You Are Here: Home » ఇతర » అమ్మఒడిలో ఒదిగిన కళలు

అమ్మఒడిలో ఒదిగిన కళలు

తెలుగుతల్లి ఒడిలో మన కళలు ఒదిగాయి. కళలే జీవితంగా భావించిన ఎందరో కళాకారులు తమ చాతుర్యం ప్రదర్శించారు. గత మూడు రోజులుగా శ్రీవారి పాదాల చెంత జరిగిన తెలుగు సభల్లో కోటి గొంతుకలు పద సవ్వడి చేశాయి. రంగస్థలం, నృత్యం, జానపదం, కవితాగోష్టి, పిల్లనగ్రోవి, కోలాటం లాంటి లయబద్దమైన సంగీత నృత్యాలు ఒకేచోట ఒకేసారి ప్రదర్శించడం అరుదుగా జరుగుతుంది. రంగులు పూసుకున్న కళాకారులు తమ చతురతను ప్రదర్శించి, సభికుల మన్ననలు పొందారు. సంక్రాంతికి ముందే ‘సంక్రాంతి కళ’ తెలుగు సభల్లో కన్పించింది. కళాకారులు కళామతల్లికి వందనాలు పలికారు. తన కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన కళాకారులను చూసి, తెలుగుతల్లి ఉప్పొంగింది. తప్పెటగుళ్లు సభికులను అందెలు వేయిస్తే.. జానపదాలకు జనం నాట్యం చేశారు. నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రపంచం నలుమూలల నుంచి విచ్చేసిన తెలుగు ప్రజలు చివరిరోజు కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా సభల్లో పాల్గొన్నారు. చివరిరోజు వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా కళలను ఆదరిస్తుంటే, కళాకారులు కూడా రెట్టింపు ఉత్సాహంతో తమ కళా చాతుర్యాన్ని ప్రదర్శించారు.
రంగస్థలం.. : తెలుగు రచనలకు విశేష సేవలు అందించిన ప్రముఖులకు సన్మానాలు నిర్వహించిన అనంతరం కడపకు చెందిన వెంకటయ్య నిర్వహణలోని ‘మహాజ్ఞాని మార్కండేయ’ పద్యనాటకం అలరించింది. హైదరాబాద్‌ శ్రీనివాస్‌ సమర్పణలో ‘బలి’ అనే నాటిక, ఖమ్మం జిల్లాకు చెందిన సుబ్బరాజు నిర్వహణలోని ‘సత్యహరిశ్చంద్ర’, విజయవాడ వాసి క్రిష్ణ సమర్పణలోని ‘మాధవవర్మ’, హైదరాబాద్‌కు చెందిన గోవాడ వెంకట్‌ ఆధ్వర్యంలోని ‘చెంగల్వపూదండ’, ధీక్షిత్‌ సమర్పణలో ‘విష్ణుశర్మ ఇంగ్లీషు చదువులు’ అనే నాటకాలు సభికులను తన్మయత్వంలోముంచాయి.

సంగీతం.. :
RANaతెలుగు సభల్లో చివరి రోజు నీతా చంద్ర శేఖర్‌, ఉమాదేవి, అనసూయల ఆధ్వర్యంలో నిర్వహించిన శాస్ర్తీయ సంగీతం, ద్వారం లక్ష్మి, శ్రీదేవిల ఆధ్వర్యంలోని సంగీత కచేరి, లలిత గీతాలు సభికులను అబ్బురపర్చా యి. అచ్చిబాబు, నాగరాజుల వాయిద్య సంగీతం, అన్న మాచార్య భావనా వాహిని వారిచే నిర్వహించిన సంగీత కచేరి, మూర్తి, త్రినాధరావుల లలిత సంగీతం, మధుబాబు శాస్ర్తి, ప్రణవిల బృందంలు ఆలపించిన లలిత గీతాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సత్యవాడ సిస్టర్స్‌ ఆధ్వర్యం లోని సంగీతం, మోహన్‌రాజ్‌, భూదేవిల దేశభక్తిగీతాలకు జనం నీరాజనం పట్టారు. అన్నవరపు రామస్వామిచే వయోలిన్‌ రాగాలు, మంటపాక రవి, సత్యవతి, వెంకటే శుల వాద్య సంగీతం, అయ్యంగారి శ్యామసుందర్‌, ఈమని కల్యాణి, డి.శ్రీనివాస్‌, క్రిష్ణమూర్తిల వీణానాదం ఎంతగానో ఆకట్టుకున్నాయి. చెనై్నకి చెందిన కన్యాకుమారి చే నిర్వహించిన వయోలిన్‌ చక్కటి సందేశం ఇచ్చింది.

కూచిపూడి నృత్యం… :
కరీంనగర్‌కు చెందిన రతన్‌ కుమార్‌ బృందం నిర్వహించిన కూచిపూడి నృత్యం, వేదాంత వెంకట చలపతి బృందంచే నిర్వహించిన కూచి పూడి యక్షజ్ఞానం, నర్తనశాల, తిరుపతి పద్మనాభ బృందం చే నిర్వహించిన తిరుపతి వైభవం సభికులకు ఆనందం కలిగించాయి. వేదాంతం రాధేశ్యామ్‌ బృందంచే నిర్వహిం చిన కూచిపూడి యక్షగానం, గొల్లకలాపం, చింతా ఆది నారాయణశర్మ నిర్వహించిన కూచిపూడి బాలకొండల రావు బృందం ఆధ్వర్యంలోని కూచిపూడి నృత్యం, స్వాతి సోమనాధబృందం, ఏలూరు సత్యనారాయణ బృందం, పద్మజారెడ్డి బృందం, రవికుమార్‌ బృందం, వెంపటి చినసత్యంలు నిర్వహించిన కూచిపూడి నృత్యాలు మన సంస్కృతికి దర్పణంగా నిలిచాయి.

సాహిత్యం… :
దేవి సుబ్బారావు నిర్వహణలోని అను వాద కవి సమ్మేళనం, పద్యాల తోరణం, డాక్టర్‌ ద్వానాశాస్ర్తి నిర్వహణలోని గురజాడ దర్బార్‌, ఆధునిక కవి సమ్మేళనం, నిత్యానందరావు నిర్వహణలోని చమ త్కారాలు, సినీ కవి సమ్మేళనం, కవులకు, కళాకారు లకు కొత్త సందేశాన్నిచ్చాయి. ముగింపు సమావేశం లో తెలుగుకు వెలుగులు నింపిన రచయితలకు సన్మానం నిర్వహించారు.

జానపదం… :
RANGaగుంటూరుకు చెందిన సచ్చితా నందశాస్ర్తి నిర్వహణలోని హరికథ, రాయలసీమ జానపద కళాకారుల సంఘం నిర్వహణలోని జానపద గీతాలు, హైదరాబాద్‌కు చెందిన సత్యనారాయణ బృందం ఆధ్వర్యం లోని బుర్రకథ జానపద కళాకారులకు స్ఫూర్తిని నింపాయి. మెదక్‌, రంగారెడ్డి జిల్లాల జానపద కళాకారులు జనంచేత అడుగులు వేయిం చారు. పశ్చిమగోదావరి జిల్లా కళాకారులు, కరీంనగర్‌ జిల్లా కళాకారులునిర్వహించిన తప్పెటగుళ్లు సభికులను అలరింపజేశాయి.

– వి.క్రిష్ణ, స్టాఫ్‌రిపోర్టర్‌, చిత్తూరు, మేజర్‌న్యూస్‌

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top