You Are Here: Home » ఇతర » అవార్డుల్లో కి(టా)ంగ్‌

అవార్డుల్లో కి(టా)ంగ్‌

ఇప్పటి వరకు నోబెల్‌ ప్రైజ్‌ను మించిన బహుమతి లేదు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఫైజ్‌ అది. దీని కోసం ఆయా రంగాల్లోని వారు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంటారు. నోబెల్‌కు ఎంపిెకైతే తమ జీవితం సార్థకం అరుునట్లే అని భావిస్తారు. ఈ అవార్డుకు ఎంపిక సమాజంలో ఎంతో ెదాని ఇస్తుంది. ఇంత ప్రఖ్యాతి గాంచిన అవార్డును తలదన్నే ప్రైజ్‌ మరోటి వచ్చింది. అదే టాంగ్‌ ప్రైజ్‌. దీని విలువ రూ.9.35 కోట్లు… అయ్యబాబోయ్‌ అంత డబ్బా అని ఆశ్చర్యపోతున్నారా… దీన్ని తైవాన్‌ వ్యాపారవేత్త శ్యామ్యుల్‌ నెలకొల్పాడు. దీని కథాకమామిషూతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చెప్పుకోదగ్గ మరి కొన్ని అవార్డుల గురించి తెలుసుకుందాం…

టాంగ్‌ అవార్డు…
ప్రఖ్యాత నోబెల్‌ ప్రైజు కన్నా ఎక్కవ మనీతో ఓ బహుమతిని ఇవ్వాలని అసియాకు చెందిన తైవాన్‌ వ్యాపారవేత్త శ్యామ్యూల్‌ నిర్ణయించారు. నోబెల్‌కు ధీటుగా టాంగ్‌ను ప్రవేశ పెట్టేందుకు సిద్ధమయ్యారు. టాంగ్‌ బహుమతి విజేతలకు రూ.9.35 కోట్లు ఇస్తారు. ఈ విషయాన్ని రెంటెక్స్‌ గ్రూప్‌ అధినేత స్వయంగా ప్రకటించారు.

samuelక్రీ.శ. 618-917 సంవత్సరాల మధ్యకాలంలో పరిపాలనలో ఉన్న టాంగ్‌ వంశస్థులు సాంస్కృతిక, శాస్ర్తీయ రంగాల్లో చైనా అభివృద్ధి చెందడానికి ఎనలేని కృషి చేశారు. వీరి పేరుతో రూ.566 కోట్లతో ఓ ఫౌండేషన్‌ ఏర్పాటు చేసి, ’టాంగ్‌’ ప్రైజ్‌ ఇవ్వాలని శ్యామ్యూల్‌ నిర్ణయించారు. ప్రతి రెండేళ్లకోసారి ఇచ్చే ఈ పురస్కారాలలో జీవ ఔషధ శాస్త్రం, సుస్థిరమెన అభివృద్ధి, చైనా గురించిన పరిశోధనలు, అక్కడి చట్టాలు తదితర రంగాలలో కృషిచేసిన వారికి వీటిని అందజేస్తారు. మానవ అభివృద్ధిలో ఈ రంగాలకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ఈ విభాగాల్లో పురస్కారాలు ఇవ్వాలని అనుకుంటున్నామని ఆయన చెబుతున్నారు. వచ్చే ఏడాది అంటే, 2013-14 సంవత్సరం నుంచి ఈ బహుమతులను ఇవ్వడం ప్రారంభిస్తారు. రూ.19 వేల కోట్ల విలువ చేసే తన ఆస్తులలో తన మరణానంతరం 95 శాతం ఆస్తులను దాతృత్వ కార్యక్రమాలకు వినియోగిం చాలని అరవై రెండేళ్ల గత ఏడాది నిర్ణయించారు. ఎనభై వేల మందికి పైగా చైనా విద్యార్థులు చదువుకోవడానికి ఆయన సహాయం చేస్తున్నారు. తెవాన్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక పరిశోధనా సంస్థ అకాడెమియా సినికా నియమించే ప్రత్యేక కమిటీ టాంగ్‌ బహుమతి విజేతలను నిర్ణయిస్తుంది.

అకాడమీ(ఆస్కార్‌) అవార్డు…
colorఅకాడమీ అవార్డు అంటే అందరికీ తెలియకపోవచ్చు కానీ ఆస్కార్‌ అంటే మాత్రం అంతా గుర్తిస్తారు. ఆస్కార్‌ అవార్డులకు అధికారిక పేరే అకాడమీ అవార్డులు. హాలీవుడ్‌ మొదలుకొని టాలీవుడ్‌ దాకా వివిధ దేశాలకు చెందిన నటీనటులంతా కూడా కోరుకునేది జీవితంలో ఒక్కసారైనా ఆస్కార్‌ అవార్డు సాధించాలనే. అది దక్కితే చాలు జీవితం ధన్యమైపోతుంది… సినీ ప్రపంచంలో యావత్‌ ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన అవార్డులుగా ఆస్కార్‌ అవార్డులు గుర్తింపు పొందాయి.

తొలి అవార్డు గ్రహీత…
మొదటి బెస్ట్‌ యాక్టర్‌ : ఎమిల్‌ జానింగ్స్‌ (ది లాస్ట్‌ కమాండ్‌, ది వే ఆఫ్‌ ఆల్‌ ఫ్లెష్‌).
ప్రపంచంలో సినీ అవార్డుల ఉత్సవాల్లో ప్రముఖమైంది అవార్డ్‌ ఆఫ్‌ మెరిట్‌ (ఆస్కార్‌). ఏటా దీన్ని 100కు పైగా దేశాల్లో లైవ్‌గా ప్రసారం చేస్తారు. మీడియాలో ఎన్నో ఏళ్ళుగా సాగుతున్న వేడుకల్లో ఇదొకటి. అకాడమీ అవార్డులను స్ఫూర్తిగా తీసుకొని గ్రామీ అవార్డులు (మ్యూజిక్‌), ఎమ్మీ అవార్డ్‌‌స (టీవీ), టోనీ అవార్డ్‌‌స (థియేటర్‌) అవార్డులు రూపుదిద్దుకున్నాయి. ఇవి కూడా ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రసిద్ధి చెందాయి.

ఆస్కార్‌ అవార్డుల పుట్టుక…
ఈ అవార్డులను మొదట మెట్రో గోల్‌‌డవిన్‌ – మేయర్‌ స్టూడియో అధినేత బి.మేయర్‌ ప్రారంభించారు. సినిమా పరిశ్రమ ఇమేజ్‌ మెరుగుపర్చేందుకు, వౄఎత్తిపరమైన గౌరవ పుర స్కారాలను అందించేందుకు, కార్మిక సమస్యల్లో మధ్యవర్తి త్వం వహించేం దుకు వీలుగా ఒక సంస్థను నెలకొల్పారు. మొట్ట మొదటిసారిగా ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవ వేడుక 1929 మే 16న హాలీవుడ్‌ లోని హోటల్‌ రూజ్వెల్‌‌టలో జరి గింది. 1927, 1928లలో విడుదలైన చిత్రాలను ఈ అవార్డుల కోసం ఎంపిక చేశారు. 2011 నాటికి 1853 అవార్డుల కింద 2809 ఆస్కార్‌లను అం దించారు. 302 మంది నటులు ఈ అవార్డులను పొందారు.

ఎంపిక ఇలా..
Oscar_statuetteనిర్మాతలు అఫీషియల్‌ స్క్రీన్‌ క్రెడిట్స్‌ను ఆన్‌లైన్‌ ఫామ్‌లో తుదిగడువుకు ముం దుగా సమర్పించాలి. డిసెంబర్‌ చివర్లో వీటిని సుమారు 6,000 మంది సభ్యులకు పంపిస్తారు. చాలా విభాగాల్లో, ఆయా సభ్యులు తమ విభాగాల వారిని మాత్ర మే ఎంచుకుంటారు. ఫారిన్‌ ఫిల్‌‌మ, డాక్యుమెంటరీ, యాని మేటెడ్‌ ఫీచర్‌ ఫిల్‌‌మ లాంటి విభాగాల్లో మాత్రం ప్రత్యేక స్క్రీనింగ్‌లు ఉంటాయి. ఫారిన్‌ ఫిల్‌‌మ విభాగంలోకి వచ్చే సినిమా ఇంగ్లీష్‌ సబ్‌టైటిల్స్‌ను కలిగి ఉండాలి. ఏటా ఒక దేశం నుంచి ఒక సినిమాను మాత్రమే ఇందుకు పరిగణనలోకి తీసుకుంటారు. సభ్యుల ఓటింగ్‌ పూర్తయ్యాక సెకండ్‌ రౌండ్‌ ఓటింగ్‌ ఉంటుంది. అప్పుడు ఒక విభాగం సభ్యులు మరో విభాగంలోనూ తమ ఓటుహక్కును వినియోగించుకోవచ్చు.

ఎంపిక ప్రక్రియ..
2004 నుంచి కూడా జనవరి చివర్లో ఈ అవార్డులకు వచ్చిన నామినేషన్లను వెల్లడించడం మొదలైంది. అంతకు ముందు ఫిబ్రవరి మొదట్లో విజేతల పేర్లను వెల్లడించేవారు.
ఇప్పటి వరకు మన దేశం నుంచి ఈ అవార్డును అందుకున్న ఒకే ఒక్క వ్యక్తి ఎ.ఆర్‌.రహమాన్‌. సంగీతం విభాగానికి సంబంధించి దీన్ని గెలుచు కున్నారు.

నోబెల్‌ అవార్డు…ఎవరికి ఇస్తారు…
AlfredNobelనోబెల్‌ బహుమతులు భౌతిక శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో, సాహిత్యంలో, వైద్యశాస్త్రంలో కృషి చేసిన శాస్తవ్రేత్తలకు, ప్రపంచ శాంతికి కృషిచేసిన మహానుభావులకు ప్రతియేటా బహూకరిస్తుంటారు. వివిధ రంగాలలో విశేషమైన కృషి, పరిశోధనలు చేసిన, విప్లవాత్మక విధానాలు, పరికరాలతో శాస్త్రాన్ని ముందంజ వేయించిన, మానవ సమాజానికి ఆ శాస్త్రంతో అత్యంత సహాయాన్ని అందించిన వ్యక్తులకు, సంస్థలకు ఇవ్వబడుతుంది.

ఎవరు ఇస్తారు…
ఈ ఐదు బహుమతులు ప్రఖ్యాత స్వీడి ష్‌ శాస్తవ్రేత్త అయిన ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ 1895 నాటి వీలునామా ప్రకారం 1901లో ప్రారంభించబడ్డాయి. ఆల్ఫ్రె డ్‌ నోబెల్‌ గౌరవార్దం శాంతి బహుమతి 1969 నుంచి బ్యాంక్‌ ఆఫ్‌ స్వీడన్‌ ద్వారా ఇవ్వడం జరుగుతోంది. ఈ ఆరు బహుమతులు అత్యధిక పారితోషి కంతో పాటు పేరు ప్రఖ్యాతలకు నిదర్శ నం. ప్రతీ సంవత్సరం, ఒక్క శాంతి బహుమానం తప్ప మిగతా ఐదు బహుమతులు నోబెల్‌ గారి వర్దంతి అయిన డిసెంబరు 10న, స్టాక్‌హోంలో ఇస్తారు.

విలువ…
నోబెల్‌ విజేతలకు రూ.6.6 కోట్లు ఇస్తారు.

శాంతి బహుమతి పొందిన వ్యక్తులు…
బరాక్‌ బబామా, నెల్సన్‌ మండెలా, కోఫీ అన్నన్‌

విజేతల్లో మనవారు…
మథర్‌ థెరిస్సా, రవీంద్రనాథ్‌టాగూర్‌, అమర్త్యసేన్‌

గోల్డెన్‌ గ్లోబ్‌…
ఎవరిస్తారు…

Golden1950లో హాలీవుడ్‌ ఫారిన్‌ ప్రెస్‌ అసోసియే షన్‌ ఏర్పడింది. టెలివిజన్‌, టివి రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అవార్డులను ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పుట్టుకొచ్చిందే గ్లోబల్‌ గ్లోబ్‌

అవార్డులు.
ఎవరికిస్తారు..

ఉత్తమ సినిమా, ఉత్తమ నటన, డైరెక్షన్‌ సహా 15 రంగాల్లో ఉత్తభ ప్రతిభ కనిబర్చిన వారిని అసోసియేన్‌ ఎంపిక చేస్తుంది. అదేవిధంగా టెలివిజన్‌ రంగంలో 11 విభాగాల్లోని వారిని ఎంపిక చేస్తారు.ఓ రకంగా చూస్తే ఆస్కార్‌(సినిమా), ఎమ్మె(టెలివిజన్‌) అవార్డులను కలిపి దీనికి రూపకల్పన చేసినట్లు చెప్పవచ్చు.

ఎమ్మి…
EmmyAwardటెలివిజన్‌ రంగంలోని వివిధ విభాగాలకు ఈ అవార్డు ఇస్తారు.. ఇప్పటి వరకు అమెరికా టెలివిజన్‌ ఇండస్ర్తీలోని వారికే ఎక్కువ అవార్డులు దక్కాయి. ప్రైమ్‌ టైం, డే టైం విభాగాల్లో ప్రైజ్‌ ఇస్తారు.

ఎవరికి ఇస్తారు..
టెలివిజన్‌ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చివారికి ఇస్తారు.. వార్తలు, డాక్యుమెంటరీలు, క్రీడలు, బిజినెస్‌ వార్తలు, టెలివిజన్‌లో పనిచేసే సాంకేతిక విభాగం, ప్రాంతీయ వార్తల్లో ఉత్తమంగా పనిచేసిన వారిని విజేతలుగా ఎంపిక చేస్తుంది.

ఎవరిస్తారు…
నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ టెలివిజన్‌ ఆర్ట్‌‌స అండ్‌ సైన్స్‌ వారు 1950లో ఈ అవార్డు ఇవ్వడం ప్రారంభించారు. క్యాలెండర్‌లో ముందే తెలిపిన తేదీల ప్రకారం ఆయా రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులను అందజేస్తారు. 2013కు సంబంధించి ఆ తేదీలు ఇలా ఉన్నాయి.
జనవరి 10..టెక్నికల్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ ఎమ్మె అవార్డులుమే 7… 34వ స్పోర్ట్‌‌స ఎమ్మె అవార్డులుజూన్‌.. 40వ డేటైం ఎమ్మె అవార్డులుసెప్టెంబర్‌ 22… 65వ ప్రైమ్‌టైం ఎమ్మె అవార్డులు
ఆక్టోబర్‌ 1… 34వ న్యూస్‌ అండ్‌ డాక్యుమెంటరీ ఎమ్మె అవార్డులునవంబర్‌.. 41వ ఇంటర్‌నేషనల్‌ ఎమ్మె అవార్డులు

బుకర్‌…
ఎవరికిస్తారు…

Bookerమాన్‌ బుకర్‌ బహుమతి లేదా బుకర్‌ బహుమతి ఆంగ్ల సాహిత్యంలో పూర్తి నిడివి ఉత్తమ నవలకు ప్రతి సంవత్సరం కామన్వెల్త్‌ దేశాలు, ఐర్లాండు, జింబాబ్వే దేశాలకు చెందిన రచయితలకు ఇచ్చే పురస్కారం.

ఎవరిస్తారు…
ఈ బహుమతి దానిని స్పాన్సర్‌ చేసిన సంస్థ అయిన బుకర్‌-మెక్‌ కోనెల్‌ పేరు మీద బుకర్‌-మెక్‌ కోనెల్‌ బహుమతిగా 1968 సంవత్సరంలో మొదలైంది. అయితే బుకర్‌ బహుమతిగానే ప్రసిద్ధిచెందింది. దీని నిర్వహణ 2002 సంవత్సరంలో ‘బుకర్‌ బహుమతి ఫౌండేషన్‌’కు బదిలీ చేయబడింది. దీనిని స్పాన్సర్‌ చేసిన మాన్‌ గ్రూపు బుకర్‌ పేరును ఉంచి ముందు తమ పేరును చేర్చి మాన్‌ బుకర్‌ బహుమతి అధికార నామంగా మార్చింది.

నగదు…
అంతకు ముందు 21,000 పౌండ్ల బహుమతి ఇచ్చే మొత్తాన్ని తరువాత 50,000కి పెంచింది.
విజేతల్లో మనవారు…దీనికే 2008 సంవత్సరంలో అత్యుత్తమ బుకర్‌ బహుమతిని కూడా ఇచ్చారు. 1997 అరుందతీ రాయ్‌, 2006లో కిరణ్‌ దేశాయ్‌, 2008 సంవత్సరానికి గాను భారతీయ రచయిత అరవింద్‌ అడిగా మొట్టమొదటి రచన ది వైట్‌ టైగర్‌ కి లభించింది.

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top