You Are Here: Home » ఇతర » అసుర గణాలు

అసుర గణాలు

పూర్వం సృష్టి ఆరంభంలో దేవతలు, రాక్షసులు అను రెండు వర్గాలు సృష్టించ బడ్డాయి. రాక్షసులు అంటే ఎవరో కాదు వారిలో ఉండేటటు వంటి గుణాలే(కామ, కోధ, లోభ, మద మాత్సర్యాలు). ధనం ఉన్నదన్న గర్వంతో కన్నుమిన్ను గానక ప్రవర్తించడం, పెద్ద వారిని గురువు లను గౌరవించక కించ పరచటం, తమ మాటలతో చేష్టలతో ఎదుట వారిని బాధించటం అసుర గుణాల క్రిందకు వస్తాయి. మోహవశులైన అసుర స్వభావం కలిగిన వారు నిరంతరం కామ భోగాలలో చిక్కుకొని చివరకు ఘోర నరకాల పాలవుతారు అనటంలో సందేహం లేదు అని గీతలో చెప్పబడింది.

Uqwరావణుడు, కీచకుడు అధోగతి పాలవుటకు కారణం కామగుణమే రావణుడు సీతను ఎత్తుకొని పోయి అప కీర్తిని పొంది చివరకు శ్రీరాముని చేతిలో ప్రాణాలను సైతం పోగొట్టు

కున్నాడు. భగవద్గీత పదహారవ అధ్యా యంలో దైవీ సంపత్తి, అసుర సంపత్తి గురించి వివరించబడింది. దైవీ సంపత్తి ః- నిర్ధమత్వం, మనోనై ర్కల్యం, జ్ఞానం, ఆత్మ సంయమనం, దయ, త్యాగం అహింస, వినయం, సత్య సంధత మొదలైనవి. అసుర సంపత్తి – అహంకారం, గర్వం, క్రూరత్వం, అజ్ఞానం, సోమరితనం మొదలైనవి.

హిరణ్యకశ్యపుని అహంకార గుణాన్ని రూపుమాటడానికి ప్రహ్లాదుని సృష్టించి నరసింహ అవతారంలో ఆ విష్ణుమూర్తి హిరణ్యకశ్యపుని చీల్చి చెండాడెను. ఎప్పుడైతే మనం ఈ అసుర గుణాలను వదిలించుకొని వాటి స్థానంలో ప్రేమ, దయ, త్యాగం, అహింస, వినయం వంటి గుణాలను భర్తి చేస్తామో అప్పుడే మనిషి నిజమైన మానవత్వం ఉన్న మనిషి అవుతాడు.

– టి ఎన్‌ లక్ష్మి, విజయవాడ. 94418524999

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top