You Are Here: Home » ఇతర » అవిశ్రాంత రచయిత్రి శాంత

అవిశ్రాంత రచయిత్రి శాంత

సాహితీ లోకంలో అనంత తీరాల గమ్యాలు చేరుతున్నారు మహిళలు. కవితలైనా , కథలైనా, పద్యాలైనా. పదాలైనా, వ్యాసాలైనా, వ్యాకరణాలైన, అనువాదాలో, అనుబంధాలో అన్నిటిలోను తమదే పైచేరుు అంటూ దిగంతాల కీర్తిని తమ సొంతం చేసుకుంటున్నారు. అలా మెరుస్తున్న మరో ఆణిముత్యం శాంతా ఆచార్య. కవిత్వంలోను, సాహిత్య రంగంలోను ఎంతో అరుదైన విజయాల్ని తన సొంతం చేసుకుని అంతర్జాతీయంగా గుర్తింపుని సాధించింది.

D1భారతదేశంలోను, యునైటెడ్‌ కింగ్‌డం, అమెరికాల్లో విద్యాభ్యాసం చేసింది. ఈ మూడు దేశాల్లోను విస్రృతం గా పర్యటించి ఎన్నో చోట్ల పనిచేసి ఆ అనుభవంతో అంతర్జాతీయ ఖ్యాతిని సాధించింది. ఈమె ఒరిస్సా రాష్ట్రం లో కటక్‌లో జన్మించింది. అక్కడే సెయింట్‌ జోసెఫ్స్‌ కాన్వెంట్‌ లోను, రవెన్షా కాలేజీలోను చదివి ఇంగ్లీష్‌లో మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్‌‌సలో పట్టాపొందింది. ఎంఏ ఇంగ్లీష్‌లో ఉత్కల్‌ యూనివర్శిటీలో అత్యధిక స్థానాన్ని సంపా దించి బంగారు పతకాన్ని సాధించింది. అంతేకాకుండా ఎంతో ప్రతిష్టాత్మకమైన ‘రాయ్‌ బహద్దూర్‌ జానకీనాథ్‌ బోస్‌’ బహుమతిని కూడా తన కైవశం చేసుకుంది. ఈ బహుమానాన్ని ఈమె రేవన్షా కాలేజీలో అన్ని రంగాల్లోను చూపిన ప్రతిభకు గుర్తిపుగా అందజేసారు. 1979లో ఆక్స్‌ఫర్డ్‌లో చదవటానికి స్కాలర్‌షిప్‌ రాగా ఓర్సిష్టర్‌ కాలేజీలో మొట్టమొదటి బ్యాచ్‌లోనే చేరింది. అక్కడ ఈమె డాక్టరేట్‌ చేసి డిఫిల్‌ పురస్కారాన్ని పొందింది. ఆక్స్‌వర్డ్‌లోనే వయోలెట్‌ వోగాన్‌ మోర్గన్‌ ఫెలోషిప్‌ని కూడా పొందింది.

అదే విధంగా 1983-85 మధ్య హార్వార్డ్‌ యూనివర్సిటీకి ఇంగ్లీష్‌ విభాగంలో అమెరికన్‌ సాహిత్యం, భాష, పరిశోధకురాలిగా వెళ్ళింది. ఇక 1985లో శాంత లండన్‌ చేరి, అక్కడ ప్రపంచ ఆర్ధిక సేవలందించే సంస్థ, మోర్గన్‌ స్టాన్లీ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌లో చేరింది. ఈ సంస్థ న్యూయార్క్‌ కేంద్రంగా 42 దేశాల్లో 1300 బ్రాంచీలు కలిగివుంది. ఈమె ఆ సంస్థకు, భారతదేశంలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు మధ్య భారత దేశానికి పెట్టుబడులు అందించే దిశగా ఒడంబడికలకోసం చొరవతీసుకుని విజయాన్ని సాధించింది. లండన్‌ లోని స్విస్‌ బ్యాంక్‌ కార్పొరేషన్‌ శాఖకు కార్యనిర్వాహకురాలిగా కూడా పనిచేసింది. అదే విధంగా 2002 నుండి 2008 వరకూ లండన్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ ఐర్లాండ్‌కు సీనియర్‌ క్లైంట్‌ సర్వీసెస్‌ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహించింది. మరో పక్కన లండన్‌ బిజినెస్‌ స్కూలుకు ఫౌండేషన్‌, ధర్మాదాయ ఆస్తినిర్వహణాధికారిగా కూడా తన వంతు సేవలందించింది.

ఈ విధంగా తన మేధాసంపత్తితో వృత్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్న శాంతా ఆచార్య మరో కోణంలో గొప్ప సాహితీవేత్త. అంతేకాకుండా ఈమె అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఒక కవయిత్రి. ఈమె 5 కవితా సంకలనాలు ప్రచురించింది. ఈమె కవితా సంకలనాలు యునైటెడ్‌ కింగ్‌డంలోను, యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికాలోను, ఇండియాలోను కూడా ఎంతో ప్రజాదరణ పొందాయి. ఈ మూడు దేశాల్లోను ఈమె పుస్తకాలు విరివిగా లభ్యమవుతున్నాయి. లాంగ్వేజ్‌ ఫర్‌ ఏ న్యూ కంట్రీః (కొత్త ప్రపంచానికి భాష). ఈ గ్రంధంలో తూర్పు మధ్య ఆసియా సమకాలీన కవితా సంకలనం 2008లో ప్రచురితమయ్యింది.

Shaa‘తెంబ తుపు’ (నగ్న నడక) (వాకింగ్‌ నేకెడ్‌) ఆఫ్రికా మహిళల నేపథ్యంలో రాసిన ఈ కవితా సంకలనాన్ని 2008లో వారెన్‌ సంపాదకీయంలో ప్రచురించడం జరిగింది. 2009లో ది ఇండియన్‌ పొయిట్రీ విడుదలయ్యింది. 1990 నుండి 2007 వరకూ ఉన్న భార తీయ కవయిత్రుల నేపథ్యంలో విడుదలయ్యిన గ్రంధం ఇ.వి. రామకృష్ణన్‌, అంజుమ్‌ ముఖిజా సంపాదకీ యంలో ప్రచురింపబడింది. దీనికి 2009లో ఢిల్లీ సాహిత్య అకాడమీ అవార్డ్‌ దక్కింది. 1996 నుండి ఈమె లండన్‌లో లవ్‌డర్‌డేల్‌ హౌస్‌లో వ్యవ స్థాపక కార్యదర్శిగా నేలవారీ కవితా పత్రికల్ని సంస్కరించే బాధ్యతను స్వచ్ఛందంగా స్వీకరించి తన సేవలు అంది స్తోంది. అంతేకాక ఆర్వన్‌ ఫౌండేషన్‌ సంస్థ అభివృద్ది శాఖలో తన సేవలు అందిస్తోంది.

తృష్టీస్‌ ఆఫ్‌ ది పొయిట్రీ స్కూలు బోర్డు మెంబర్‌గా కూడా వ్యవహరిస్తోంది. అక్కడున్న కవితా సంఘా నికి శాశ్వత సభ్యురాలిగా కొనసాగుతోంది. యుకెలో ఈ సంస్థకి శాంతా ఆచార్య సెప్టెంబర్‌ 2011న ఎన్ను కోబడింది. ఎన్నో సందర్భాల్లో ఎన్నో సంస్థలు ఈమె కవితా గానానికి ఆహ్వానిస్తూవుంటాయి. యుకె, యుఎస్‌, ఇండియాలో జరిగే సాహిత్య సభలకు ఈమెకు తప్పక ఆహ్వానం ఉంటుంది. ఈమె రచనా గ్రంధాలు యుకెలోని బార్బికన్‌ లైబ్రేరీలోను, అమెరికాలోని బోస్టన్‌ యూనివర్సిటీలో మనకి లభ్యమ వుతాయి.

అంతేకాకుండా కెనేడియన్‌ హైకమిషన్‌ యుకె, కంబెర్లాండ్‌ లాడ్జ్‌, విండ్సర్‌ యుకె, ఆంగ్ల విభాగం, జమియా ఇస్లామియా న్యూ ఢిల్లీ, గుడ్‌ఎనఫ్‌ కాలేజీ, యుకె, హార్వర్డ్‌ కాలేజీ, అమెరికా, హైదరాబాద్‌ సాహిత్య ఉత్సవం, హైద్రాబాద్‌, ఇండియా ఇంటర్నేషనల్‌ సెంటర్‌, ఢిల్లీ, నేషనల్‌ పొట్రయిట్‌ గ్యాలరీ, యుకె, రైడల్‌ లిటరరీ ఫెస్టివల్‌, యుకె, సెయింట్‌ ఎథిల్‌బర్గ్‌‌స సెంటర్‌ ఫర్‌ రికన్సిలేషన్‌ అండ్‌ పీస్‌, లండన్‌, సెంథిల్‌ హాల్‌ బెంగళూరు, యూనివర్సిటీ ఆఫ్‌ మధురై- మథురై, ది హెబిటైల్‌ సెంటర్‌- న్యూ ఢిల్లీ, ది నెహ్రూ సెంటర్‌-లండన్‌, ఉస్మానియా యూనివర్సిటీ- హైదరాబాద్‌, ది పొయిట్రీ కేఫ్‌, యు.కె, సాహిత్య అకాడమీ-ఢిల్లీ, థియోసాఫీ హాల్‌- ముంబాయి, టార్బే ఫెస్టివల్‌ ఆఫ్‌ పొయిట్రీ- యుకెల్లో ఈమె పుస్తకాలు ప్రదర్శించబడతాయి.

అంతేకాకుండా ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటాయి.
శాంతా ఆచార్య సలహాదారుగా నేటికీ అనేక సంస్థలకు, వ్యక్తులకు ఆస్తులు నిర్వహించడంలో తగిన సలహాదారుగా పనిచేస్తూ, అలాగే కళలు, విద్య, కవిత ఇతర రంగాలకి కూడా ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తోంది.

శాంతా ఆచార్య హాబీలు
Shantaనాటికలు
సినిమాలు
సంగీతం
చిత్రలేఖనం
విహారం
వంటచేయటం
పుస్తక పఠనం
ఫోటోగ్రఫీ
నాయకత్వం వహించడం
వయం సేవా కార్యక్రమాలు నిర్వహించడం’

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top