You Are Here: Home » ఇతర » అసూయ మనెకందుకూ?

అసూయ మనెకందుకూ?

2fillerఅసూయ అనేది లేనివారంటూ ఎక్కడా ఉండరు. ఏదో ఒక విషయంలో జీవితంలో ఒక్కసారైనా అసూయ చెందడం జరగకుండా ఉండదు. అయితే అసూయ వల్ల నష్టమే కానీ ప్రయోజనం అనేది చరిత్రలో లేదు. ఇది అందరికీ తెలిసినా అసూయ పడక మానరు. ఈ విషయంలో ఎక్కువగా అసూయచెందే గుణం ముఖ్యంగా మహిళల్లోనే ఎక్కువ శాతం ఉంటుంది. ఇది మనసుకి సంబంధించిన విషయం. ఇది పేద, ధనిక తరగతులు అనే భేదం లేకుండా ఆయా తరగతులకు తగ్గట్టు తగిన మోతాదులో అసూయా, ద్వేషాలు రగులుతూనే ఉంటాయి. మనం సాధించలేని దాన్ని మరెవరైనా సాధించారని తెలిస్తే ఉన్నట్టుండి అసూయ అక్కడ ప్రత్యక్షమవుతుంది. తద్వారా ఏదైనా చేటు జరిగేంతవరకు అది మనల్ని వదలదు. విశాలభావంతో చూస్తే అలా అసూయకు గురికావడం మంచిదికా దనిపిస్తోంది. తనకు సాధ్యం కాని పనిని మరో వ్యక్తి సాధించగలిగారంటే దాన్ని ప్రశంసించాల్సి ఉంటుంది.

ఈ జాఢ్యం నుండి బయటపడాలంటే, ఎదుటివార్ని మనసారా అభినందించడం అలవాటు చేసుకోవాలి. ఏదైనా ఘన కార్యాన్ని భజాన వేసుకున్నవారికి అండదండలందించి వారి విజయానికి తోడ్పడితే సగం విజయం మీదే. అసూయ తెలిగా అందరూ పసికడతారు. అందువల్ల నలుగురిలో మీరు చులకనవుతారు. అదే మీరు ప్రతిదానిని నిష్కల్మషంగా స్వాగతించడం అలవాటు చేసుకుంటే మీ ఔన్నత్యం మిమ్మల్ని ఆకాశం అంత ఎత్తుకు తీసుకువెడుతుంది. అదే మానవత్వం అనికూడా అంటారు. మనసులో కలిగే ఇటువంటి వికారాలు తొలగిపోవాలంటే, మంచి పుస్తకాలు చదవడం, ఉన్నతాశయాలు గలవారితో చెలిమిచేయడం ఎంతో ఉపయోగపడతాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top