You Are Here: Home » సినిమా » పాటలు » అనగనగా ఓ ధీరుడు (2011)- చందమామలా అందగాడిని

అనగనగా ఓ ధీరుడు (2011)- చందమామలా అందగాడిని

పల్లవి :
చందమామలా అందగాడిని
చుక్కలెందరో నా వెనకే
చుక్కలెందరో చుట్టిముట్టినా
చెలి కొరకే నా పరుగే


చరణం : 1
పెదవులు పగడ కాంతులు
పలుకులు చెరుకు బంతులు
నడకలు నెమలి గంతులు
గలగలగలలు
కనులలో కోటి రంగులు
నడుములో మర ఫిరంగులు
కురులలో జలధి పొంగులు
జలజలజలలు
తన కొరకే కలవరమై
తన వరకే చెలి స్వరమై
తన దరికే నా ప్రాణమే ప్రయాణమై


చరణం : 2
జిగిబిగి మనసు సంకెల
తెగువగ తెంచా నేనిలా
మగువను మార్చా ప్రేమలా
తొలితొలితొలిగా
పరిచిన పసిడి దారిలా
విరిసిన వెలుగు ధారలా
నడిచా ఆమె నీడలా కలకలకలగా
తన వలపే అమృతము
తన వరమే జీవితము
తన పరమై తరించనీ ఈ సోయగము


చిత్రం : అనగనగా ఓ ధీరుడు (2011)
రచన : చంద్రబోస్
సంగీతం : మిక్కీ జె.మేయర్
గానం : కార్తీక్, సాహితి

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top