You Are Here: Home » ఇతర » అధికారం కాదు మాకు సాధికారతే ముఖ్యం

అధికారం కాదు మాకు సాధికారతే ముఖ్యం

1975 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి మహిళా సంవత్సరంగా 75-85ను మహిళా సాధికార దశాబ్దంగా ప్రకటించింది. 1975లో ’సమ్మిట్‌ఫర్‌ఉమన్‌’’ పేరుతో మెక్సికోలో, 1995లో బీజింగ్‌వేదికగా స్ర్తీల సమస్యలపై చర్చించింది. 189 దేశాల మహిళా ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ప్రాతినిధ్య దేశాల సంఖ్యను చూస్తే మహిళల చైతన్య స్థారుు పలు రంగాల్లో వారి చొరవ, ప్రతిభ పెరిగిందని అవగతమౌతోంది. అమెరికా, ఇరాన్‌, ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌ తదితర పరోక్ష, ప్రత్యక్ష యుద్ధాల్లో మహిళలు, బాలలు సమిధలు అయ్యారు. స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం తమ బ్రతుకులు తమను బ్రతుకనివ్వమ్మని కోరుతూ ఉద్యమాల్లో మహిళలు పెద్దఎత్తున కదలిరావడం గమనార్హం.

3ఈ విధంగా ప్రపంచ వ్యాప్తంగా తమ సమస్యలు, హక్కులకే పరిమితం కాకుండా, ప్రజాస్వామ్య విలువల కోసం, సమసమాజ నిర్మాణం కోసం జరుగుతున్న ఉద్యమాల్లో పాలుపంచుకుంటున్న మహిళలు ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిని కలిగిస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు.ఇక మన విషయానికి వస్తే ఆకాశమే హద్దుగా వృద్ధి చెందుతున్న మహిళా లోకానికి, సరికొత్త ఆర్థిక విధానాల పేరుతో ప్రారంభమైన సంస్కరణలు పెద్ద ఆటంకాలుగాప రిణమించాయని చెప్పవచ్చు. అందువలన అప్పటివరకూ లభించిన కొన్ని అవకాశాలు కూడా పోయాయి. పాశ్చాత్య దేశాల నుండి అవసరం లేకున్నా దిగుమతి చేసుకుంటున్న వస్తువులతోపాటు వారి సంస్కృతి దిగుమతి కావడంతో కుటుంబ వ్యవస్థ విచ్ఛినమై, ఉపాధి అవకాశాలు, సమాన న్యాయం, విద్య, వైద్యం అన్నీ, మార్కెట్టు వస్తువలుగా మారి, మనుషుల ఆలోచనలువ్యాపారమైపో యి తీవ్ర నష్టం జరుగుతోంది.అమెరికాలో పాఠశాల విద్యను ప్రభుత్వ రంగంలోనడుపు తూ, వ్యవసాయ రంగానికి కోట్ల డాలర్లు సబ్సిడీలు యిస్తున్నది.

ప్రపంచబ్యాంకు మాత్రం వర్థమాన దేశాలపై ఆంక్షలు విధించడాన్ని ప్రజాస్వామ్యవాదులతోపాటు, మహిళలూవ్యతిరేకిస్తున్నారు. కొందరు పాలకులు, బడాబాబులూ తమ జేబులు నింపుకుంటూ అప్పులు, ఆకలి అందరికీ పంచుతున్నారు. ఆస్తులు ఆదాయం తమ స్వంతం చేసుకుంటున్నారు.ఈ దశలో ఆదాయ మార్గాలు కరువై పిల్లల్ని, వృద్ధుల్ని పోషించలేక కుటుంబ పెద్దలు ఎన్నో అగచాట్లుపడుతున్నారు.కుటుంబ పోషణలో భర్తకు తోడ్పడదామనుకున్నా, కేవలం సాంకేతిక పరంగా వృద్దిచెందిన ఐటి, కార్పొరేట్‌ ఉద్యోగాల్లో చదువుకున్న మహిళలకే తప్ప, సాధారణ గృహిణులు, బడుగు వర్గాల మహిళలు ఆకలి కోసం అప్పులు చేసి, అప్పులు తీర్చలేక సతమతమవుతున్న పరిస్థితి. భద్రతలేని వలస కూలీల దుస్థితి మరీ దారుణం.

6మహిళా సాధికారత కోసం ఎన్నో ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప దానిని ఏవిధంగా తీసుకురావాలి అన్నదానిమీద ఎవరికీ పూర్తి అవగాహన ఉన్నట్టు కనిపించడం లేదు. మహిళలకి వేదింపులు, సాధింపులు యథాతథంగానే ఉన్నాయి. ఙచెప్పుకున్నవాళ్ళవి బయట పడుతున్నాయి, చెప్పుకోలేక పరువుకోసం రోడ్డు ఎక్కలేక దిగమింగు కుంటున్న మహి ళలు రెట్టింపు సంఖ్యలో ఉన్నార న్నది వాస్తవం. అందుకే ముందుగా మహిళలకు చట్టాల్లో ప్రాతినిధ్యం ఇవ్వడం ఎంతో అవసరం ఉంది. సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా చట్టాలు సవరించి, మహిళలకు భద్రత కల్పిస్తేనేగానీ ఈ జాఢ్యం నుంచి దేశం బయటపడదు.

పర్యావరణ ఆవరణలో…
2ఋతువులు, కాలాలతో ప్రమేయం లేకుండా వాతావరణంలో అనూహ్యమైన మార్పులు సంతరించుకున్నాయి. పర్యావరణ సమతౌల్యం దెబ్బదిని భూమి రోజు రోజుకీ వేడెక్కుతోంది. మంచు పర్వతాలు కరుగుతున్నాయి. ఎండాకాలంలో వర్షాలు, ఆమ్ల వర్షాలు, చలికాలంలో వడగాడ్పులు, ఇవన్నీ ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. వాతావరణలలో వస్తున్న ఈ పెనుమార్పులు అనూహ్యమైనవో, అతీతశక్తులవోకావు. అభివృద్ధి చెందిన అగ్రరాజ్యాల పాపాల ఫలితం ప్రజలంతా అనుభవిస్తున్నారు. ప్రపంచంలో భూకంపాలు, రకరకాల సునామీలు ఈ ఫలితమే. ఈ కాలుష్య ప్రభావం ప్రకృతితో పాటు మానవ మనుగడపైన పెను ప్రభావం చూపుతున్నది. ఉదాహరణకు స్ర్తీల పునరుత్పత్తిపైనా, పిల్లల ఎదుగుదల పైనా, మొత్తంగా అన్ని జీవుల పైనా ఉంటుంది. ప్రజా సంఘాలు, మేధావులు, శాస్తవ్రేత్తలు చేసే ఆందోళనల్లో మహిళలు మరింత భాగస్వాములు కాకతప్పదు.

నేటి ఉద్యమాలలో…
04dheera1అన్ని మార్పుల్నీ గమనిస్తున్న సాధారణ మహిళలు కూడా ఇప్పుడు సమాజ సమస్యల మీద దృష్టి సారింస్తున్నారు. గళం విప్పుతున్నారు. ఎక్కడ అన్యాయం జరుగుతున్నా ఉద్యమిస్తున్నారు. తోటి మహిళల్ని చైతన్యవంతులుగా మారుస్తున్నారు. ఎవరి అండదండలూ అవసరం లేకుండానే మహిళాలోకం తమ హక్కుల కోసం నిలదీస్తోంది. గ్రామ స్ధాయి నుంచి మహానగరాల వరకూ ఎవరి పట్ల అన్యాయం జరిగినా, ఎవరికి ఏ సమస్యవచినా సంఘటితంగా ఉద్యమిస్తున్నారు. ఈ మార్పు చాలా అవసరం, స్వాగతించవలసినదే. అయితే కొన్ని దురాచారాల్ని నిలువరించడంలో వీరి శక్తి సరిపోవడం లేదనే చెప్పవచ్చు. భద్రత విషయంలో కూడా సమాజంలో ఇంకా అనూహ్యమైన మార్పులు తీసుకురావడానికి మరింత ఉద్యమించవలసి ఉంది. అందుకు చట్టపరమైన సవరణలు, మహిళా రక్షణ వంటి అనేక మార్పులు వస్తేనే మహిళలకి సంపూర్ణ సాధికారత సమకూరుతుంది. ఇప్పటికి మంచి నీటికోసం, అత్యాచారాల మీద, పెరుగుతున్న ధరల మీద, పర్యావరణ సంరక్షణ మీద, మధ్యపాన నిషేధం మీద ఇలా అనేక ఉద్యమాలు చేసి విజయాన్ని సాధించిన ఘనత మహిళలకే దక్కుతుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

చట్ట ప్రభావం..
04dheera72-73వ రాజ్యాంగ సవరణలతో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పొంది స్థానిక అధికారాల్లో, నిధుల ఖర్చులో తమ ప్రభావాన్ని చూపుతున్న మహిళలు లక్షల్లో ఉన్నారు. అయితే అసెంబ్లీ, పార్లమెంటులో 33% శాతం సాధించాల్సి వున్నది. వెనుకబడిన తరగతుల వారికి కేటాయింపులుకావాలన్న వంక పెట్టుకొని బిల్లును అడ్డుకుంటున్న వారు, చిత్తశుద్ధి లేని పాలకులు, మహిళా హక్కులపట్ల నిర్లిప్తత చూపుతున్నారనడం వాస్తవం. ఏదిఏమైనా మహిళ బిల్లుని కొన్ని ప్రధాన పార్టీలు వ్యతిరేకించడం శోచనీయం. అదీకాక మనదేశ రాష్టప్రతిగాప్రతిభా పాటిల్‌, యూపీఏ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ, ప్రధాన ప్రతిపక్ష నేతగాసుష్మాస్వరాజ్‌లాంటి ప్రముఖులు ఉన్న సమయంలోనే మహిళా బిల్లు ఆమోదం పొందకపోవడం గర్హనీయం.

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top