You Are Here: Home » చిన్నారి » అసూయ

అసూయ

ఒక రైతు దగ్గర ఒక గాడిద, మేక ఉండేవి. గాడిద రోజంతా పొలంలో కష్టపడి పనిచేసేది. గాడిద తినడానికి రైతు ఆహారం ఇచ్చేవాడు. మేకకు తన ఆహారం తాను వెతుక్కోవలసి వచ్చేది. పైగా యజమాని రోజూ గాడిదను మెచ్చుకోవడం విని మేకకు అసూయ కలిగింది. ‘ఒకవేళ గాడిద పనిచేయడం మానేస్తే యజమాని దాన్ని మెచ్చుకోవడం, ఆహారం పెట్టడం మానేస్తాడు’ అని అనుకుంది.

ఒకరోజు అవకాశం చూసుకుని గాడిదను ఒక పెద్ద గుంతలోకి తోసేసింది. దానితో గాడిద గాయపడింది. రైతు వైద్యుడిని తీసుకువచ్చాడు. అతడు గాడిదను పరీక్షించి ‘‘ఇది త్వరగా కోలుకోవాలంటే మేక కాళ్ళతో కాచిన వేడి వేడి రసం ఇవ్వాలి’’ అని చెప్పాడు. ఇంకేముంది అసూయతో గాడిదకు హాని చేయాలనుకున్న మేక తానే బలైపోయింది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top