You Are Here: Home » ఇతర » అలరిస్తున్న ఎయిర్‌షో – 2013 విస్మయ విన్యాసం

అలరిస్తున్న ఎయిర్‌షో – 2013 విస్మయ విన్యాసం

విమానాల్ని దగ్గరగా చూడాలనుకునే వారు చాలా మందే ఉంటారు. సెలవు రోజుల్లో దగ్గరి ప్రాంతంలోని విమానాశ్రయానికి వెళ్లి విమానాల్ని చూసిముచ్చటతీర్చు కుంటారు. మరి రకరకాల విన్యాసాల్ని చేసే యుద్ధ విమానాలను, పౌరవిమానాలను, అంతరిక్ష విమానాలను ఒేక చోట చూస్తే ఇక కళ్లు ఆర్పుకోవం సాధ్యమా… రెప్ప వాలిస్తే ఒక విన్యాసం కోల్పోతామేమో అన్నట్లు అలానే చూస్తుండిపోతాం… రెండేళ్లకోసారి నిర్వహించే ఎరుుర్‌ షో ఎంతగానో ఆకట్టుకుంటారుు. అద్భుత విన్యాసాలు చూపుతిప్పుకోనివ్వవు. అందుేక పిల్లలు, పెద్దలు ఈ షో కోసం ఎప్పుడెప్పుడా అన్నట్లు ఎదురుచూస్తుంటారు. కొందరుదుర్భిణి(బైనా క్యులర్‌) సహాయంతో విమాన విన్యాసాలను దగ్గరగా వీక్షిస్తుంటారు. ప్రదర్శన ప్రారంభ కాక ముందు నుంచి సాధన కోసం నిర్వహించిన విన్యాసాల్ని కూడా ఎక్కువ మందేతిలకిస్తారు. ేక రింతలు, చప్ఫట్లు, అరుపులకు ఇక కొదవే ఉండదు. ప్రస్తుతం వీటన్నింటికి బెంగళూరు ఎరుుర్‌ షో – 2013 వేదికరుుంది.


బెంగళూరులో ఏరో ఇండియా-2013 వైమానిక ప్రదర్శన ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కర్నాటకలోని యలహంక వైమానిక స్థావరంలో ఈ ఉత్సవాలను కేంద్ర రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగదీశ్‌ శెట్టర్లు ప్రారంభించారు. కొన్ని విన్యాసాలు అహ్లాదపరుస్తుంటే మరికొన్ని ఒళ్లు గగుర్లుపొడిచేలా సాగుతున్నాయి. ఈ ప్రదర్శనలో 27 దేశాలకు చెందిన 650 దేశ, విదేశీ సంస్థలు, యాభై రెండు రక్షణ, పౌర విమానాలు పాల్గొంటున్నాయి.

తదుపరి ఇక్కడే…
firతదుపరి ఏరో ఇండియా ప్రదర్శనను 2015 సంవత్సరం ఫిబ్రవరి 18న బెంగళూరులోనే నిర్వహిస్తామని గత బుధవారం ప్రదర్శన ప్రారంభోత్సవంలో పాల్గొన్న రక్షణ మంత్రి ఆంటోని ప్రకటించారు. దేవనహళ్లి విమాశ్రయం వద్ద వేయి ఎకరాల్లో వైమానిక ఉద్యాన వనాన్ని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి జగదీశ్‌ షెట్టర్‌ పేర్కొన్నారు. అందులో నలభై శాతం భూములను చిన్న, మధ్యతరహా పరిశ్ర మలకు కేటాయిస్తామన్నారు.

బెంగళూరుతో అనుబంధం….
భారతీయ వైమానిక రంగం అనగానే ముఖ్యంగా గుర్తు వచ్చే నగరం బెంగళూరు.

 • మన దేశంలో విమాన రంగం ప్రారంభమయింది ఇక్కడే.
 • రక్షణ దళాలకు అవసరమైన విమానాలను ఉత్పత్తి చేయడంలో ప్రత్యేక స్థానం పొందింది.
 • మైసూర్‌ ప్రభుత్వ హయాంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త సేఠ్‌ వాల్‌ చంద్‌ హిందూస్థాన్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ సంస్థను 1940 డిసెంబర్‌ 23న బెంగళూరులో స్థాపించారు.
 • అప్పుట్లోనే దాదాపు నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు.
 • అమెరికాకు చెందిన ఇంటర్‌ కాంటినెంటల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సంస్థ సహకారంతో హార్లో శిక్షణ విమానం, కర్టిస్‌హాక్‌ ఫైటర్‌, మల్టీ అటాక్‌ బాంబర్‌ విమానాల తయారీని చేపట్టారు.
  antony,-
 • 1941లో తొలి హార్లో విమానం బెంగళూరులోనే తయారు చేయబడింది.
  తరువాత 10 సీట్ల గ్లైడర్‌ను రూపొందించారు.
 • డాక్టర్‌ వి.హెచ్‌.గటగే దీన్ని కనిపెట్టారు.
 • హెచ్‌ఎఎల్‌ను నాటి ప్రముఖులు సందర్శించి ప్రతిభను కొనియాడారు.
 • రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మన వద్ద యుద్ద విమానాల తయారీని ఆపారు.
 • ఈ సమయంలో ఈ సంస్థను ఇండియా తన ఆధీనంలోకి తీసుకుంది. అప్పటి నుంచి హిందూస్థాన్‌ ఏరో నాటిక్స్‌ లిమిటెడ్‌గా పిలువబడుతోంది.
 • హెచ్‌టి-2, పుష్పక్‌, వాంపైర్‌ ఫైటర్‌ విమానాలను తయారు చేశారు.
 • బ్రిటన్‌, అమెరికా, రష్యా దేశాల సహకారంతో కొత్త కొత్త విమానాలను రూపొందించింది.
 • బెంగళూరులో ప్రస్తుతం 19 తయారీ కేంద్రాలు, 10 పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు హెచ్‌ఎఎల్‌లో ఉన్నాయి.
 • బరువు తక్కువగా ఉండే తేజస్‌, ధృవ హెచ్‌ఎఎల్‌ నైపుణ్యానికి అద్ధంపట్టాయి.
 • నిరంతర పరిశోధన, ఇతర దేశాల సహాయంతో భారత్‌ వైమానిక రంగంలో దూసుకుపోతోంది.
 • విశేషాలు…
  AA-6562ప్రారంభోత్సవానికి ముందు శత్రు భూభాగంలోకి మన జవాన్లను, వాహనాల్ని దింపే విన్యాసాల్ని ధృవ హెలికాప్టర్లు విజయవంతంగా ప్రదర్శించాయి.

  • నింగిలో ఆగిన ధృవ నుంచి జవాన్లు తాడు సాయంతో ఒక్కరొక్కరే దిగి పనిని చక్కబెట్టి తిరిగి హెలికాప్టర్లోకి ఎగబాకటం ఆసక్తికరంగా సాగింది.
  • పెద్దసంచిలో ట్రక్కును హెలికాప్టర్‌ తీసుకువచ్చి యుద్ధభూమిలో దించడం, వెంటనే అందులోని జవాన్లు వచ్చి విన్యాసాలు చేయడం ఆకర్షించింది.
  • ప్రారంభోత్సవం తర్వాత మూడో దశకం పైలెట్‌ శిక్షణ విమానం టైగర్‌ మోత్‌ విమానం విన్యాసాలు ఔరా అనిపించాయి.
  • భారత మానవ రహిత నిఘా విమానం రుస్తుం, చెక్‌ రిపబ్లిక్‌ నుంచి వచ్చిన రెడ్‌బుల్‌ సాహసాలు అబ్బురపరిచాయి.
  • రెడ్‌ బుల్స్‌ నిలువునా నింగిలోకి దూసుకుపోవ డం, అక్కడ తలకిందులుగా ప్రయాణం, ఎదురెదు రుగా దూసుకొచ్చి రెప్పపాటులో తప్పించుకోవడం చూపరులనున ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
  • ఎప్పటిలాగే భారత తేలికపాటి యుద్ధ విమానం (ఎల్సీఏ) తేజస్‌ విన్యాసం మదిని దోచుకుంటోంది.
  • పెద్ద శబ్దంతో ఆకాశంలోకి దూసుకుపోయి వృత్తాకారంలో చక్కర్లు కొట్టటం, నింగిలోకి నిటారుగా ఎగసి హఠాత్తుగా దిశను మార్చుకోవడం, కొన్ని వేల అడుగుల ఎత్తు నుంచి ఉన్నట్లుండి కిందకు పడుతూ అంతలోనే సురక్షితంగా పైకి దూసుకెళ్లడం భయోత్పాతానికి గురిచేస్తుంది.
  • ఎఫ్‌.16 ఫాల్కన్‌, డసాల్ట్‌ రాఫెల్‌ విమనాలు సత్తాను ప్రదర్శించి ముగ్దుల్ని చేశాయి.
  • రంగురంగుల భారత సారంగ్‌ హెలికాప్టర్లు సందడి చేశాయి.
  • రష్యా నుంచి వచ్చిన రెడ్‌బుల్స్‌ చిన్న విమానాల్లో ఒకటి. ఇది చెవులు అదిరిపోయేలా పెద్ద శబ్దం చేస్తే ఆకాశంలోకి దూసుకువెళ్తున్నాయి.
  • యూరప్‌ దేశాల్లో రెడ్‌బుల్‌కు పెట్టింది పేరు. పైలెట్లు ఈ విమానాలతో అద్భుత విన్యాసాలు చేశారు. నాలుగు విమానాలు బెంగలూరు ప్రదర్శనలో పాల్గొన్నాయి.
  • ఈ పైలెట్లలో ఒకరు మహిళా పైలెట్‌ కావడం గమనార్హం. నాలుగు ఒకదానికి ఒకటి గుద్దుకునేంతగా దగ్గరగా వచ్చి అంతలోనే దిశను మార్చుకున్నాయి.
  • మరో విమానం సారంగ్‌. ఇది పొగలు జిమ్ముతూ ఆకాశంలో విన్యాసాలు చేసింది. విమానం వెళ్లిన దారి వెంట పొగ భలే చిత్నాలను ఏర్పరిచింది.
  • గత బుధవారం నుంచే ఈ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం వరకు చూపరులను అలరించనున్నాయి.
  • ఈ ప్రదర్శలో అస్త్ర(పిలాటస్‌) ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ విమానం స్విట్జర్లాండ్‌లో తయారయింది.
  • మన దేశంలో కొత్త పైలెట్లకు శిక్షణ ఇవ్వడానికి ఈ విమానాలను వినియోగిస్తున్నారు. ఇవి రాక ముందు హెచ్‌పిటి-32 శిక్షణ విమానాల్ని వాడేవారు.
  • వెళ్లడం ఎలా…
   ఎగ్జిబిషన్‌ ప్రాంతం, ఎయిర్‌ షో జరిగే ప్రాంతాలను రెంటిని వీక్షించడానికి టికెట్‌ ధర నేడు, రేపు ఒక్కరికి 400 రూపాయలు. 10వ తేదీ ఆదివారం కావడంతో వంద పెంచి ధర రూ.500లుగా నిర్ణయించారు.
   సమయం..
   ఫిబ్రవరి 8 ఉ.10 నుంచి సా.5గం వరకు
   ఫిబ్రవరి 9 ఉ.10 నుంచి సా.5గం వరకు
   ఫిబ్రవరి 10 ఉ.10 నుంచి సా.5గం వరకు

   నిర్ణీత సమయానికి ముందే లోనికి వెళ్లే గేట్‌ తెరిచి ఉంటుంది. గేట్‌ వద్ద మీ యునిక్‌ నెంబర్‌ కార్డు, ఫొటో ఐడెంటిటి కార్డు, టిక్కెట్‌ తీసుకోగానే మీకు ఇచ్చిన పాస్‌ను చూపించాలి. అనంతరం సెక్యూరిటీ చెకింగ్‌ ఉంటుంది. 8వ తేదీ ఒక్క రోజు మాత్రం 16 ఏళ్ల కంటే చిన్న వయస్సు ఉన్న వారిని ఎగ్జిబిషన్‌ లోనికి అనుమతించరు. కానీ ఎయిర్‌ షో చూడవచ్చు. బయటి నుంచి తీసుకువెళ్లే తినుబండారాలను లోనికి తీసుకువెళ్లరాదు. ఒక్కసారి టిక్కెట్‌ తీసుకుంటే దాన్ని రద్దు చేయడం గాని లేక వేరొక పేరుకు మార్చడంగాని జరగదు. ఉత్సాహంతో పాటు భీతిగొల్పే విధంగా ఎయిర్‌ షో ఉంటుంది కనుక ఐదేళ్లలోపు వయస్సు గల పిల్లలను అనుమతించరు. 5-16 ఏళ్ల మధ్య వయస్కులు వచ్చినా ఖచ్చితంగా తల్లిదండ్రుల లేదా పాఠశాల నుంచి అనుమతి ప్రతం తీసుకురావాల్సి ఉంటుంది.

   ఎప్పుడెప్పుడు
   rafel-fighterఇప్పటివరకు తొమ్మిది వైమానిక ప్రదర్శనలు జరిగాయి. ఇప్పుడు బెంగళూరులో జరుగుతున్నది పదవది. మళ్లీ 2015లో జరుగుతుంది. 1996లో వైమానిక ప్రదర్శన ప్రారంభమైంది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ షో 1998 తరువాత మాత్రం మూడేళ్లు సమయం తీసుకుంది.

   మొదటి 1996
   రెండవ 1998
   మూడవ 2001
   నాల్గవ 2003
   ఐదవ 2005
   ఆరవ 2007
   ఏడవ 2009
   ఎనిమిదవ 2011
   తొమ్మిదవ 2013

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top