You Are Here: Home » సినిమా » పాటలు » అప్పుచేసి పప్పుకూడు (1959)- అప్పుచేసి పప్పుకూడు

అప్పుచేసి పప్పుకూడు (1959)- అప్పుచేసి పప్పుకూడు


పల్లవి : అప్పుచేసి పప్పుకూడు
తినరా ఓ న రుడా
గొప్పనీతి వాక్యమిదే
వినరా పామరుడా ॥

చరణం : 1
దొంగతనము తప్పురా
దోపిడీలు ముప్పురా
అందినంత అప్పుచేసి
మీసం మెలితిప్పరా ॥
చరణం : 2
ఉన్నవారు లేనివారు
రెండే రెండు జాతులురా
ఉన్నచోట తెచ్చుకొనుట
లేనివారి హక్కురా ॥
చరణం : 3
వేలిముద్ర వేయరా
సంతకాలు చేయరా
అంతగాను కోర్టుకీడిస్తే ఐపి బాంబుందిరా ॥

చరణం : 4
రూపాయే దైవమురా
రూపాయే లోకమురా
రూకలేని వాడు
భువిని కాసుకు కొరగాడురా ॥
చిత్రం : అప్పుచేసి పప్పుకూడు (1959)
రచన : పింగళి నాగేంద్రరావు
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : ఘంటసాల, బృందం

నిర్వహణ : నాగేష్
e-mail: sakshisong@gmail.com

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top