You Are Here: Home » ఇతర » అమ్మా! బయలెల్లినాదో!

అమ్మా! బయలెల్లినాదో!

తెలంగాణాలో ఆషాడ మాసంలో అత్యంత వైభవంగా నిర్వహించే పండుగలలో బోనాల పండుగ ప్రముఖమైంది. సాధారణంగా జూలై లేక ఆగస్టులో వచ్చే ఆషాఢ మాసంలో ఈ పండుగ జరుపుకుంటారు. పండుగ మెుదటి, చివరి రోజులలో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. హైదరాబాద్‌లో గోల్కొండ, సికింద్రాబాద్‌, పాతబస్తీలోని చారిత్రాత్మక లాల్‌దర్వాజ బోనాలకు విశేష ప్రాధాన్యం ఉంది.

బోనం అంటే…
bonaభోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమ ర్పించే నెైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తల పెై పెట్టుకుని, డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో, పసుపు, కుంకుమ లేక కడి (తెల్ల ముగ్గు)తో అలంకరించి, దానిపెై ఒక దీపం ఉం చడం కద్దు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్ద మ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మున్నగు పేర్లు కల ఈ దేవి గుళ్ళను దేదీప్యమానంగా అలంకరిస్తారు.

ఘటం
అమ్మవారి ఆకారములో అలంకరింపబడిన రాగి కలశాన్ని ఘటం అని అంటారు. సంప్రదా యక వస్తధ్రారణ, ఒంటి పెై పసుపు కలిగిన పూజారి ఈ ఘటాన్ని మోస్తాడు. పండుగ మొద టి రోజు నుండి, చివరి రోజు నిమజ్జనం దాకా ఈ ఘటాన్ని డప్పుల మేళవాద్యాల నడుమ ఊరేగిస్తారు. ఘటం ఉత్సవం రంగం తర్వాత జరుగుతుంది. హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయము వారి ఘటముతో910ఏనుగు అంబారీపెై, అశ్వాల మధ్య, అక్కన్న, మాదన్నల బొమ్మల నడుమ ఊరేగింపు మొదలయ్యి సాయంత్రానికి కన్నుల పండుగగా నయాపుల్‌ వద్ద ఘటముల నిమజ్జనతో ముగుస్తుంది.

పోతురాజు
దేవీ అమ్మవారి సోదరుడెైన పోతురాజును ప్రతి బింబించే ఒక మనిషి చేత పండుగ సమూ హాన్ని నడిపించడం ఆనవాయితీ. పోతురాజు పాత్రను పోషించే వ్యక్తి బలశాలిగా ఉంటాడు. ఒంటిపెై పసుపు, నుదుటిపెై కుంకుమ, కాలికి గజ్జెలు కలిగి, చిన్న ఎరన్రి ధోతీని ధరించి డప్పు వాయిద్యానికి అనుగుణంగా ఆడతాడు. భక్త సమూహం ముందు ఫలహారం బండి వద్ద నర్తి స్తాడు. అతడిని పూజాకార్యక్రమాల ఆరంభకు డిగా, భక్త సమూహానికి రక్షకుడిగా భావిస్తారు. కొరడాతో బాదుకొంటూ, వేపాకులను నడుము కు చుట్టుకుని, అమ్మవారి పూనకములో ఉన్న భక్తురాండ్రను ఆలయములోని అమ్మ వారి సమక్షానికి తీసుకెళతాడు.

ఎన్నెన్నో ఆచారాలు
ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించు కుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నెైవేద్యంగా సమర్పిస్తారు. గతంలో ఈ పండుగ రోజున దుష్టశక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాం గణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. నేడు దున్నపోతులకు బదులు కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది. బలిని నిషేధించిన నేపథ్యంలో గుమ్మడికాయ కొట్టడం చేస్తున్నారు.

పండుగ రోజున స్ర్తీలు పట్టుచీరలు, నగలు ధరిస్తారు. పూనకం పట్టిన కొందరు స్ర్తీలు తలపెై కుండని (బోనం) మోస్తూ డప్పుగాళ్ళ లయ బద్ధమైన మోతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు.బోనాలను మోసుకెళ్తున్న మహిళలను దేవీ అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసం. మహంకాళి అంశ రౌదన్న్రి ప్రతిబింబిస్తుంది కాబట్టి ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయాన్ని సమీపించు సమయములో వారి పాదాలపెై మిగిలిన భక్తులు నీళ్ళు కుమ్మరిస్తారు. తమ భక్తికి చిహ్నంగా తొట్టెలను (కాగితమూ, కరల్రతో కూర్చబడిన చిన్న రంగుల పరికరము) సమర్పించడం ఆచారంగా ఉంది.

బోనం
Untiaబోనం అంటే భోజనం. జానపదులు తమకు ఇష్ట మైన గ్రామదేవతలకు సమర్పించే నెైవేద్యం. దీన్ని కొత్తకుండలో వండి ప్రదర్శనగా వెళ్లి గ్రామ దేవతలకు భక్తిప్రపత్తులతో సమర్పిస్తారు. చిన్నముం తలో పానకం పోస్తారు. దానిపెై దివ్వె పెట్టి బోనంజ్యోతి వెలిగించి జాతర కన్నులపండువగా నిర్వహిస్తారు. వేటపోతు మెడలో వేపమండలుకట్టివ్యాధి నిరోధ కశక్తిని పెంచే పసుపు కలిపిన నీరు, వేపాకుల్ని చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామదేవతల ఆలయాలకు తరలివెళ్లి బోనాలు సమర్పిస్తారు. ఇలా బోనాల సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడుతారని ప్రజల విశ్వాసం.

విందు సంబరాలు
బోనాలు పండుగ దేవికి నెైవేద్యం సమర్పించు పండుగ కావడంతో, ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అతిథుల తో పాటు స్వీకరిస్తారు. నివేదనానంతరం మాంసాహార విందు భోజనం మొదలౌతుంది. పండుగ జరిగే ప్రాంతాలలో వేపాకులతో వీధులు అలంకరిస్తారు.జానపద శెైలిలో ఉండే అమ్మవారి కీర్తనలతో నిండిన మైకుసెట్ల హోరులో పండుగ వాతావణం వెల్లివిరుస్తుంది.

రంగం
రంగం పండుగ రెండవ రోజు ఉదయం జరుగుతుంది. ఈ రంగం కార్యక్రమంలో పోతరాజు వేషం వేసిన వ్యక్తికి పూనకం వస్తుంది. ఆ కోపాన్ని తగ్గించేందుకు అక్కడవున్న భక్తులు కొమ్ములు తిరిగిన మేకపోతును అందిస్తారు. పొతరాజు తన దంతాలతో ఆ మేక పోతును కొరికి, తల, మోండెం వేరు చేసి పెైకి ఎగురవేస్తాడు. దీన్నే గావు పెట్టడంగా వ్యవహరిస్తారు. బలి నిషేధించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ కార్యక్రమం నిర్వహించడం లేదు.లాల్‌దర్వాజా నుండి నయాపుల్‌ వరకు వీధుల వెంబడి వేలాదిమంది ప్రజలు నిలుచుని రంగ రంగ వెైభవంగా అలంకరించబడిన ఘటాలను చూస్తారు. పోతురాజుతో పాటు, వివిధ పౌరాణిక వేషధారణలలో ఉన్న కురవ్రాళ్ళు తమదెైన రీతిలో జానపదగీతాలు, వాయిద్యాల మధ్య నృత్యం చేస్తారు.

లాల్‌దర్వాజలో
పాతబస్తీ లాల్‌దర్వాజా బోనాలకు 104 సంవత్స రాల చరిత్ర ఉంది. ఈ బోనాలు జులెై నెలలో ప్రారంభం కానున్నాయి. ఆషాఢం ప్రారంభంతోనే గోల్కొండలోని జగదాంబ దేవాలయంలో బోనాల జాతర తోనే జంటనగరాలలో ఈ బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. తెలంగాణాలో జరిగే బోనాల జాతరలో పాతబస్తీ లాల్‌దర్వాజా బోనాలకి విశేష ప్రా ధాన్యం ఉంది. గోల్కొండలో ప్రారంభ మైన మరుసటి వారం లష్కర్‌ బోనాలు, ఆ మరుసటి వారం లాల్‌ దర్వాజా బోనాలు ఉత్సవాలను నిర్వహిస్తారు. జూలెై 15 వతేదిన చారిత్రక లాల్‌దర్వాజా శ్రీ సింహ వాహిని మహం కాళి 104వ వార్షిక బోనాల జాతర ఉత్సవాలు అంగరంగ వెైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

బోనాల ఉత్సవాల కోసం జూలెై 6 వతేది నుండే సుమా రు 11 రోజుల పాటు రోజొక రూపం లో అమ్మవారిని అలంకరించి పూజలు నిర్వహిస్తారు. వేదపండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయి ద్యాల నడుమ దేవి అభిషేకం, ధ్వజారోహణం, శిఖరపూజ, కలశస్థాపనతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. పలువురు రాజకీయ, రాజకీయేతర, అధికార, అనధి కార ప్రముఖులు ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు.

వెైభంగా ఘటాల ఉరేగింపు
Unaపాతనగర బోనాల జాతర సంధర్బంగా ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో పాతబస్తీలో ఘనంగా ఘాటాల ఊరేగింపు నిర్వహిస్తారు. ఆన వాయితీ ప్రకారం లష్కర్‌ బోనాల రోజున పాతబస్తీ ఉమ్మడి దేవాలయా ఉరేగింపు కమిటీలోని ఆయా దేవా లయాలలో అమ్మవారి ఘటాన్ని ప్రతిష్టించి తొమ్మిది రోజు పాటు అమ్మవారికి భక్తి ప్రపత్తులతో పూజలు నిర్వహించి బోనాల పండుగ మరుసటి రోజున ఘటా లను పాతబస్తీ పురవీధుల గుండా ఉరేగించి మూసి నదిలో నిమజ్జనం చేస్తారు. పాతనగరంలోని ఉమ్మడి దేవాలయ కమిటీలోని ప్రధాన దేవాల యాలెైన లాల్‌ దర్వాజా సింహావాహిని దేవాలయం, గౌలిపురా కోట మైసమ్మ, అక్కన మాదన్న, ఉప్పుగుడా మహాంకాళి దేవాలయం, బేలా ముత్యాలమ్మ దేవాలయం, బంగా రు మైసమ్మ దేవాలయం, సుల్తాన్‌ షాహీ జగదంబా దేవాలయంల ప్రతినిధులు ఆనవాయితీ ప్రకారం సికిం ద్రాబాద్‌ బోనాల రోజు ఆదివారం శాలిబండాలోని కాశీవిశ్వనాధుని దేవాలయం నుండి అమ్మవారి ఘటా లను తీసుకువెల్లి ఆయా దేవాలయాలలో ప్రతిష్టిస్తారు.

తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఎనిమిదవ రోజున బోనాల ఉత్సవాలను నిర్వహిస్తారు. బోనాల మరుసటి రోజున తొమ్మిదవ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భవిష్యవాణి రంగం కార్యక్రమం అనంతరం ఉమ్మడి దేవాలయాలలో ఉన్న 13 దేవాల యాలలో ప్రతిష్టిం చిన అమ్మవారి ఘటాలను ప్రత్యేక అలంకరించి పాతనగర పురవీధులగుండా సామూహిక ఊరే గింపును నిర్వహిస్తారు. ఊరేగింపులో వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటారు. పదమూడు దేవాలయాలనుండి వచ్చిన అమ్మవారి ఘటాలు చార్మినార్‌ వద్ద కలు సుకుని మూసి నదిలో సామూహిక నిమజ్జనానికి తరలి వెళ్తాయి. ఘటాల నిమజ్జనంతో పాతనగర బోనాల జాతర ఉత్సవాలు ముగుస్తాయి. ఈ జాతర కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లను చేస్తుంది.

ఆలయచరిత్ర…
గోల్కొండ నవాబులు నగర రక్షణ కోసం చుట్టూ పటి ష్టమైన, ఎతెైన గోడలు నిర్మించి, రాకపోకలు సాగించేం దుకు వీలుగా అనుకూలమైన ప్రాంతాలలో దర్వా జాలు, కిటికీలు ఏర్పాటు చేశారు. అలాంటి దర్వా జాలలో ఒకటి లాల్‌దర్వాజా (ఎరట్రి జాజు పూయ బడిన దర్వాజా). దీనికి ఆనాటి నుంచి లాల్‌దర్వాజానే పేరు స్థిరపడిపోయింది. 1908లో మూసినదికి వరదలు వచ్చాయి. దీంతో ప్రాణ, ఆస్థినష్టం సంభ వించి కలరా వ్యాపించింది. అప్పటి నిజాం ప్రభువు మీర్‌ మహబూబ్‌ అలీ ఖాన్‌, ప్రధాని మహారాజ్‌ సర్‌ కిషన్‌ ప్రసాద్‌ సలహా కోరారు. దీంతో ఆయన అమ్మవారికి ఆగ్రహం కలిగినపుడు ఇలాంటి ప్రళయం వస్తుందని, శాంతి పూజలు చేయాలని తెలిపారు.

ప్రధాని సూచన మేరకు బంగారు చాటలో పసుపు, కుంకుమ, ముత్యాలు, పట్టు వస్త్రాలు తీసుకొని లాల్‌దర్వాజా అమ్మవారికి పూజలు చేసి చార్మినార్‌ భాగ్యలక్ష్మి మందిరం వరకు వచ్చిన వరద నీటిలో గంగాభవానికి సమర్పించారు. శాంతించి, ప్రజలకు సుఖఃశాంతులను ప్రసాదించాలని హారతి పట్టారు. మూసి వరదలకు గుర్తుగా ప్రతియేడు ఇక్కడి ప్రజలు తెలంగాణ సంస్కృతి, సంప్రదా యలకు అనుగుణంగా అమ్మవారి బోనాలు సమర్పిస్తారు. అనంతరం స్థాని కులు కొందరు 1968లో అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. కంచి కామకోఠి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్యులచే విగ్రహా ప్రతిష్ఠాపన జరిగింది. 1953 నుంచి ఆలయంలో జంతుబలిని నిషేధించి అమ్మవారికి గుమ్మడి కాయలు, కొబ్బరికాయలను శాస్త్రోక్తంగా బలి ఇస్తున్నారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top