌ ఐస్‌ తయార్‌…! వేసవిలో ఇంటికి అనుకోని అతిథులు వచ్చినప్పుడు వారికి ఇలా చల్లచల్లగా స్వాగతం పలకండి మరి…!!

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top