You Are Here: Home » ఇతర » అహ నా పెళ్ళియంట..!

అహ నా పెళ్ళియంట..!

ప్రకృతి సిద్ధంగా పురుషుడైన పంకజ్‌ శర్మ ఆతర్వాత సెక్స్‌ మార్పిడి చేయించు కుని ఇప్పుడు బాబీడార్లింగ్‌గా మారిన విషయం అందరికీ తెలిసినదే. ఇప్పుడు ఈమె బాలీవుడ్‌ చలన చిత్ర సీమలో తన నటనా పాఠవాలు ప్రదర్శిస్తోంది. అలాగే అనేక సీరియల్స్‌లో కూడా రాణిసోంది. ఇప్పుడు విషయం ఏమిటంటే, తనకీ ప్రేమించాలన్న కుతూహలం కలుగుతోందిట.

1fillerఅలాగని ఎవరిని పడితే వారిని ప్రేమించడం కుదరదని కూడా కచ్ఛితంగా చెప్పేస్తోంది. మరి నువ్వు ఎవర్ని పెళ్ళాడతావ్‌? అని అడిగితే ఈమె చెప్పే సమాధానానికి వెంటనే ఒక షోడా తాగవలసి వస్తోందని సదరు చుట్టూ ఉన్నవాళ్ళు అంటున్నారు. ఇంతకీ ఈమెకి నచ్చిన వాడు ఎవరో తెలుసా..! తన కలల మనోహ రుడు సాక్షాత్తూ రాహుల్‌ గాంధీ. తనకి అతడే సరైన జోడీ అని ‘ఓ ముజే బహూత్‌ పసంద్‌ హై’ అని మురిసిపోతూ చెప్పిందిట. మరో విషయం ఏమిటంటే బాబీ డార్లింగ్‌, రాహుల్‌కి పిచ్చి ఫాన్‌ట. అందుకే అస్తమాను ఢిల్లీ వెళ్ళడం అంటే తనకెంతో ఇష్టమని అంటోంది. ఇలా అవకాశం దొరికినప్పుడల్లా వెడుతూ వుంటే, రాహుల్‌తో ఎప్పటికైనా మంచి కాంటాక్ట్‌ ఏర్పడుతుందని గట్టినమ్మకంతో ఉంది. రాహుల్‌ని పెళ్ళాడాలన్నదే నా కల. ఆ తర్వాత మిసెస్‌ గాంధీగా మిగిలిపోవాలన్నదే నా కోరిక అంటోంది బాబీడార్లింగ్‌. ఏమిటో అటూఇటూ కాని కోరికలు ఎలా నెరవేరతాయో ముందు ఒకసారి ఆలోచించాలిగా..!

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top