You Are Here: Home » సినిమా » పాటలు » అమాయకురాలు (1971)- ఆ… ఆ ఆ ఆ… ఆ ఆ ఆ… ఆ…

అమాయకురాలు (1971)- ఆ… ఆ ఆ ఆ… ఆ ఆ ఆ… ఆ…

పల్లవి :
ఆ… ఆ ఆ ఆ… ఆ ఆ ఆ… ఆ…
పాడెద నీ నామమే గోపాలా (2)
హృదయములోనే పదిలముగానే
నిలిపెద నీ రూపమేరా
పాడెద నీ నామమే గోపాలా

చరణం : 1
మమతలలోనే మాలికలల్లి నిలిచితి నీకోసమేరా మమతలలోనే మాలికలల్లి నిలిచితి నీకోసమేరా
ఆశలతోనే హారతి చేసి
పదములు పూజింతు రారా
పాడెద నీ నామమే గోపాలా

చరణం : 2
నీ ముర ళీ గానమే పిలిచెరా
కన్నుల నీమోము కదలెనులేరా
నీ ముర ళీ గానమే పిలిచెరా
పొన్నలు పూచే బృందావనిలో
వెన్నెల కురిసే యమునాతటిపై (2)
నీ సన్నిధిలో జీవితమంతా
కానుక చేసేను రారా

చిత్రం : అమాయకురాలు (1971)
రచన : దాశరథి
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : పి.సుశీల

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top