You Are Here: Home » ఇతర » ఆధ్యాత్మికతతోనే అన్నీ సాధ్యం

ఆధ్యాత్మికతతోనే అన్నీ సాధ్యం

మనిషిని, సమాజాన్నీ కూడా సక్రమ మార్గంలో నడిపించేది ఆధ్యాత్మికం ఒక్కటే. ఆధ్యాత్మిక భావాల వల్ల భక్తి తత్పరత ఏర్పడుతుంది. అప్పుడే మానవుని ఆలోచనలు రుజుమార్గంలో పయనిస్తారుు. స్వలాభాపేక్ష కోసం పరితపించే అలవాటు పోరుు సమాజశ్రేయస్సుని కాక్షించే ఒక అద్భుతమైన భావాలు అంకురిస్తారుు. అందుకు భక్తి ఎంతో తోడ్పడుతుంది. భక్తి అనేది ఏ విధంగానైనా ఉండవచ్చు. ఇష్టదైవం మీద, గురువు మీద, చేసే పనిలో ఇలా ప్రతి అంశంలోను భక్తిని జోడిస్తే ఫలితాలు అందరికీ అందుతారుు. ఉదాహరణకి, మంచి మనసుతో ఒక పండ్లమెుక్కని నాటితే దాని ఫలాలు అందరూ పంచుకుంటారు. అలాగే భక్తిభావంతో చేసే పని తాలూకు ఫలితం అంతటా ప్రతిఫలిస్తుంది.

07Feaచీకటిలో ఒక దీపాన్ని వెలిగిస్తే, ఆ దీపం వెలుగు దాని శక్తిని బట్టి ప్రసరిస్తుంది. పెద్ద దీపం మరింత దూరం ప్రసరిస్తుంది. ఆ వెలుగు, దీపం వెలిగించిన వారికే కాకుండా అందరికీ దారి చూపెడుతుంది. అదే విధంగా ఎంత ఆధ్యాత్మిక భావాలు పెంపొందించుకుంటే, అంత భక్తి పెరుగుతూవుంటుంది. దానివల్ల మన చుట్టూ ఉన్నవారు కూడా భక్తి తత్పరత అలవరచుకుంటారు. ఇక్కడ దేవుడు ఉన్నాడా లేడా? అనేది ముఖ్యం కాదు. మనకి భక్తి ఉందా లేదా అనేదే ముఖ్యం. ఈ భక్తి మనం చూపించే పద్ధతి మీద ఆధారపడి ఫలితాల్నిస్తుంది. పెద్దల పట్ల భక్తి ఉంటే, వారి ప్రేమని మనకి పంచుతారు. మన శ్రేయస్సుని కోరతారు. దేవుడి మీద భక్తివుంటే, దైవత్వాన్ని పొందుతారు. చేసే పనిమీద భక్తి ఉంటే, విజయాన్ని సాధిస్తారు. కనుక భక్తిని కూడా మనం వినియోగించుకునే విధానంలో ఉంటుంది.

07Fea-అయితే అన్నిటి యందు, అందరి యందు భక్తి కలిగివుండటం చాలా అవసరం. ఇది ఎంతో ఉత్తమమయిన లక్షణం. ఆధ్యాత్మిక భావాలు ఉన్నచోట ప్రతికూల (నెగెటివ్‌) ఆలోచనలకి తావుండదు. మంచి విషయాను రక్తి, బుద్ధికుశలత, కష్టపడే స్వభా వం, అందరికీ మేలు చేయాలనే తలంపు వంటి మంచి కార్యాల వైపు మనసు పరుగులిడుతుంది. మనపూర్వులు అటువంటి తలం పుతోనే దానధర్మాలు చేయడం, అతిధుల్ని ఆదరించడం, అన్న సత్రంలు నిర్మించడం వంటి సామాజిక సేవలు అందించేవారు.అటువంటివారు లౌకిక పరమైన సంపదలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అలాగే, వారిని ‘ఆ‚..! ఏముంది? ఉన్నదంతా దానధర్మాలకి తగలేసాడు. ఇప్పుడు దరిద్రంతో బాధపడుతున్నాడు’ అంటూ విమర్శించేవారు. నిజానికి వారు ఎన్నటికీ దరిద్రులు కాదు. దారిద్య్రం అనేది సంపదలో ఉండదు.

Bhaktizఅది కేవలం మనసులోనే ఉంటుంది. పది ఊళ్ళు కొనగల సంపద ఉన్నా, సాటివాడికి మెతుకు విదల్చలేని ఆ సంపన్నుడే దరిద్రుడుగా పిలవబడతాడు. దానికి నిదర్శనమే కుచేలుని వృత్తాంతం. తినడానికి తిండి లేకపోయినా, సంపన్నుడైన శ్రీకృష్ణపరమాత్మకి ఇంట్లో కటాకటీగా మిగిలిన గుప్పెడు అటుకులు పెట్టాడు. అందుకు ప్రతిగా భగవంతుడు కనుక అష్టైశ్వర్యాల్నీ ప్రసాదించాడు.మనం ఏదైనా చేయగలుగుతున్నాం అంటే అందుకు చైతన్యం ఆ భగవంతుడే. చూడగలుగుతున్నాం అంటే ఆ శక్తి భగవంతుడే. అందుకే మహానుభావులు అంటారు. అహం వదలమని. అహం అంటే నేను, నాది అనే భావన. మనలో భగవంతుడు అనే చైతన్యం లేకపోతే అవయవాలు పనిచేయవు. కాబట్టి ఇది నేను చేసాను. ఇది నాది, దీనిని నేను సాధించాను, అనే భావాలు మనిషిని అధోగతి పాలుచేస్తాయి. అందుకే యోగులు – యోగ సమాధిలో నీలో నిన్ను దర్శించుకో అని చెప్తారు. అలా మనమీద మనమే భక్తితో మనల్ని లోపల దర్శించుకోగలిగితే కనిపించేది భగవత్స్వరూపమే. దానికి తిరుగులేదు. అప్పుడే ‘అహం బ్రహ్మోస్మి’ అనేదానికి అర్ధం అవగతం అవుతుంది. ఇక్కడ అహం బ్రహ్మోస్మి అంటే నేనే బ్రహ్మని అని అనుకోవడం ఒకటైతే, నేను అనేది కేవలం బ్రహ్మ మాత్రమే అని తెలుసుకోవడం మరొకటి.

Bhaktiఇక ఇవన్నీ అలా ఉంచితే, ఆధ్యాత్మికత అలవరచుకోవడం ఎలా? అనే అనుమానం కొందరికి రావచ్చు. ఇది నమ్మకం, అపనమ్మకం అనే రెండు స్వభావాల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే భగవంతుడున్నాడా లేడా అన్నది ముఖ్యం కాదని పైన చెప్పడంలో ఉద్ధేశ్యం అదే. అయితే ప్రతిమనిషిలోను ఆధ్యాతికత ఉంటుంది. దానిని ఎవరికి వారు తెలుసుకోవలసి ఉంటుంది. దేవుడు లేడని వారించేవారికి కూడా ఆధ్యాత్మికత వారికి తెలియకుండానే ఉంటుంది. ఏ విధంగా అంటే, ఒక దీనుడో, పండు ముసలిదైన ఒక బిచ్చగత్తో, నాస్తికునికి ఎదురుపడ్డారనుకోండి జాలితో జేబులోంచి ఎంతో కొంత ఇచ్చి సంతృప్తి పడతాడు. ఒక మనసుకి జాలి కలగడం కూడా ఆధ్మాత్మిక ప్రభావమే. అదే ఆ ఆధ్యాత్మికత లేనట్లైతే, తనముందు నిలబడిన దీనుని చూసి, నిస్సహాయంగా బతకడం ఎందుకు చావు అంటూ ఒక్కపోటు పొడవచ్చుగా? మరి ఆ పని ఎందుకు చేయలేదు? దేవుడు లేడు అన్నవాడు ఆ పనిచేయడానికి ఎవరికి భయపడుతున్నాడు? సమాజానికా! అయితే ఈ నాస్తికుడికి సమాజం మీద భక్తి ఉన్నట్టే. భక్తి ఉంటే ఆధ్మాత్మికత ఉన్నట్టే. ఇలా అనేక విషయాల్లో మనం సామరస్యంగానే వ్యవహరిస్తాం.

అందుకే ‘దైవం మానుష రూపేణ’ అన్నారు. ప్రతి మనిషిలోను భగవంతుడు ఉంటాడు. కానీ మనిషిని అహంకారం అనే పొర కమ్మేసి, ఆత్మలో ఉన్న పరమాత్మ మసకబారిపోతాడు. కాబట్టి మనలో నిభిడీకృతమై ఉన్న ఆధ్యాత్మిక తరంగాల్ని మరింత పెంచుకునే ప్రయత్నం చేయడం మొదలు పెడితే, సాధ్యాసాధ్యాల గురించిన చింత ఎవరికీ ఉండదు. మన ఈ ప్రయత్నం వల్ల సత్సంగం ఏర్పడుతుంది. సమాజంలో మంచి తరంగాలు ప్రసరించి నవసమాజం వృద్ధిచెందుతుంది.

అందుకే దాచుకుని తినడం కన్నా పంచుకుని తినడంలో ఎంతో తృప్తి ఉంటుంది. ఆ తృప్తే భక్తికి పరాకాష్ట. అందుకే మన పెద్దలు అంటారు ‘పెట్టే గుణం ఉన్నవాడికే పుచ్చుకునే అర్హత ఉంటుంది’ అని. అలా చేయడం వల్ల మనకి భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. అసలు భగవంతుని అనుగ్రహం కలగాలంటే, ఆయనకి పూజలు, యజ్ఞాలు చేయనవసరం లేదు. ఆయన చెప్పినదాన్ని పాటిస్తే చాలు. ఆయన ఇష్టపడే మంచి పనులు మనం నిత్యం చేస్తూవుంటే చాలు. అదే మహా యజ్ఞం కూడా. ఇవే ఆధ్యాత్మికానికి నిలువెత్తు నిదర్శనాలు.

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top