You Are Here: Home » ఇతర » ఆనందప్రియ

ఆనందప్రియ

ఆనంద నిష్ణాతురాలైన భరతనాట్య కళాకారిణి…ప్రముఖ నాట్య గురువులు గురు ెక.ఎన్‌.పక్కిరిసామి పిళ్లైగారి శిష్యూలైన పి.ఆర్‌.బాలకృష్ణన్‌ (తంజావూరు శైలి) వద్ద ఆమె నృత్యం లో శిక్షణ పొందారు. దేశం లో…విదేశాలలో పలు నృత్య ప్రదర్శనలిచ్చారు. జపాన్‌కు చెందిన హికొనె క్లబ్‌ ఆహ్వానం మేరకు ఆనంద అక్కడ ప్రాచీన వారసత్వ సంపదకు పేరొందిన హికొనె క్యాస్టిల్‌ మ్యూజియంలో నృత్య ప్రదర్శనలిచ్చారు. గతంలో ఆమె సుమారు దశాబ్దకాలంపాటు ది ఎకనామిక్‌ టైవ్గ్సు, టైవ్గ్సు ఆఫ్‌ ఇండియా దినపత్రికలలో జర్నలిస్టుగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆమె జర్మనీ మల్టీనేషనల్‌ కంపెనీలో ఓ గవర్నమెంటల్‌ అండ్గ స్టేక్‌ ెల్డర్‌ అఫైర్స్‌ విభాగం అధిపతిగా పనిచేస్తున్నారు.

ఆనందప్రియ వార్షికోత్సవ వేడుకలు:
ఆనందప్రియ ఫౌండేషన్‌ విజయవంతంగా తన ఏడాది ప్రయాణాన్ని పూర్తిచేసింది. ఈ సందర్భాన్ని పురస్కరిం చుకుని ఈ ఫౌండేషన్‌ రెండు రోజుల శాస్ర్తీయ నృత్య, సంగీత వేడుకను నేడు…రేపు (9, 10 తేదీలు) హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లోని ఇందిరా ప్రియ దర్శిని హాల్‌లో నిర్వహిస్తోంది. ప్రారంభదినంనాడు సుప్రసిద్ధ భరతనాట్యం గురువు ప్రియదర్శిని గోవింద్‌ సోలో నృత్యప్రదర్శన ఇవ్వనున్నారు. మరుసటి రోజున ఇదే సభాస్థలిలో కుమార్‌ మర్దుర్‌ హిందుస్తానీ గాత్రకచేరీ జరుగనుంది.

ఆనందప్రియ ఫౌండేషన్‌ వ్యవస్థాపన గురించి:
Unti61. ఆనందప్రియ ఫౌండేషన్‌ అనేది ఆర్‌బిసీ వరల్డ్‌వైడ్‌ యొక్క సీఎస్‌ఆర్‌ (కార్పొరేట్‌ సామాజిక బాధ్యత) ఇన్షియేటివ్‌. 2011లో ఇది నెలకొల్పబడింది. కళాకారులు, జర్నలిస్టులు, రచయితలు, కళాప్రియులు కలిసి ఆనందప్రియ ఫౌండేషన్‌ను స్థాపించారు. ప్రతిభావంతులైన కళాకారులకు ఓ చక్కటి వేదికను ఏర్పరచడమే ఆనందప్రియ లక్ష్యం

-ప్రియ


2. ఒక కళాకారిణిగా నేను ఎప్పుడూ ఓ చక్కటి వేదిక అవసరాన్ని, కళను ఆస్వాదించగల ప్రేక్షకులను కోరుకునేదాన్ని. సభల ముఖ్య అతిధుల హడావిడి లేకుండా కళాకారుల ప్రదర్శనలపై మాత్రమే దృష్టి కేంద్రీకరించే కళాభిమానుల వేదికను ఏర్పాటు చేయడం నా స్వప్నంగా ఉండింది. ఆనందప్రియ ఫౌండేషన్‌ ఏర్పాటుకు కూడా ఇదే మూల కారణంగా నిలిచింది…

-ఆనంద

ఆనందప్రియ లక్ష్యం:
కరళాప్రియులు, లలితకళల రాజపోషకుల అండదండలతో రూపుదిద్దుకున్న ఆనందప్రియ, శాస్ర్తీయ సంగీత, నృత్యాదుల్లో…సమకాలీన చిత్రలేఖనంలో యువతరంలో నిగూఢంగా ప్రతిభను వెలికితీయడం, ఇప్పుడిప్పుడే రాణిస్తున్నవారికి మరింత ప్రాచుర్యం కల్పించడం లక్ష్యంగా సాగుతోంది. యుక్తవయసులోవారికి పుస్తక పఠనాభిలాష పెంచేందుకు..భాషా నైపుణ్యాలను వారికరి అలవర్చేందు కోసం ఈ ఫౌండేషన్‌ బొమ్మలతో కూడిన పుస్తకాలను ఇంగ్లీష్‌ భాషలో ప్రచురిస్తోంది. ప్రపంచంలోని వివిధ భాషా సంస్కృతులకు చెందిన కథలు వీటిలో ఉంటాయి.

ఆనందప్రియ చేపట్టిన కార్యకలాపాలు:
ఈ ఫౌండేషన్‌ ఇప్పటివరకూ నాలుగు శాస్ర్తీయ కళాప్రదర్శనలను, రెండు పెయింటింగ్‌ ప్రదర్శనలను నిర్వహించింది. తొలి కార్యక్రమంగా ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్న కర్ణాటక సంగీత కళాకారుడు సతిరాజు వేణుమాధవ్‌ గాత్రకచేరి నిర్వహించింది. అనంతరం హిందుస్తానీ, కర్ణాటక గాత్రంలో అంతర్జాతీయ వోకలిస్ట్‌, వయోలినిస్ట్‌ అయిన డాక్టర్‌ శ్రీరామ్‌ పరుశురామ్‌చే ప్రసంగ కార్యక్రమం జరిగింది. ఫౌండేషన్‌ చేస్తున్న విశిష్ట, విలక్షణ ప్రయత్నాలను ఈ సందర్భంగా ఆయన ఎంతగానో అభినందించారు. అనందరం డా.యశోద ఠాకూర్‌ విలాసిని నృత్య ప్రదర్శనను ఈ ఫౌండేషన్‌ నిర్వహించింది.

చిత్రకారుడు టి.రమాకాంత్‌ చిత్రాలతో రెండు పెయింటింగ్‌ ఎగ్జిబిషన్లను ఫౌండేషన్‌ నిర్వహించింది. కళాభిమానులకు కళారూపాలను చేరువ చేయాలన్న లక్ష్యంలో భాగంగా ఫౌండేషన్‌ ఈ కార్యక్రమాలను చేపట్టింది. ఇటీవలే ఆనందప్రియ ఫౌండేషన్‌, మ్యూజిక్‌ ఆర్ట్‌ గ్యాలరీతో కలిసి మల్టీవెర్సెల్‌-2 వార్షిక వేడకు ప్రదర్శనను నిర్వహించింది. హైదరాబాద్‌లోని మారియట్‌ హోటల్‌లోని మ్యూసే ఆర్ట్‌ గ్యాలరీలో 2012 సెప్టెంబర్‌ 30 నుంచి అక్టోబర్‌ 19 వరకూ ఈ చిత్రకళా ప్రదర్శన జరిగింది.

భారతీయ సంస్కృతిని ప్రోత్సహించే దిశలో…
శాస్ర్తీయ కళారూపాల సౌందర్యాన్ని ప్రోత్సహించడం, యువతలో ఈ కళల పట్ల అభిరుచిని పెంపొదించడం ఈ ఫౌండేషన్‌ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించడంలో భాగంగా ఔత్సాహిక కళాకారుల ప్రదర్శనలను ఏర్పాటు చేస్తూ వారి ప్రదర్శనలు కళాభిమానుల దృష్టిలోకి వచ్చేలా చేస్తూ..కళాత్మక విలువలను అర్థం చేసుకునేలా చేస్తోంది ఈ ఫౌండేషన్‌.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top