You Are Here: Home » సినిమా » పాటలు » ఆడవారి మాటలకు అర్థాలే వేరులే-కళ్లలో స్వర్గం నువ్వే

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే-కళ్లలో స్వర్గం నువ్వే

పల్లవి :

Oh baby ohh baby
ohh baby ohh baby
you are so sexy
Oh baby ohh baby
ohh baby ohh baby
your give touch me
కళ్లలో స్వర్గం నువ్వే
గుండెలో నరకం నువ్వే
మాటలో మధురం నువ్వే
గొంతులో గరళం నువ్వే
నా ప్రేమగాథ నువ్వే
ఓ చెలియ చెలియా
ప్రియమైన బాధ నువ్వే
నా ప్రేమజోల నువ్వే
ఓ సఖియ సఖియా
మదిలోన జ్వాల నువ్వే

చరణం : 1

పువ్వై పువ్వై పరిమళించినావే
ముళ్లై ముళ్లై మనసు కోసినావే
మెరుపై మెరుపై వెలుగు పంచినావే
పిడుగై పిడుగై కలలు కూల్చినావే
ప్రేమకు అర్థం అంటే
కన్నీట్లో పడవేనా
ప్రేమకు గమ్యం అంటే
సుడిగుండంలోకేనా
చరితల్లోనే ఉందమ్మా
చేరద్దంటూ ఈ ప్రేమ
వినక మతిపోయి
ప్రేమించానమ్మా
కనుక మూల్యాన్ని
చెల్లించానమ్మా ॥ప్రేమగాథ॥

చరణం : 2

నువ్వే నువ్వే ఆదరించినావే
ఆపై ఆపై చీదరించినావే
నిన్నే నిన్నే ఆశ్రయించగానే
నాలో నాలో ఆశ తుంచినావే
కోవెలలో కర్పూరం
నా తనువును కాల్చిందే
దేవత మెళ్లో హారం
ఉరి తాడై బిగిసిందే
ప్రేమపైనే నమ్మకం
కోల్పోయానే ఈ క్షణం
ప్రేమ పనిలేని చోటుకి వెళ్లాలి
నువ్వు కనలేని గూటికి చేరాలి

చిత్రం:ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
రచన : చంద్రబోస్
సంగీతం : యువన్‌శంకర్‌రాజా
గానం : హరిచరణ్, జెన్నీ, మాతంగి, భార్గవి పిళ్లై

– నిర్వహణ : నాగేష్

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top