You Are Here: Home » ఇతర » అపర కుబేరులు ప్రపంచ అత్యంత సంపన్నులు

అపర కుబేరులు ప్రపంచ అత్యంత సంపన్నులు

మీరు భారతదేశంలో ఎవరిని అతి ధనిక ప్రజలుగా భావిస్తారు? మీ మనస్సులో ఉన్న పేర్లేవి? అవి టాటాలు, బిర్లాలు వంటి వారు కాదు. ఇప్పటివరకూ ప్రపంచంలో అత్యున్నత ధనికుల పేర్లు సర్వేలు జరిపి వెబ్‌సైట్లో పెడుతున్నారు. కానీ వారందరినీ తలదన్ని…. కుబేరునితోనే పోటీ పడే లక్ష్మీపుత్రులు ఉన్నారు. నిన్న మెున్నటి వరకూ ధనవంతులుగా పేరుగాంచిన బిల్‌గేట్స్‌, కార్లోస్‌ సివ్‌ు, వారెన్‌ బఫెట్‌ వంటివారు తాజా సర్వే నివేదికలో అతి కిందకి వెళ్ళిపోయారు. సెలబ్రిటీ నెట్‌వర్క్‌ అనే వెబ్‌సైట్‌ సేకరించిన ధనవంతుల జాబితాలో మనెకవరికీ అంతుబట్టని, తెలియని వాళ్ల పేర్లు బయటకు వచ్చారుు.

14వ శతాబ్దంకు చెందిన ఆఫ్రికన్‌ మాలి రాజు మున్సా ముసా1 ప్రపంచంలోెకల్లా అత్యంత ధనవంతుడుగా నమోదై చరిత్రసృష్టించాడు. సెలబ్రిటీ నెట్‌ వర్క్‌ సేకరించిన వివరాలతో టాప్‌25 అత్యంత ధనవంతుల పేర్లును వెబ్‌సైట్‌లో ఉంచారు. వెరుు్య సంవత్సరాల క్రిందటి వ్యక్తులు, వారి సంపాదన గురించి వివరాలు సేకరించినా అంతకుముందు అంత సంపన్నులు ఎవరూ లేరని, అందుేక వీరిని చరిత్రలోనే అత్యంత ధనవంతులుగా గుర్తించింది. ప్రస్తుతం టాప్‌25లో ముగ్గురు మాత్రం జీవించే ఉన్నారు. వీరిలో మన హైదరాబాదీ నవాబ్‌ ఆలీఖాన్‌ ప్రపంచ ధనవంతుల జాబితాలో 6వ స్థానంలో నిలిచారు.

1aప్రపంచం మొత్తం మీద అత్యంత సంపన్నుడు ఎవరిని అడిగితే ఠక్కున ఏ బిల్‌గేట్సో అని చెప్పేయడం మామూలే.. కానీ… ఇలాంటి అంచనాలు తప్పని రుజువుచేసే పక్కా వివరాల్ని సెలబ్రిటీ నెట్‌వర్క్‌ అనే వెబ్‌ సైట్‌ సేకరించింది. లండన్‌ పత్రిక ద ఇండిపెండెంట్‌ ఈ వివరాల్ని ప్రచురించింది. జాబితాలో మొత్తం 24 మంది ఉన్నారు. వాళ్లలో ప్రస్తుతం ముగ్గురు మాత్రమే బతికు న్నారు. భారత్‌లో ఇప్పటివరకూ అత్యంత ధనికుడైన వ్యక్తి ఆఖరి నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ ఆలీఖాన్‌ అని లెక్కలు పక్కాగా చెబుతున్నాయి. అంతేకాదు ప్రపంచంలో కెల్లా అత్యంత ధనవంతుల జాబితాలో ఆయన ఆరో స్థానంలో ఉన్నారు. 1967లో 80 సంవత్సరాల వయసులో చనిపోయిన ఉస్మాన్‌ ఆలీఖాన్‌ భారతీయులందరిలోకీ ఆల్‌ టైం సంపన్నుడని సెలబ్రిటీ నెట్‌వర్త్‌ చెబుతోంది.

ఆయన ఆస్తుల విలువ 11,80,000 కోట్ల రూపాయలు. 13వ శతాబ్దంలో ఆఫ్రికా లోని మాలిని పరి పాలించిన మన్నా మూసా అనే రాజు ప్రపంచంలో కెల్లా ఆల్‌ టైం సంపన్నుడిగా నిలిచారు. ఆయన ఆస్తుల విలువ 20,00,000 కోట్ల రూపాయలు. ఉప్పు, బంగారం ఉత్పత్తిలో అగ్రగామిగా నిలవడం వల్లే ఇంత సంపదను పొందగలిగాడట. నెట్‌వర్త్‌ వెబ్‌సైట్‌ విడుదల చేసిన సంపన్నుల జాబితాలో 14 మంది అమెరికన్లే ఉన్నారు. జాన్‌ డి రాక్‌ ఫెల్లర్‌ అమెరికాలో ఆల్‌ టైం సంపన్నుడిగా అవతరిస్తే, వారెన్‌ బఫెట్‌కి మ్త్రాం ఈ జాబితాలో అతి బీదవాడి స్థానం దక్కింది. ఇది కూడా ఆయన దాన ధర్మాలు చేయడానికి ముందున్న లెక్కల్ని తీసుకుంటేనే.

మన తరంలోని వారు
ఈ మధ్యకాలంలో వివిధ వెబ్‌సైట్లు జరుపుతున్న సర్వేల్లో నెంబర్‌ ఒన్‌గా నిలిచిన వారెన్‌ బఫెట్‌ కూడా ఈ తాజా సంపన్నుల జాబితాలో మ్త్రాం 24వ స్థానంలోకి చేరారు.

టాప్‌ 25 ధనవంతులు
1. ఆఫ్రికాలోని ఇప్పటి ఘనా మాలీని పరిపాలించిన మన్నా మూసా1 21.15 లక్షల కోట్ల రూపాయలతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతునిగా నమోదయ్యారు. రెండో స్థానంలో బ్యాంకింగ్‌ రాజవంశం అయిన

రోథ్స్‌చైల్డ్‌ కుటుంబం ఆస్తులు 18.51
2aలక్షల కోట్ల రూపాయాలు, మూడో స్థానంలో నిలిచిన పారిశ్రామిక వేత్త జాన్‌ రాక్‌ఫెల్లర్‌ సంపద విలువ 17.98 లక్షల కోట్ల రూపాయలు, ఇక మరో పారిశ్రామిక వేత్త ఆండ్రూ కార్నెగీ నాలుగోస్థానంలో నిలిచారు. ఈయన సంపద రూ.16.39 లక్షల కోట్లు, 5వ స్థానంలో ఉన్న రష్యా జార్‌ నికోలస్‌2 (రష్యా 18681918 చివరి చక్రవర్తి) రూ.15.86 లక్షల కోట్లు, 6వ స్థానంలో మన హైదరాబాద్‌కు చెందిన మీర్‌ ఉస్మాన్‌ ఆలీఖాన్‌కు రూ.12.47 లక్షల కోట్లు, విలియం ది కాంకరర్‌ 7వ స్థానంలో నిలిచి రూ.12.13 లక్షల కోట్ల రూపాయలు కూడబెట్టారు. ఇక 8వ స్థానంలో నిలిచిన లిబియా నియంత గడాఫీ

సంపద
విలువ రూ.10.57 లక్షల కోట్లు, 9వ స్థానంలో ఫోర్డ్‌ మోటార్‌ కంపెనీ వ్యవస్థాపకుడు హెన్నీ ఫోర్డ్‌ 10.52 లక్షల కోట్ల రూపాయలు ఆర్జించారు. 10వ స్థానంలో వ్యాపారవేత్త అయిన కార్నెలియస్‌ వాండ ర్బిల్ట్‌ 185 బిలియన్‌ డాలర్లు, 11వ స్థానం ఆక్రమించిన అలాన్‌ రుఫస్‌ 178.65 బిలియన్‌ డాలర్లు, 12వ స్థానంలో మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ 136 బిలియన్‌ డాలర్లు, 13వ స్థానంలో విలియం డి వార్నీ ఆస్తులు 146.13 బిలియన్‌ డాలర్లు, 14వ స్థానంలో వ్యాపారవేత్త జాన్‌ జాకబ్‌ అస్తోర్‌ 121 బిలియన్‌ డాలర్లు, 15వ స్థానంలో రిచర్డ్‌ ఫిడ్జిలాన్‌ ఆస్తులు 118.6 బిలియన్‌ డాలర్లు, ఇక 16వ స్థానంలో ఎడ్వర్డ్‌3 కుమారుడు గంట్‌ జాన్‌ 110 బిలియన్‌ ఫౌండ్లు

17వ స్థానంలో షిప్పింగ్‌ మరియు బ్యాంకింగ్‌ దిగ్గజం స్టీఫెన్‌ గిరార్డ్‌ 105 బిలియన్‌ డాలర్లు, 90 బిలియన్‌ డాలర్లతో అలెగ్జాండర్‌ టుమీ స్టీవర్ట్‌ 18వ స్థానంలోనూ, 19 వ స్థానంలో రెన్రీ, లాంకాస్టర్‌ ఆస్తులు 85.1 బిలియన్‌ డాలర్లు, 20 స్థానంలో ఫ్రెడరిక్‌ 80 బిలియన్‌ డాలర్లతోనూ, 21 వస్థానంలో రెలు, రోడ్డు కాంట్రాక్టర్‌ జే గౌల్డ్‌ 71 బిలియన్‌ డాలర్లతోనూ, 22వ స్థానంలో కార్లోస్‌ స్లిమ్‌ 68 బిలియన్‌ డాలర్లు, 23వ స్థానంలో స్టీఫెన్‌ వాన్‌ రెన్సీలాయర్‌ 68 బిలియన్‌ డాలర్లు, 24వ స్థానంలో మార్షల్‌ ఫీల్ట్‌ కంపెనీ వ్యవస్థాపకుడు మార్షల్‌ ఫీల్డ్‌, 25వ స్థానంలో వాల్మార్ట్‌ వ్యవస్థాపకుడు సామ్‌ వాల్టన్‌లు ఉన్నారు.

వెబ్‌సైట్లో…
వెయ్యి సంవత్సరాలు, అంతకుముందున్న వారిలో ఇంతధనవంతులు లేరని వెబ్‌సైట్‌లో ఉంటారు. మొత్తం 24మంది అత్యంత సంపన్నులుగా తేల్చారు. ఈ అత్యంత ధనవంతుల జాబితాలో ముగ్గురు మ్త్రామే బతికి ఉన్నారు. వీరిలో 14 మంది అమెరికా పౌరులు. ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకుని ఆసుల విలవను వెబ్‌సైట్‌లో పెట్టింది.

మన హైదరాబాదీ నిజాం
4aహైదరాబాద్‌ చివరి నిజాం ఉస్మాన్‌ ఆలీఖాన్‌ భారత్‌లో ఆల్‌టైమ్‌ అత్యంత సంపన్నుడిగాను, ప్రపంచంలో 6 వ స్థానంలో నిలిచారు. ఈయన ఆస్తులు విలువ రూ.12,46, 434 కోట్ల రూపాయలు. నిజాం వంశీకులు 1886 నుంచి 1948 వరకూ హైదరాబాద్‌ సంస్థానాన్ని పరిపా లించారు. నిజాం ఉస్మాన్‌ ఆలీఖాన్‌ 1967లో మరణించారు. కొద్ది సంవత్సరాల క్రితం నిజాం నగలను ఆర్థిక ఇంబ్బందుల్లో ఉన్న వారసులు 1995లో అత్యంత విలువైన 173 ఆభరణాలను లండన్‌లో వేలం వేస్తుండగా భారత ప్రభుత్వం వాటిని తీసుకువచ్చి వారికి 216 కోట్ల రూపాయలు ఇచ్చింది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top