You Are Here: Home » చిన్నారి » కవితలు » అవే కాళ్ళు

అవే కాళ్ళు

కాలం
గురి చూసి కొట్టే దెబ్బ
మొదట తగిలేది
కాళ్ళకే.

హరిణాలకు
సవాలు విసిరిన పరుగులు
కొండలు ఉలిక్కిపడేంతగా
ఎక్కిన చురుకుదనాలు.
వల విసిరిన వృద్ధాప్యంతో
కలచెదిరిన జీవయాత్ర!
అదే కళేబరం
పోను పోనూ మరింత భారం.

కవాతు చేసిన కాళ్ళు
ఒకప్పుడు జవానులకు నకళ్ళు
ఇప్పుడు
కళ్ళనుంచి రాలే వడగళ్ళు.

గాలిలో
నిలదొక్కుకునే జ్వాలలా
అది నడక కానే కాదు
దిగమింగలేని చేదు.

దేవుడా!
దైన్యం రానివ్వకు
కాళ్ళకింది భూమిని
వెనక్కి పరిగెత్తించు.

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top