You Are Here: Home » ఇతర » అమెరికన్‌ నల్ల కలువ డోరతి హైట్‌

అమెరికన్‌ నల్ల కలువ డోరతి హైట్‌

అమెరికాకు చెందిన పౌరహక్కుల నాయకురాలు,పౌర హక్కుల ఉద్యమానికి రాజమాతగా గుర్తింపు పొందిన ప్రముఖ అమెరికన్‌ హక్కుల నాయకురాలు డోరతి ఇరెన్‌ హైట్‌ . నల్లజాతి వారి పట్ల వివక్షను నిరసిస్తూ ఏడు దశాబ్దాలు అలుపెరగని పోరాటం చేశారు. న్యాయవాది కూడా అరుున ఆమె మార్టిన్‌ లూథర్‌ కింగ్‌తో కలసి అనేక వేదికల్లో పాల్గొన్నారు. డోరోతీ జాతీయ, అంతర్జా తీయ స్థారుులో సుమారు 50 వరకు అవార్డులు అందుకున్నారు. పౌరహక్కులతో పాటు అమెరికా జాతీయ నీగ్రో మహిళా మండలికి 40 సంవత్సరాలు అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమె 1952లో ఢిల్లీ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌లో విజిటింగ్‌ ప్రొెఫెసర్‌గా పనిచేశారు.

ప్రొఫైల్
Dor6

పూర్తి పేరు  	: డోరతి ఇరెన్‌ హైట్‌
పుట్టిన తేది : 1912 మార్చి 24
జన్మస్థలం : వర్జీనియా
చదువు : కొలంబియా
విశ్వవిద్యాలయం
నుంచి సామాజిక సేవలో
వృత్తి : విద్యావేత్త,
సామాజిక కార్యకర్త
అవార్డులు : ప్రెసిడెంటల్‌ సిటిజన్‌
మెడల్‌ (1989)
వంటి అవార్డులు

డోరతి వర్జీనియాలోని రిచ్‌మండ్‌లో 24 మార్చి 1912లో జన్మించారు. ఆమె చిన్నతనంలోనే కుటుంబం పెన్సిల్వినీయాలోని రాన్‌కిన్‌కు వలస వచ్చింది. 1929లో డోరతి అక్కడే ఉన్న బార్నర్డ్‌ కాలేజీలో చేరారు. అయితే తక్కువ కాలంలోనే కాలేజీ నుంచి తొలగించబడ్డారు. దీనికి కారణం ఆ కళాశాల నిబంధనల ప్రకారం ప్రతి సంవత్సరం కేవలం ఇద్దరు నల్లజాతీ యులకు మాత్రమే ఆడ్మిషన్‌ కల్పిస్తారు. దీంతో ఆమె న్యూయార్క్‌ యూనివర్సిటీలో చేరాల్సి వచ్చింది.1932లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత ఎడ్యుకేషనల్‌ ఫిజియాలజీలో మాస్టర్‌ డిగ్రీ పూర్తి చేశారు.

మహిళా హక్కుల కోసం..
హైట్‌ తన మాస్టర్‌ డిగ్రీ తరువాత న్యూయార్క్‌ సిటీలోని సంక్షేమ శాఖలో కేస్‌వర్కర్‌గా చేరారు. తనకు చదువుకునే వయస్సులో జరిగిన అవమానం మరొకరికి రాకూడదనే ఉద్దేశంతో 25 సంవత్సరాల వయస్సులోనే పౌర హక్కుల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. దానికోసం అమెరికా జాతీయ నీగ్రో మహిళా మండలి లో చేరారు. ఈ సంస్థ ద్వారా అఫ్రికా, అమెరికా, మహిళలకు సమాన హాక్కులు ఉండాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యమించారు. పలు సంస్థల సహాకారంతో అనేక ఉద్యమాలు నిర్మించిన ఘనత డోరతీది.

ప్రముఖుల ప్రశంసలు
Doa1957లో అమెరికా జాతీయ నీగ్రో మహిళా మండలికి అధ్యక్షు రాలిగా ఎన్నికైన ఆమె 1997 వరకు అంటే కనీసం 40 సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగారు .1960లో జరిగిన హక్కుల ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. డోరతి చేస్తున్న కృషిని నాటి తొలి మహిళలు కూడా ప్రసంశించడం విశేషం. అదే సమయంలో అమెరికన్‌ ఆఫ్రికన్‌ అనే వార పత్రికలో ఎ ఉమన్స్‌ వరల్డ్‌ అనే శీర్షికన పలు వ్యాసాలు కూడా డోరతి రాశా రు. ఉద్యమ సమయంలో డోరతి అనేక మంది ప్రముఖులతో కలసి పనిచేశారు. వారిలో మార్టిన్‌ లూథర్‌ కింగ్‌, రాయ్‌విల్‌ కిన్స్‌, వైట్నీ యంగ్‌, ఎ.పిలిప్‌ రండోల్ప్‌లు ఉన్నారు.

ఏడు దశా బ్దాల కాలంలో అమెరి కాలో జరిగిన దాదాపు అన్ని పౌర ఉద్య మాల్లోనూ డోరతి ప్రముఖపాత్ర నిర్వహించారు .1964లో తమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం మిస్సిసిపిలో అనే కార్యక్రమా న్ని రూపొందించారు. దీని ప్రకారం ప్రతి బుధవారం చిన్న పట్టణాలను సందర్శిస్తూ అక్కడి నల్లజాతి మహిళలతో సమా వేశాలు నిర్వహించేవారు.

అరుదైన గౌరవాలు
పలు కీలక సంస్థల్లోనూ డోరతికి అరుదైనా గౌరవం దక్కిన సం దర్భాలు అనేకం ఉన్నాయి. బరక్‌ ఒబమా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం జనవరి 20, 2009లో హక్కుల సాధనపై జరిగిన లీడర్‌షిప్‌ కాన్ఫరెన్స్‌లో డోరతి ముఖ్య అతిథిగా పాల్గొ నగా, ఒబమా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం విశేషం. ఏడు దశాబ్ధాలుగా అలుపెరగని ఉద్యమాలు నిర్వహించిన డోరతి కొన్నేళ్లక్రితం అనారోగ్యంతో కన్నుమూశారు. యావత్‌ ప్రపంచం ఆమె ఉద్యమ స్పూర్తికి జోహార్లు పలికింది.

అవార్డులు, గౌరవాలు
Doraహక్కుల సంరక్షణకు కృషి చేసినందుకుగా ను ఆమెకు అనేక అవార్డులు దక్కాయి. ప్రె సిడెంటల్‌ సిటిజన్‌ మెడల్‌(1989), స్పెం గ్రన్‌ మెడల్‌(1993), ఫ్రాంక్లిన్‌ డెలానో రూజ్‌వెల్ట్‌ ఫ్రీడమ్‌ ఫ్రం వాంట్‌ అవార్డు (1993), నేషనల్‌ ఉమన్స్‌ హాల్‌ ఆఫ్‌ ఫేం (1993), ప్రసిడెంటల్‌ మెడల్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌ (1994), ఇవే కాక నాటి అధ్యక్షుడు జార్జ్‌ బుష్‌ చేతుల మీదుగా కాంగ్రెషనల్‌ గోల్డ్‌ మెడల్‌ వంటివెన్నో అందుకున్నారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top