You Are Here: Home » సినిమా » పాటలు » అమ్మాయిల శపథం (1975)- నీలిమేఘమా జాలి చూపుమా

అమ్మాయిల శపథం (1975)- నీలిమేఘమా జాలి చూపుమా

పల్లవి :
నీలిమేఘమా జాలి చూపుమా
ఒక్క నిముషమాగుమా
నా రాజుతో ఈ రాతిరి నన్ను కలిపి వెళ్లుమా
కన్నె అందమా కలత మానుమా
ఒక్క నిముషమాగుమా
నీ దైవమూ నీ కోసమూ
ఎదుట నిలిచె చూడుమా

చరణం : 1
అనుకోని రాగాలు వినిపించెనే
కనరాని స్వర్గాలు దిగివచ్చెనే ॥
కలలు పండి నిజముగా కనుల ఎదుట నిలిచెగా
రా జాబిలీ నా నెచ్చెలీ
జాగేల ఈ వేళ నను చేరగా ॥

చరణం : 2
కళ్యాణ మేళాలు మోగించనా
కంఠాన సూత్రాన్ని ముడివేయనా ॥
గుండె గుడిగా చేయనా నిన్ను కొలువు తీర్చనా
నీ దాసినై సావాసినై
నా ప్రేమ పుష్పాల పూజించనా
॥అందమా॥

చిత్రం : అమ్మాయిల శపథం (1975)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : విజయభాస్కర్
గానం : ఎస్.పి.బాలు, వాణీ జయరామ్

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top