You Are Here: Home » ఇతర » అవును ! అజిత్ ఐఏఎస్

అవును ! అజిత్ ఐఏఎస్

కొంతమంది జీవితగాధలు మన మనస్సుపై చెరగని ముద్ర వేస్తారుు. మరి కొందరివి మనెకంతో స్ఫూర్తిని అందిస్తారుు. ఇంకొన్ని మాత్రం చెరగని ముద్ర వేస్తారుు, అంతు లేని స్ఫూర్తిని అందిస్తారుు… జీవితాంతం చెక్కు చెదరని జ్ఞాపకంగా మదిని వెంటాడు తూనే ఉంటారుు. ఓ అంధ ఐఏఎస్‌ అధికారిది. అలాంటి అద్భుత పోరాట పటిమతో కూడిన జీవితగాధనే. తాను కోరుకున్న ెకరీర్‌ సాధించుకునేందుకు ఆయన యావత్‌ వ్యవస్థతో పోరాటం చేయాల్సి వచ్చింది. మూడేళ్ళ పాటు సాగిన అలుపెరుగని పోరాటంలో చివరకు విజయం ఆయనను వరించింది. మరెందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఆయనే అజిత్‌ కుమార్‌, ఐఏఎస్‌. ఆయన వివరాలు తెలుసుకుందామా మరి…

Un5మూడేళ్ళ పోరాటం అనంతరం అజిత్‌కుమార్‌ (32) ఐఏఎస్‌ కాగలిగాడు. తన కలను నిజం చేసుకున్నాడు. ఐఏఎస్‌ కావడమూ ఓ గొప్పేనా…ఎంత మంది ఐఏఎస్‌లు లేరు దేశంలో… అనుకుంటే మాత్రం తప్పులో కాలేసినట్లే. ఆయన అంధుడు. ఒక అంధుడు ఐఏఎస్‌ శిక్షణకు ఎంపికవడం ఇదే తొలిసారి. ప్రధాన మంత్రి స్వయంగా జోక్యం చేసుకోవడంతో ఇది సాధ్యపడింది. పూర్తి అంధత్వం ఉన్నప్పటికీ ఐఏఎస్‌ సాధించిన రెండో వ్యక్తి ఆయనే. సివిల్స్‌లో మంచి ర్యాకు సాధించినప్పటికీ ఆయనను మొదట్లో ఐఏఎస్‌ శిక్షణకు ఎంపిక చేయలేదు. దాంతో క్యాట్‌లో కేసు వేసి తగు ఉత్తర్వులు పొందాల్సి వచ్చింది. ఆ తరువాత కూడా పాలనాపరమైన అడ్డంకులు మరెన్నో ఎదురయ్యాయి.

పాఠశాల చదువులోనూ ఫస్ట్‌
అజిత్‌ తండ్రి రామ్‌పథ్‌ బ్లాక్‌డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌గా పని చేసి రిటైర్‌ అయ్యారు. తల్లి గృహిణి. ఆమె ఏనాడూ పాఠశాలకు వెళ్ళలేదు. మొత్తం అయిదు మంది అన్నదమ్ములు. ఒక సోదరి. కళ్ళు లేకపోయినప్పటికీ అజిత్‌ను చదివించాల్సిందిగా వారి గ్రామానికి చెందిన ఆధ్యాత్మికవేత్త ఒకరు సూచించారు. అలా అజిత్‌ చదువు కొనసాగింది. ఆ పాఠశాలో అజిత్‌ ఒక్కడే అంధవిద్యార్థి. ఆశ్చర్యకరంగా తొమ్మిది, పదో తరగతుల్లో అజిత్‌ తరగతిలో మొదటి స్థానం సాధించడం విశేషం. ఆ తరువాత ఆయన ఢిల్లీలోని రామ్‌జాస్‌ కాలేజ్‌లో బీఏ (పొలిటికల్‌ సెైన్స్‌) పూర్తి చేశారు. అనంతరం బీఎడ్‌ కూడా చదివి మొదట ఆయన హర్యానా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు. ఆ తరువాత యూజీసీ నెట్‌ – జెఆర్‌ఎఫ్‌ ఉత్తీర్ణుడెై ఢిల్లీ యూనివర్సిటీ శ్యామలా కాలేజ్‌ లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరారు.

అంధత్వం సాకుతో…
2009లో అజిత్‌ సివిల్స్‌ ఎగ్జామ్‌ ఉత్తీర్ణుడెైనప్పటికీ, అంధత్వాన్ని సాకుగా చెబుతూ, తక్కువ స్థాయి ఉద్యోగానికి ఎంపిక చేశారు. ‘‘నాకు 208 ర్యాంకు వచ్చినా, ఐఆర్‌పీఎస్‌కు ఎంపిక చేశారు. నిజానికి ఓబీసీలో నా ర్యాంకుకు ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ రావాల్సింది. జనరల్‌ కేటగిరీలో చూసినా ఐఏఎస్‌ ఇవ్వాలి’’ అని అన్నారు అజిత్‌. తనకు ఐఏఎస్‌ ఇవ్వాలంటూ ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు. ఆయన వాదన ను క్యాట్‌ ఆమోదించింది. ఐఏఎస్‌లో చేర్చు కోవాల్సిందిగా 2010 అక్టోబరు లో ఉత్తర్వులిచ్చింది.

వ్యవస్థతో పోరాటం
‘అంధత్వాన్ని ఎదుర్కోవడం నాకు పెద్ద సమస్య కాలేదు. వ్యవస్థతో పోరాటం చేయడమే పెద్ద సమస్యగా మారింది’ అంటారు అజిత్‌. నేషనల్‌ ప్లాట్‌ఫామ్‌ ఫర్‌ ది రెైట్స్‌ ఆఫ్‌ ది డిజేబుల్డ్‌ (ఎన్‌పీఆర్‌డీ), సీపీఎం నాయకురాలు బృందాకారత్‌ ఆయనకు ఈ పోరాటంలో ఎంతగానో సహకరించారు. ఆయన ఇప్పుడు లాల్‌ బహదూర్‌ శాస్ర్తి నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ముస్సోరి)లో శిక్షణ పొందుతున్నారు.

డబ్బు కోసం కాదు…
తాను ఐఏఎస్‌లో చేరాలనుకుంటున్నది డబ్బు కోసం కాదని అంటారు అజిత్‌. దేశంలో బ్యురోక్రసీ వ్యవస్థ ఎలా ఉన్నదో నేను చేసిన పోరాటం నాకు తెలిపింది. ప్రజలు, సమాజ హితం కోసమే నేను ఐఏఎస్‌లో చేరాను అని అంటారు ఆయన.

స్ఫూర్తినిచ్చిన ప్రధాని ప్రసంగం
Untఅంధులకు సెైతం ఐఏఎస్‌ ద్వారాలు తెరవాలని 2005లో ప్రధాని చేసిన ప్రసంగం నాలో కొత్త ఆశలు రేకెత్తించింది. ఐఏఎస్‌ సాధించాలని అప్పుడే నిర్ణయించు కున్నాను అంటారు అజిత్‌. 2008లో ఆయన సివిల్స్‌ ఉత్తీర్ణులయ్యారు. అజిత్‌కు కంప్యూటర్‌ యాక్సెస్‌ లేకపోయింది. బ్రెయిలీ లిపిలో కొన్ని అంశాలపెై మాత్రమే సమాచారం అందుబాటులో ఉండేది. కొన్ని సాంకేతిక ఉపకరణాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. వాటి సాయంతోనే ఆయన తన క్ష్యాన్ని సాధించగలిగాడు. ‘బ్రెయిలీలో నోట్స్‌ రాసుకునే వాడిని. రికార్డ్‌ చేసిన టేప్‌లు వినే వాడిని. నేను సొంతంగా టేప్‌లు రికార్డు చేసుకునే వాడిని’’ అని నాటి జ్ఞాపకాలను గvుర్తు చేసుకుంటారు అజిత్‌.

ఐదేళ్ళ వయస్సులో కాటేసిన అంధత్వం
అజిత్‌కుమార్‌ ఐదేళ్ళ వయస్సులో అతిసార వ్యాధికి గురయ్యాడు. ఆ వ్యాధి ఆయన కంటిచూపును శాశ్వతంగా బలి తీసుకుంది. అయినా కూడా అన్ని రకాల అడ్డంకులనూ అధిగమిస్తూ ఐఏఎస్‌ కాగలిగాడు. దక్షిణ హర్యానా లోని మహేంద్రనగర్‌ జిల్లా ఖేరి గ్రామానికి చెందిన అజిత్‌ నేడు అందరికీ ఆదర్శంగా నిలిచారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top