You Are Here: Home » దైవత్వం » సాహిత్యం » పురాణాలు » అమృత హృదయంతోనే ఆనందాల అవని

అమృత హృదయంతోనే ఆనందాల అవని

NewsListandDetails”నింగి వ్రేలుచు నమృతమొసంగు మేఘుడు అన్నాడు ఏనుగు లక్ష్మణకవి. అమృతము- ఈ మాట వినగానే కొత్త ఉత్సాహం వస్తుందం టారు కొందరు. మరి ఈ అమృతం ఏంటో, దాని గురించిన విశేషాలు మనమిప్పుడు తెలుసుకుందాం.
అమృతం అనే పదానికి నీళ్లు, పరమాత్మ, సుధ, మోక్షము వంటి అర్థాలున్నాయి. అమృతాన్ని దేవభోజనము, దేవాన్నము, పీయూషము, వేల్పు బోనము, మృత్యు నాశనము, సముద్రనవనీతము వంటి ఎన్నో పేర్లతో పిలుస్తారు. అమృతం కోసం దేవ దానవ్ఞలు మందరపర్వతాన్ని కవ్వంగా చేసుకొని, వాసుకిని తాడుగా చేసుకొని క్షీర జలధిని చిలికారు. మృత్యువ్ఞను, ముసలి తనాన్ని దరిరానివ్వనిది అమృతం. అందుకే దానికోసం అంత తపన. పైగా దానిని తాగిన వారు నిత్య యౌవనంతో ఉటారట. అలాంటి అమృతం సురాసురులు చేసిన ప్రయత్నంలో పాలకడలినుండి ఎన్నెన్నో బయటకు వచ్చాయి. వాటిల్లో ప్రముఖంగా విషము, లక్ష్మీదేవి, చంద్రుడు-ఇలా ఎన్నో లభించాయి లేదా పుట్టాయి. అమృతం ఎలా ఉంటుందో తెలియకపోయినా పామరజనం సైతం ”వాడి మాటలు వింటుంటే చెవ్ఞల్లో అమృతంపోసి నట్టుంది అంటుంటారు. అమ్మ ప్రేమ అమృతంతో సమానం అంటారు. వంట గురించి చెప్పేటప్పుడు కూడా ”అమృతంలా ఉంది అంటారు.  అలా అని మితంలేకుండా తింటే అమృతమైనా విషంతో సమానమనే విషయాన్ని మరచిపోకూడదు. అందుకే వేమన
”అమృత సాధనమౌట నందరు బలుతురు
యమృత మెంచి చూడ నందలేరు
అమృతము విషమాయె నదియేమి చిత్రమో
విశ్వదాభిరామ వినురవేమ
అన్నాడు. కానీ బాగా ఆకలైనప్పుడు దొరికిన అన్నము, అమిత దాహంతో ఉన్నప్పుడు దొరికిన నీళ్లు అమృతంతో సమానంగా అనిపిస్తాయి.అమృతం, అమృతం అని అది దేవతలు మాత్రమే తాగుతుంటారని అంటారు.
కానీ ఈ లోకంలో అమృతంలాంటివి కొన్ని ఉన్నాయి. పసిబిడ్డల తొక్కుపలుకులు అంటే ముద్దు మాటలు అమృతంతో సమానం. ఆదరణతో పెట్టిన భోజనం అమృతంతో సమానం అని భర్తృహరి చెప్పాడు. పాలకడలి నుండి పుట్టిన ఈ అమృతాన్ని మోహినీ రూపము దాల్చిన విష్ణువ్ఞ, రాక్షసులకు దక్క నీయక దేవతల కివ్వటంవలన వారు మరణంలేని వారుగా వేల్పులుగా నిలిచారు. అమృతమును తాగిన దేవతలను అమృతాంథ సులు, అమృతాశనులు అంటారు. ఈ అమృతాన్ని దేవేంద్రుని వద్దనుండి తెచ్చినవాడు కనుకనే విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతు నికి అమృతహరణుడు అని, విష్ణువ్ఞకు అమృతుడు అని పేరు వచ్చింది. క్షీర సముద్రము నుండి పుట్టినవాడు అమృత మయమైన కిరణములను కలవాడు కనుకనే చంద్రుణ్ని అమృత సూతి, అమృతకరుడు, అమృతాంశుడు అని అంటారు. కల్లుకుండను అమృతకలశమని, చల్లని వెన్నెలను అమృత తరంగిణి అని, దేవతలు తినే అన్నాన్ని అమృతాన్నము అని అంటారు.
అరటిపళ్లలో అతితీయనైన రకాన్ని అమృత పాణి అంటారు. పూజలలో దేవ్ఞడికి నెయ్యి, తేనె, పాలు, పెరుగు, చక్కెర కలిపి పంచా మృతము సమర్పించటం తెలిసిందే. అలాగే అందరి శ్రేయస్సును కోరుకునే వారిని అమృత హృదయులు అంటారు. కవి బాల గంగాధర్‌ తిలక్‌ ‘అమృతం కురిసిన రాత్రి మకుటంగా కవిత్వం రాశారు. అలాగే ”రమ్ము దయసేయు మాత్మ పీఠమ్ముపైకి, అమృత ఝరి చిందు నీపదాంకములయందు.. అని కరుణశ్రీ దేవ్ఞణ్ని ప్రార్థించారు. ప్రతిమనిషి అమృత హృదయుడై తన అమృతహస్తంతో అమృత మనే ఆనందాన్ని అందీయగలిగితే ఈ వసుధ శాంతి సంతోషాలతో నిండి సమరస భావం వెల్లివిరుస్తుంది కదా.
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top