You Are Here: Home » సినిమా » పాటలు » ఆంధ్రుడు (2005)- కోకిలమ్మా బడాయి చాలించు మా సుశీల

ఆంధ్రుడు (2005)- కోకిలమ్మా బడాయి చాలించు మా సుశీల

పల్లవి :
కోకిలమ్మా బడాయి చాలించు మా సుశీల
జానకమ్మా స్వరాలు నీలో లేవమ్మా (2)
చలాకి చిత్రలోన సుమించు చైత్ర వీణ వినీల
జిక్కిలోన వర్షించు పూలవాన
ఆశ లతలోన జనించు తేనె సోన
వినేసి తరించి తలొంచుకెళ్లవమ్మా

చరణం : 1
ఒకే పదం ఒకే విధం కుహు కుహు
అదే వ్రతం అదే మతం అనుక్షణం
నవీన రాగముంది ప్రవాహ వేగముంది
అనంత గీతముంది అసాధ్య రీతి ఉంది
చేరవమ్మ చరిత్ర మార్చుకోమ్మా శ్రమించి
కొత్తపాట దిద్దుకోమ్మ ఖరీదు కాదులేమ్మ

చరణం : 2
మావిళ్లలో నీ గూటిలో ఎన్నాళ్లిలా హా హా
మా ఊరిలో కచ్చేరిలో పాడాలిగా హా హా
చిన్నారి చిలక పైన సవాలు చేయకమ్మా
తూనీగ తేనెటీగ చప్పట్లు చాలవమ్మ
దమ్ములుంటే నాపైన నెగ్గవమ్మ అదంత
తేలికేమి కాదులేమ్మా ఎత్తాలి కొత్త జన్మ

చిత్రం : ఆంధ్రుడు (2005)
రచన : చంద్రబోస్
సంగీతం : కళ్యాణి మాలిక్
గానం : శ్రేయాఘోషల్

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top