You Are Here: Home » సినిమా » పాటలు » అనగనగా ఓ ధీరుడు (2011)- ప్రేమలేఖ రాసెనే ఇలా పెదాలు

అనగనగా ఓ ధీరుడు (2011)- ప్రేమలేఖ రాసెనే ఇలా పెదాలు

సాకీ :
చిరుగాలై వచ్చేదెవరో చెలి చెంప గిచ్చేదెవరో
చిరకాలం నిలిచేదెవరో ఎవరో వారెవరో
అలలాగ వచ్చేదెవరో అరచేయి పట్టేదెవరో
అనురాగం పంచేదెవరో ఎవరో వారెవరో
ఎవరంటే నీ వెంట నేనేలే
నేనంటే నిలువెల్లా నీవేలే
నీవంటే తనువెల్లా ప్రేమేలే
ప్రేమించే వేళయిందో…

పల్లవి :
ప్రేమలేఖ రాసెనే ఇలా పెదాలు
ప్రేమరేఖ దాటెనే ఇలా పదాలు
ప్రేమకిక వేసెనే ఇలా ప్రాయాలు
ఏం మాయ ఏం చేస్తుందో
ప్రేమలేఖ రాసెనే ఇలా పెదాలు
ప్రేమలాలి కోరెనే ఇలా క్షణాలు
ప్రేమలోతు చేరెనే పది ప్రాణాలు
ఈ హాయి ఎటుపోతుందో ॥

చరణం :
నవ్వావంటే నువ్వు ఆ నవ్వే గువ్వై తారాజువ్వై
నాలో ఏఁమాయెనో
రువ్వావంటే చూపు ఆ చూపే చేపై సిగ్గై చెరువై
లోలో ఏఁమాయెనో
ముసినవ్వుకు మనసే లేత మొగ్గ వేసునో
కొనచూపుకు వయసే రేకు విచ్చునో
పసిరేకుల సొగసే నేడు పూత పూసెనో
ఆ పూవు ప్రేమైందో ఏమో…

చిత్రం : అనగనగా ఓ ధీరుడు (2011)
రచన : చంద్రబోస్
సంగీతం : సలీమ్-సులేమాన్
గానం : శ్రేయాఘోషల్, సలీమ్ మర్చెంట్

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top