You Are Here: Home » చిన్నారి » స్ఫూర్తి » ఆత్మకథ » అనిల్ కకోద్కర్

అనిల్ కకోద్కర్

పేరు : అనిల్ కకోద్కర్
ఊరు : భర్వాని, మధ్యప్రదేశ్
ప్రత్యేకత : ప్రఖ్యాత శాస్త్రవేత్త

భారతదేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తల్లో ఒకరు. న్యూక్లియర్ సైన్స్‌లో నిపుణులు. అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా వంటి ఎన్నో ప్రముఖ సంస్థలకు అధ్యక్షుడిగా వ్యవహరించారు.

స్వాతంత్య్రసమరయోధుడైన పురుషోత్తమ్ కకోద్కర్ కుమారుడు. తల్లి ప్రముఖ గాంధేయ వాది.
మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి కాగానే బార్క్(బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్)లో చేరారు. ధ్రువ రియాక్టర్ రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు.

1974, 1998లో ఇండియా నిర్వహించిన అణుపరీక్షల్లో కీలక పాత్ర పోషించారు.
1996లో బార్క్ డెరైక్టర్ అయ్యారు. 2000 నుంచి అటామిక్ ఎనర్జీ కమిషన్‌కు నేతృత్వం వహిస్తున్నారు.

న్యూక్లియర్ ఎనర్జీకి బదులు థోరియమ్‌ని ఇంధనంగా వాడేందుకు ఆయన చేస్తున్న ప్రయోగం ఫలవంతమయ్యే దిశగా సాగుతోంది. ఇది భారత్‌ను శాస్త్ర సాంకేతికంగా పరిపుష్టం చేస్తుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top