You Are Here: Home » ఇతర » ఆదివాసిలు అందమైన కళలు

ఆదివాసిలు అందమైన కళలు

ఆదివాసిలు అందమైన కళలు

 

అడవెంత అందమో వాళ్లంత అందంగా బతుకుతుంటారు. అపరిమిత ఆనందాలతో జీవిస్తుంటారు. చిత్రవిచిత్ర ఆహార్యాలు… వింత వింత అలంకరణలు… ఈ నాగరిక ప్రపంచానికి దూరంగా ఎక్కడో ఉంటారు. వాళ్ళేంటో.. వారి ఆటపాటలేంటో అన్నట్టుగా గడుపుతుంటారు. ఇప్పుడు ఈ జనం అనుసరిస్తున్న ఫ్యాషన్లన్నీ వారి నుంచి వచ్చినవే. ఈ కొత్తకు.. ఆ పాత మధురమే ఆధారం. నకశిఖపర్యంతం వారు అలంకరించుకునే తీరుతెన్నులు..నేటి యువతీ యువకులకు ఎంతగానో నచ్చుతోంది. ఆదివాసీల జీవనగతుల్లొంచి లేటెస్ట్‌ ఫ్యాషన్లెన్నో పుడుతున్నారుు.
andaluహొయిలాలో.. అంటూ కమ్మగా సాగిపోయే జీవితాలు వారివి. తామేంటో.. తమ ఆచార వ్యవహారాలేమిటో.. తమ సంస్కృతీ సంప్రదాయాలేమిటో.. తమ తమ అలంకరణల్లో చూపే వైవిధ్యాలేమిటో… భిన్నమైన ఆ జీవనవిధానమేమిటో అన్నట్టుంటారు. అడవిసాక్షిగా పుట్టించే ఎన్నో అలంకరణ వస్తువులు- నేటి మోడ్రన్‌ సొసైటీలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. లేటెస్ట్‌లలో హాటెస్టులుగా చెలామణి అవుతున్నాయి.

ఆతీరుతెన్నులను ఓసారి పరిశీలిద్దాం…
ఈ మట్టిలో పుట్టి… ఈ గాలి వాసన పీల్చి… ఈ వర్ణాల్లో వర్ణంగా కలగలసి.. ప్రకృతమ్మతో పోటీలు పడుతూ సాగే జీవనం వారిది. నుదుటమెరిసే ఆ కుంకుమబొట్టు- తళుక్కుమనే ఆ ముక్కెరలు.. మెరుపులీనే ఆ చేతిగాజులు… బహు బాగున్నాయనిపించే ఆ వంకీలు.. కడియాలు… వారిని మరింత ఆకర్షణీయం చేస్తాయి. ఆకాశం దించాలా-నెలవంకా తుంచాల అంటూ సాగే సొగసైన జీవన విధానమది. చీరకట్టి.. ఆ కట్టులోనే జాకెట్టులాంటి ఏర్పాటు చేసి… నడుస్తుంటే ఆ అందాలను వర్ణించడానికి ఎన్ని వేల మంది కవులొచ్చినా పదాలు కూర్చలేరు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top