You Are Here: Home » ఇతర » ఆకలి తీర్చే ‘అక్షయ’

ఆకలి తీర్చే ‘అక్షయ’

భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా పట్టెడన్నం దొరకని వారు ఎందరో ఉన్నారు. పెద్దలైతే ఏదో ఓ పని చేసి పొట్టనింపుకుంటారు. మరి పిల్లలు. పాపం.. పుణ్యం తెలియని పసికూనలు.. ఏం చేస్తారు ఎవరైనా పెడితే తింటారు. బాధ ఎక్కువైతే చెత్తకుప్ప వద్ద ఎంగిలి మెతుకుల కోసం ఎగబడతారు. ఇదిగో ఇలాంటి సంఘటనే అక్షయ పాత్ర ఫౌండేషన్‌కు నాంది పలికింది. 2000లో 15వేల మందితో ప్రారంభమైన ఈ సంస్థ నేడు 1.3 మిలియన్ల చిన్నారులకు అన్నం పెడుతోంది. అదికూడా పరిశుభ్రమైన పౌష్టికాహారం. దీని కోసం యేటా 150 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ మెుత్తంలో ేకంద్ర ప్రభుత్వం 80కోట్లు భరించగా మిగతాది దాతల నుంచి స్వీకరిస్తున్నారు. మన రాష్ట్రంలోనూ వేలాది మందికి అన్నం పెడుతున్న అక్షయ పాత్ర ఫౌండేషన్‌ తాజాగా గోల్ట్‌ షీల్డ్‌ అవార్డు గెలుచుకుంది.

పదమూడేళ్లుగా అన్నం పెడుతున్న‘పాత్ర’
నాంది

prabhupada_2కలకత్తా రాష్ట్రానిి చెందిన భక్తి వేదాంత స్వామి ప్రభుపద ఓ రోజు మయపూర్‌లోని తన ఇంట్లో ఏదో ఆలోచిస్తూ కిటికీలో నుంచి బయటికి చూశాడు. అక్కడ ఓ దృశ్యం అతన్ని చలింపజేసింది. ఆకలి బాధ తట్టుకోలేక కొందరు పిల్లలు ఎంగిలి మెతుకుల కోసం వీధి కుక్కలతో పోరాడుతున్నారు. అవి కరుస్తున్నా లెక్కచేయకుండా తిండి కోసం ఎగబడుతున్నారు. ఆ దృశ్యాన్ని చూసిన ప్రభుపద హృదయం ద్రవించి పోయింది. తన ఉంటున్న ఇస్కాన్‌ ఆలయం చుట్టూ ఉన్న చిన్నారులకైనా ఆకలి బాధ లేకుండా చేయాలి. అదీ చిన్న పిల్లలకు ఎంతో భవిష్యత్తు ఉంది వారు అలా అన్నం కోసం ఇబ్బందులు పడొద్దు.. ఒక్కపూటైనా అన్నం పెట్టాలి. ఏం చేయాలి.. ఏదైనా చేయాలి.. అన్న ఆలోచనల్లోంచి పుట్టిందే ‘అక్షయ పాత్ర’ ఫౌండేషన్‌. ‘‘దేశంలోని ఏ ఒక్క బాలుడు, బాలిక ఆకలిబాధతో చదువు మానేయకూడదు. అలాంటి వారికి ఒక్కపూటైనా తిండి పెట్టి విద్యలో ప్రోత్సహించాలి’’ అన్న నినాదంతో ఈ సంస్థ పనిచేస్తోంది.

ఇంతింతై
Akshayaఆలోచనలు కార్యరూపం దాల్చుతూ 2000 సంవత్సరంలో బెంగలూరులో 1500 మంది పిల్లలతో 5 పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పంపిణీ ప్రారంభమైంది. అక్షయ పాత్రగా దీనికి నామకరం చేశారు. ఇది మొదలయ్యే నాటికి కర్నాటకలో ప్రభుత్వం ఎలాంటి భోజన పథకాన్ని నిర్వహించడంలేదు. దీంతో భయంకరమైన ఆకలితో అల్లాడుతున్న పిల్లల పాఠశాలల నుంచి అక్షయ సంస్థకు ఎన్నో విజ్ఞప్తులు వచ్చాయి. ఈ స్పందనే ఫౌండేషన్‌ విస్తృతం కావాడానికి దోహదం చేసింది. అక్షయ పాత్రకు వస్తున్న విజ్ఞప్తులు కొందరి న్యాయవాదులు ద్వారా సుప్రీం కోర్టుకు చేరాయి. న్యాయమూర్తులు విస్తుపోయారు. స్వతంత్ర భారతావనిలో ఇంకా భావి నిర్మాతలు ఆకలి కేకలు పెడుతున్నారంటే పాలకుల నిర్లక్ష్యమే కారణమని చురకలు అంటించింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇప్పుడు పలు రాష్ట్రాల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉంది. 2003లో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అక్షయ పాత్రకు సాయం అందించి మరి కొన్ని రాష్ట్రాల్లో ఏర్పాటయ్యేలా తోడ్పడింది. దాతల దాతృత్వంతో అప్పటికే దాదాపు 23,000 మందికి పిల్లలకు అక్షయ పాత్ర భోజనం అందిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయం, దాతల ప్రోత్సాహంతో చిన్న సంస్థగా ఉన్న అక్షయ పాత్ర పలు ప్రాంతాలకు విస్తృతం వ్యాప్తి చెందింది. ఇప్పుడు దాదాపు ప్రతి రోజు 1.3 మిలియన్‌ చిన్నారులకు భోజనం పెడుతోంది.

పాలకవర్గం
11Colది అక్షయ పాత్ర ఫౌండేషన్‌(టిఎపిఎఫ్‌) ప్రజా, ధర్మశాల, లౌకిక ట్రస్టు. బెంగలూరు నగరంలో దీన్ని రిజిస్ట్రేషన్‌ చేశారు. బెంగలూరులోని ఇస్కాన్‌ సంస్థలో ఉండేవారిని బోర్డు సభ్యులుగా ఎంపిక చేస్తారు. మధు పండిట్‌ దాసా, అధ్యక్షుడు, అక్షయ పాత్ర ఫౌండేషన్‌చంచలపతి దాసా, ఉపాధ్యక్షుడుచిత్రాంగ చైతన్య దాసా, ప్రోగ్రాం డైరెక్టర్‌టి.వి.మోహన్‌దాసా పై, అధ్యక్షుడు, మణిపాల్‌ యూనివర్సల్‌ లెర్నింగ్‌అభయ్‌ జైన్‌, బోర్డు సభ్యుడు, హెడ్‌గ్రూప్‌ కార్పొరేట్‌ అఫైర్స్‌, మణిపాల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ గ్రూప్‌రాందాస్‌ కామత్‌, సీనియర్‌ ఉపాధ్యక్షుడు, అడ్మినిస్ట్రేషన్‌, కమర్షల్‌ ఫెసిలిటీ, ఇన్‌ఫ్రాస్టక్చర్‌ అండ్‌ సెక్యూరిటీ, ఇన్ఫోసిస్‌బాలకృష్ణణ్‌, మెంబర్‌ ఆఫ్‌ బోర్డు హెడ్‌, ఇన్ఫోసిస్‌ బిపిఓ, ఫైనాన్సియల్‌ అండ్‌ ఇండియా బిజినెస్‌ యూనిట్‌ రాజ్‌కొండూర్‌, డైరెక్టర్‌, ఎసెంట్‌ క్యాపిటల్‌

యేటా 150 కోట్ల పైనే ఖర్చు
Akshaya-(2)పది రూపాయల నుంచి ఎంత ఇచ్చినా ఫౌండేషన్‌ స్వీకరించి దాతలుగా పరిగనిస్తుంది. ఇప్పటి లెక్కల ప్రకారం దాతల సంఖ్య లక్ష దాటింది. పెద్ద పెద్ద కంపెనీలు సైతం విరాళాలు అందిస్తున్నారు. ఇన్ఫోసిస్‌ పథకం ప్రారంభం నుంచి తన వాటాలను అందిస్తోంది. దీనితో పాటు గోద్రేజ్‌, జిందాల్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, స్టీల్‌ ఆథారిటీ, హెచ్‌డిఎఫ్‌సి, పెప్పికో, పిలిప్స్‌, హెచ్‌పీసిఎల్‌ లాంటి బడా కంపెనీలు ఈ సేవా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాయి. దాదాపు యేటా 150కోట్ల రూపాయల ఖర్చుతో దేశంలోని 10 రాష్ట్రాల్లో అక్షయ పాత్ర భోజనాలను అందిస్తోంది. ఈ మొత్తంలో సగభాగం కేంద్ర ప్రభుత్వం భరిస్తోంది.

అవార్డులు
akxayaFభారత పౌర సంబంధాల కమిటీ ఇటీవల తన 7వ సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ సారి ఈ కమిటీ అక్షయ పాత్ర ఫౌండేషన్‌కు గ్లోబల్‌ అవార్డు ఇచ్చింది.అదేవిధంగా అమెరికా కమ్యూనికేషన్‌ ఫ్రొఫెషనల్స్‌ లీగ్‌ ఇచ్చే విజన్‌ అవార్డుకు 2011-12సంవత్సరానికి గాను అక్షయ పాత్ర ఫౌండేషన్‌ బంగారు పతకం అందుకుంది.ఇన్సిస్ట్యూట్‌ ఆఫ్‌ చారిటెడ్‌ అకౌంట్స్‌ ఆఫ్‌ ఇండియా 2011-12 సంవత్సరానికి గాని అక్షయ ప్రాతకు గోల్డ్‌ షీల్డ్‌ అవార్డును ఇచ్చింది. పరిశుభ్రతతో కూడిన పౌష్టికాహారం అందిస్తున్నందుకు గాను రెండు సంవత్సరాలుగా ఎపిక్యూరస్‌ అవార్డు గెలుచుకుంటోంది.భాగీరథి, ఎంఐఎఫ్‌, మెరిట్‌ సర్టిఫికెట్లు ఇలా మరెన్నో అవార్డులను అక్షయ పాత్ర ఫౌండేషన్‌ సొంతం చేసుకుంది.

లక్ష్యం
Feedదేశంలో 5 మిలియన్ల చిన్నారులకు ఒక్క పూటభోజనం అందించాలి.ఈ లక్ష్యాన్ని 2020లోపు చేరుకోగలగాలి.అందరిీ వారి వయస్సునుబట్టి పరిశుభ్రతతో కూడిన పౌష్టికాహారం అందించగలగాలి.పిల్లలంతా పనులు మాని పాఠశాలవైపు అడుగులు వేసేలా చేయాలి.విద్యాభివృద్ధి సాధిస్తే వారి కుటుంబ, తద్వారా దేశంపురోగతి చెందుతుంది.పాఠశాలల్లో పర్యావరణాన్ని పెంచడంతో పాటు వచ్చే విద్యార్థుల సంఖ్యను పెంచడం

సంగీత దర్శకుడు శంకర్‌ మహదేవన్‌ అక్షయ పాత్రకు గుడ్‌విల్‌ అంబాసిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇది ఆయనకు దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొంటారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాలని ఉండేదని అయితే పని ఒత్తిడి కారణంగా అలాంటి అవకాశాలు రాలేదన్నారు. అక్షయ పాత్ర ద్వారా తన కలను నేరవేర్చుకుంటున్నట్లు ఆయన వివరించారు.

మనం ఇచ్చే ప్రతి రూపాయిలో 85పైసలు పిల్లలకు ఆహారం అందించడం కోసం ఖర్చుచేస్తారు. 15పైసలను ఈ వ్యవస్థ నడవడానికి వినియోగిస్తారు.

మీరు విరాళం ఇవ్వాలనుకుంటే… 0897 006 0006, 09379 111 222,
ఎస్‌ఎంఎస్‌ పంపేందుకు నెం. 0897 006 0003
సైట్‌ donorcare@akshayapatra.org

ఎక్కడెక్కడ.. ఎంత మంది…
(అధికారిక వివరాల ప్రకారం)

ప్రాంతం	          విద్యార్థులు	పాఠశాలలు
ఆంధ్రప్రదేశ్‌...
హైదరాబాద్‌ 37,535 248
విశాఖపట్నం 5207 7
అస్సాం...
గౌహతి 47,571 510
చత్తీస్‌గడ్‌..
బిలై 29,771 159
గుజరాత్‌...
గాంధీనగర్‌ 1,32,045 525
వడోదరా 1,28,589 616
కర్నాటక...
బెంగలూరు 1,00,651 505
బల్లారి 1,33,384 622
హుబ్లీ 1,47,344 780
మంగలూరు 25,292 145
మైసూర్‌ 16,510 62
వసంతపుర 1,19,000 567
ఒరిస్సా...
పూరి 50,841 436
నయాఘర్‌ 30,209 360
రాజస్తాన్‌...
జైపూర్‌ 1,25,600 1423
నత్దవరా 17,580 228
బరన్‌ 14,058 166
ఉత్తరప్రదేశ్‌..
వరిందవన్‌ 1,65,562 1663
తమిళనాడు..
చెనై్న 750 1
మొత్తం 1,368,283 9075

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top