You Are Here: Home » ఇతర » ఆదరణ కరవు

ఆదరణ కరవు

ఆదరణ కరవు

 

ఐపీఎల్‌…నాలుగు వసంతాలను పూర్తి చేసుకొని ఐదో వసంతంలోకి అడుగుపెట్టింది. గత నాలుగు సీజన్లలోనూ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ అనే పూర్తి పేరు తెలియని వారు సైతం ఐపీఎల్‌ అంటూ కలవరించారు. ఇప్పుడు ఆ కలవరింతలు కరువయ్యారుు. ఏం చూస్తాంలే అనే నిట్టూర్పులే ఎక్కువయ్యారుు. సినీతారలు, ఛీర్‌లీడర్స్‌ హంగామా లాంటివేవీ కూడా వీక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోతున్నారుు. ఈ దఫా మెుత్తం 9 జట్లు పోటీ పడుతున్నారుు. ఆ జట్లను స్పాన్సర్‌ చేస్తున్న వారు కూడా సందడి ఎక్కువగానే చేస్తున్నప్పటికీ అవేవీ సాధారణ ప్రజానీకాన్ని చేరుకోవడం లేదు. ఇటీవలి కాలంలో ఇంగ్లాండ్గ, ఆస్ట్రేలియా జట్లు భారతీయ జట్టును వైట్‌వాష్‌ చేసిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు, స్పాన్సర్లు, ఫ్రాంచైజీలు అంతా కూడా ఐపీఎల్‌ పై పడ్డారు. మరి వారి కలలు నెరవేరుతాయా? అసలైన క్రిెకట్‌ మజాను అభిమానులు పొందగలుగుతారా?

mumba
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌నే సంక్షిప్తంగా ఐపీఎల్‌గా వ్యవహరిస్తున్నారు. భారత క్రికెట్‌ నియంత్రణ మం డలి సృష్టించిన ట్వంటీ 20 ఫార్మాట్‌ క్రికెట్‌ పోటీ ఇది. కొం త కాలం క్రితం దాకా ఐపీఎల్‌ పేరు చెబితేనే క్రికెట్‌ అభిమా నులు వీరావేశంతో ఊగిపోయేవారు. ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. ఈ మ్యాచ్‌లకు క్రమంగా ఆదరణ తగ్గుతోంది. ప్రాంతీయత లోపించడం, వ్యాపార ధోరణి పెర గడం లాంటివి పెరగడం ఇందుకు కారణా లుగా చెబుతు న్నారు. మరీ ముఖ్యంగా ఆరంభ మ్యాచ్‌లకు ఆదరణ అంతం త మాత్రంగానే ఉంది. సినీరంగ ప్రముఖులను బరిలోకి దించినా పెద్దగా ఫలితం కన్పించ లేదు. చివరి దశలో ఆదరణ పెరిగే అవకాశం ఉందని క్రీడారంగ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సొమ్ము చేసుకోవడమే ముఖ్యం
65ప్రస్తుత ఎడిషన్‌ విషయానికి వస్తే ఫ్రాంచైజీలు ఐపీఎల్‌ను సొమ్ము చేసుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఇందుకు అవి సోషల్‌ మీడియాను, ఇతర డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లను ఆశ్రయిస్తున్నాయి. భారత జాతీయ జట్టు ఘోర పరాజయాల ప్రభావం ఐపీఎల్‌పై పడదని అంటు న్నాయి. ప్రతి ఫ్రాంచైజీ కూడా తమకంటూ ప్రత్యేక అభిమానులను కలిగి ఉండడం, ప్రతి జట్టులోనూ విదేశీ, స్వదేశీ ఆటగాళ్ళు ఉండడం అందుకు కారణాలుగా చెబుతున్నాయి. రాజస్థాన్‌ రాయల్స్‌ సీఈఓ రఘు అయ్యర్‌ ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టి20 ఫార్మాట్‌లో బాగా విజయవంతమైన ఈవెంట్‌ ఐపీఎల్‌ మాత్రమేనని కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌ సీఓఓ కల్నల్‌ అర్విందర్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు.

గతంతో పోలిస్తే ఈ సీజన్‌ మరింత విజయవంతం కాగలదని అన్నారు. ఐపీఎల్‌ 4 లో రేటింగ్స్‌ లో 29 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. ఐపీఎల్‌లో ప్రతి జట్టు కూడా అభిమాలనులను ఆకట్టుకు నేందుకు ఇంటర్నెట్‌ను మరీ ముఖ్యంగా ఫేస్‌బుక్‌ లాంటి సోషల్‌ వెబ్‌సైట్లను ఆశ్రయించాయి. తమ జట్టు తరఫున క్రికెట్‌ వస్తుసామగ్రి విక్రయాలను ఆరంభించాయి. సోషల్‌ మీడియాలో పాయింట్లు పొందిన వారికి వీటిని తక్కువ రేటుకే కొనే అవకాశం లభిస్తుంది. మొబైల్‌ సంస్థలు కూడా రకరకాల యాప్స్‌ను ప్రవేశపెట్టాయి. ఇవేవీ కూడా ఐపీఎల్‌పై ఆదరణను పెంచలేకపోతున్నాయనే విమర్శకులు అంటున్నారు.

భయపడని బాలీవుడ్‌
1ssఒకప్పుడు ఐపీఎల్‌ సందర్భంగా కొత్త సినిమాలను విడుదల చేసేందుకు బాలీవుడ్‌ భయపడేది. ఇప్పుడలాంటి పరిస్థితి లేదు. ఎన్నో బాలీవుడ్‌ కొత్త సినిమాలు ఈ ఐపీఎల్‌ సీజన్‌లోనే విడుదల కానున్నాయి. గత ఏడాది మే నెలలో ప్యార్‌ కా పంచ్‌నామా చిన్న బడ్జెట్‌ చిత్రం విజయం సాధించింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ దఫా బాలీవుడ్‌ భారీ చిత్రాలను సైతం విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. గతంలో క్రికెట్‌ టోర్నమెంట్లు ఉన్నప్పుడు సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు భయపడేవారని, ఇప్పుడలాంటి పరిస్థితి లేదని ట్రేడ్‌ అనలిస్ట్‌ తరన్‌ ఆదర్శ్‌ వ్యాఖ్యానించారు. ఏప్రిల్‌ మొదటి వారంలో బిట్టో బాస్‌, వికే డోనార్‌ లాంటి సినిమాలు విడుదల య్యాయి. ఐపీఎల్‌ తన ఛార్మ్‌ను కోల్పోయిందని బిట్టో బాస్‌ నిర్మాత కుమార్‌ మంగత్‌ అన్నారు. ‘క్రికెట్‌ ఇప్పుడు రోజూ జరుగుతోంది. అది బిజినెస్‌ను దెబ్బతీయదని’ ఆయన వ్యాఖ్యానించారు. ఉపగ్రహ హక్కుల విక్రయం ద్వారా తాము పెట్టుబడిలో కొంతభాగాన్ని ఇప్పటికే పొందామని ధీమా వ్యక్తం చేశారు.

జనాత్‌ 2 మే నెల 4వతేదీన విడుదల కానుంది. దాని దర్శకుడు కునాల్‌ దేశ్‌ముఖ్‌ కూడా ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. మొదట్లో ఐపీఎల్‌ కొత్తగా అన్పించినా, ఇప్పుడది రోత పుట్టి స్తోందని ఆయన వ్యాఖ్యానించారు. గత నాలుగేళ్ళుగా ఆటలు, సినిమాలు పక్కపక్కనే పయని స్తున్నా యని అన్నారు. ప్రేక్షకులను విడదీయడానికి బదులుగా ఐపీఎల్‌ తమకు ఓ పండుగ వాతావరణాన్ని కల్పిస్తోందని అన్నారు. గత ఏడాది మల్టీప్లెక్స్‌లో మ్యాచ్‌లను తిలకించే అవకాశం కల్పించారు. ఈ ఏడాది ఆ విధమైన హక్కులను బీసీసీఐ ఎవరికీ విక్రయించలేదు. గత ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లోనే దమ్‌ మారో దమ్‌, మరో రెండు ఆంగ్ల సినిమాలు కూడా విడుదలై ఘన విజయం సాధించాయి. ఐపీఎల్‌ సీజన్‌లో విడుదల చేయడం ద్వారా, జులై పోటీని తప్పించు కోవచ్చునని మరో నిర్మాత వ్యాఖ్యానించారు. డిపార్ట్‌మెంట్‌ కూడా ఐపీఎల్‌ సీజన్‌లోనే విడుదల కానుండడం విశేషం.

IPLనిర్దేశిత 20 ఓవర్లలో ప్రతి జట్టు కూడా 160కిపైగా పరుగులు తీసేందుకు వీలుగా తాము శ్రమించినట్లు ఐపీఎల్‌ చైర్మన్‌ రాజీవ్‌ శుక్లా పేర్కొన్నారు. ఆ మరుసటి రోజే చెనై్న సూపర్‌ కింగ్స్‌ 114 పరుగులకే ఆల్‌ అవుట్‌ అయింది. ప్రకటనల రేట్లు కూడా భారీగా పడిపోయాయి. ఐపీఎల్‌ 1లో ఫైనల్‌ మ్యాచ్‌ల సమయంలో 10 సెకన్ల స్లాట్‌ రూ. 10 లక్షలు పలికిన దాఖలాలు ఉన్నాయి . ఐపీఎల్‌ 4లో మల్టీస్క్రీన్‌ మీడియా 10 సెకన్ల స్లాట్‌ను రూ. 13 లక్షలకు కోట్‌ చేసినప్పటికీ చివరకు దాన్ని రూ. 5 లక్షలకు తగ్గించింది. అయినా కొనుగోలుదారులు అంతంతమాత్రమే. అందుకు ప్రధాన కారణం టీఆర్‌పీ రేటింగ్‌ పడిపోవడమే. గతంలో అది 5.5గా ఉండింది. ఇప్పుడది 3.9కు పడిపోయింది. ఐపీఎల్‌ 3లో 12.9గా ఉన్న రేటింగ్‌ ఐఆదరణ కరవుపీఎల్‌ 4కు 7కు పడిపోయింది. మొదటి సీజన్‌ నుంచి కూడా స్పాన్సర్స్‌గా ఉన్న ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌, గోద్రెజ్‌ ఈ సీజన్‌లో పక్కకు వైదొలిగాయి.

టీఆర్‌పీలను బట్టి చూస్తే అంత భారీ మొత్తం వెచ్చించడం తమకు లాభసాటి కాదని ఎల్‌జీ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ ఎల్‌కే గుప్తా వ్యాఖ్యానించారు. ఇతర కార్పొరేట్‌ సంస్థలు కూడా ఐపీఎల్‌పై అంతగా ఆసక్తి కనబర్చడం లేదు. భారతి ఎయిర్‌టెల్‌ ఇప్పుడు ఫార్మూలా1 గ్రాండ్‌ ప్రిక్స్‌పై దృష్టి సారించింది. సహారా ఇండియా తాను పుణె ఫ్రాంచైజ్‌ను కొనేందుకు వెచ్చించిన మొత్తంలో కనీసం 27 శాతాన్ని తిరిగి వెనక్కు చెల్లించాల్సిందిగా డిమాండ్‌ చేస్తోంది. అందుకు కారణం ఐపీఎల్‌ 4లో మొదట పేర్కొన్నట్లుగా 94 మ్యాచ్‌లకు బదులుగా 74 మ్యాచ్‌లే జరిగాయి. 2009లో ఐపీఎల్‌ బ్రాండ్‌ విలువను బ్రాండ్‌ ఫైనాన్స్‌ సంస్థ 2.01 బిలియన్‌ డాలర్లుగా గుర్తించింది. మరుసటి ఏడాది అది 4.13బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఈ ఏడాది అది 3.67 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఢిల్లీ బాయ్‌ గౌతమ్‌ గంభీర్‌, దక్కన్‌ ఛార్జర్స్‌కు శ్రీలంక మాజీ కెప్టెన్‌ కుమార్‌ సంగరక్క, పుణె వారియర్స్‌కు పశ్చిమ బెంగాల్‌కు చెందిన సౌరవ్‌ గంగూలీ నేతృత్వం వహించడం ఓ విషాదం.కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఢిల్లీ బాయ్‌ గౌతమ్‌ గంభీర్‌, దక్కన్‌ ఛార్జర్స్‌కు శ్రీలంక మాజీ కెప్టెన్‌ కుమార్‌ సంగరక్క, పుణె వారియర్స్‌కు పశ్చిమ బెంగాల్‌కు చెందిన సౌరవ్‌ గంగూలీ నేతృత్వం వహించడం ఓ విషాదం.

గతంలో స్పందన
punమొదట్లో భారతదేశంలో ఐపీఎల్‌ సంవత్సరంలోని అత్యంత ప్రముఖ సంఘటనలలో ఒక టిగా మారింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదో కొత్త ఆకర్షణగా నిలిచింది. పాకిస్తాన్లో అభిమానం గొప్పగా ఉందని పాకిస్తానీ క్రిక్‌ఇన్ఫో సంపాదకుడు ఒస్మాన్‌ సమియుద్దిన్‌ వర్ణించారు. అది క్రికెట్‌ క్రమంగా చూడని వారిని కూడా ఆకర్షించింది. ఇదే విధమైన అనుకూల స్పందన శ్రీలంకలో కూడా కని పించింది, క్రికెట్‌ నాయకుడు సనత్‌ జయసూర్య ఉండటం వలన ముంబై ఇండియన్స్‌పై ఆసక్తి అధికంగా కనిపించింది. మొదట్లో కేవలం ఒకే ఒక్క బంగ్లాదేశీ క్రీడాకారుడు ఉన్నప్పటికీ బంగ్లాదేశ్లో కూడా అనుకూల స్పందన కనిపించింది. మొత్తం మీద దక్షిణాసియాలో చాలా ప్రజాదరణ పొందింది. వెస్టిండీస్‌లో ఎంత ప్రజాదరణ పొందిందంటే, కొన్ని వర్గాలలో ఇది టెస్ట్‌ క్రికెట్‌ను అధిగమిస్తుందనే భయం నెలకొంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top