You Are Here: Home » ఇతర » అర్ధ శాస్త్ర అదిరెన్

అర్ధ శాస్త్ర అదిరెన్

కాలేజీ యువతరం ప్రతి కార్యక్రమంలోనూ కొత్తదనం కోరుకుంటోంది. తమకు నచ్చిన విధంగా వాటిని నిర్వహించుకునేందుకు ఇష్టపడుతున్నారు. సరికొత్త కార్యక్రమాలతో కాలేజీ వేడుక లను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. తోటి విద్యార్ధులు, స్నేహితులతో సరదాగా ర్యాంప్‌పై అందమైన డ్రస్సులతో కనువిందు చేసూ ఫాస్ట్‌బీట్‌ పాటలకు అదిరేటి స్టెప్పులతో ఆకట్టుకుంటున్నారు. వెరైటీగా తమ కాలేజీ వేడుకలను జీవితాంతం గుర్తుంచుకునేలా నిర్వహించుకుంటున్నారు. విద్యార్ధుల ఆట పాటలతో కాలేజీ ప్రాంగణాలు సందడిగా మారుతున్నారుు. ఫాస్ట్‌బీట్‌ పాటలకు వారు వేస్తున్న స్టెప్పులు తోటి విద్యార్ధుల్లో ఉత్సాహాన్ని రేెకత్తిస్తున్నారుు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబింపజేసే భరతనాట్య నృత్య ప్రదర్శనలతోపాటు వారు ఇస్తున్న ప్రదర్శనలు ఆహూతులను అలరిస్తున్నారుు.
కాలేజీ విద్యార్ధులు కొత్త విద్యార్ధులకు సరికొత్త అనుభూతులను పంచుతూ వారిని రా రమ్మని ఆహ్వానిస్తు న్నారు. ఈ తరుణంలో కామర్స్‌ చదివే కళాశాలల విద్యార్ధులంత ఒక్క చోట చేరి సందడి చేశారు. క్యాట్‌ వాక్‌తో హొయలొలికించారు. హుషారైన నృత్యాలతో అదరగొట్టారు. డిజే సౌండ్స్‌, వెస్ట్రన్‌, పాప్‌మ్యూజిక్‌, విద్యార్ధుల కేరింతలతో కళాశాల ప్రాంగణం హోరెత్తింది. ఆకాశమే హద్దుగా వారు ఆడిపాడారు. బేగంపేటలోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కళాశాలలో కామర్స్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎమర్జింగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ (కాఫీ) వేదిక ద్వారా ‘అర్ధశాస్త్ర-2013’ పేరిట వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు పారిశ్రామిక వేత్త ప్రమోద్‌ అగర్వాల్‌, కళాశాల ప్రిన్సిపల్‌ అల్ఫాన్సా తదితరులు హాజరయ్యారు. ఉత్తమ మిస్టర్‌ అండ్‌ మిస్‌ సిఈఓ, మాక్‌ స్టాక్‌ ఎక్ఛేంజ్‌, బిజ్‌విజ్‌ వంటి 9 రకాల పోటీల్లో విద్యార్ధులు పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్విరామంగా జరిగిన ఈ వేడుకల్లో వారు సందడి చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ ఆకట్టుకున్నాయి.

మరచిపోలేని ఎన్నో అనుభూతులు…
girlsప్రతి ఒక్కరూ తమ కాలేజీ రోజులను చిరకాలం గుర్తుంచుకుం టారు. బాల్యం నుంచి కాలేజీ వరకు గడిపే జీవితం అందరికీ ఎంతో ముఖ్యమైంది. అందుకే ఆ రోజులు ఇప్పుడు గుర్తొస్తే మనసు పులకరిస్తుంది. జీవితంలో ఏదో సాధించామన్న తపన కనిపిస్తుంది. అందుకే కాలేజీ స్టైలే అంటూ నేటికీ యువతరం గొప్పగా చెప్పుకుంటారు. తమ తోటి విద్యార్ధులతో తరగతి గదుల్లో చేసిన అల్లరి, చిలిపి చేష్టలను గొప్పగా ఇప్పటికీ ముచ్చట్లాడుకోవడం కనిపిస్తుంటుంది. అందుకే కాలేజీ ఫ్రెషర్స్‌డే వేడుకలను ఇప్పటికీ ఎంతో అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. విద్యార్ధుల జీవితాల్లో అవి తీపి గురుతులుగా నిలిచిపోవాలని ప్రతి ఒక్కరూ తపిస్తు న్నారు. ఇందుకు తగ్గట్లుగా కాలేజీల యాజమాన్యాలు కూడా విద్యార్ధుల అభిరుచులను దృష్టిలో ఉంచుకుని వారు కోరిన రీతిలో వీటిని జరిపేందుకు మొగ్గుచూపుతున్నారు.

విద్యార్ధులకు వెరైటీ పోటీలు…
paintకొత్తగా కాలేజీలో చేరాలనుకునే విద్యార్ధులకు కూడా ఇవి స్ఫూర్తిగా ఉండాలన్న కోరికతో ఆటపాటలతో పాటు వెరైటీ పోటీలను నిర్వహించి విద్యార్ధుల్లో కొత్త ఉత్సాహం తీసుకున్నారు. ఈ వేడుకల్లో కాలేజీ విద్యార్ధులు ర్యాంప్‌పై వెరైటీ డ్రస్సులతో తళుక్కుమంటున్నారు. తమకు ఇష్టమైన డిజైన్లతో ఆకట్టుకుంటున్నారు. మార్కెట్లోకి ఎప్పటికప్పుడు వచ్చే కొత్త టెక్నాలజీని కూడా వినియో గించేందుకు పోటీపడుతున్నారు. మరోవైపు ప్రతి కాలేజీ వేడుకల్లో ఫ్యాషన్‌షోలు పరిపాటిగా మారుతున్నాయి . విద్యార్థులు ర్యాంప్‌పై అదిరేటి డ్రస్సులతో ఆకట్టుకుంటున్నారు.

– ఇస్కా రాజేష్‌బాబు, ‘సూర్య’ లైఫ్‌స్టైల్‌ ప్రతినిధి, rajeshiska@gmail.com
ఫొటోలు : కె. సర్వేశ్వర్‌రెడ్డి, ఎస్‌ శరత్‌బాబు, ఎ. రమణాచారి

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top