You Are Here: Home » ఇతర » అదిరే.. అందాలు!

అదిరే.. అందాలు!

‘యువతరం కోసం షాపింగ్‌మాల్స్‌ సరికొత్త డిజైన్లను అందుబాటులోకి తీసుకువస్తున్నారుు. పలు ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించి అందిస్తున్నారుు. మహిళలతో పాటు కాలేజీకి వెళ్లే యూత్‌ విభిన్న వస్తధ్రారణ కోరుకుంటున్నారు. ఒకరికంటే ఒకరు భిన్నంగా కనిపించాలన్న కోరిక ఇటీవలి కాలంలో పెరుగుతోంది. దీనికి తగ్గట్లుగా ఉత్పత్తులు రూపుదిద్దుకుంటున్నారుు. కాలేజీకి వెళ్లే యువతుల కోసం డిజైనర్లు ప్రత్యేక లుక్‌తో తీర్చిదిద్దుతున్నారు.

మరోవైపు కాలేజీ యూత్‌ నిత్యం ధరించే వసాత్రలకు తగ్గ జ్యుయలరీ ధరించేందుకు కూడా పోటీపడుతున్నారు. దీంతో సరికొత్త డిజైనర్‌ ఆభరణాలు అందుబాటులోకి వస్తున్నారుు. పలు జ్యుయలరీ షోరూవ్గుల నిర్వాహకులు కూడా వీటిని అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఈతరుణంలో హైదరాబాద్‌లోని హిమయత్‌ నగర్‌లో ‘లైలాక్‌’ పేరుతో ఓ సరికొత్త డిజైనర్‌ షోరూవ్గు ఏర్పాటైంది. అలాగే నిఫ్ట్‌ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ విద్యార్ధులు తమ ప్రతిభను జోడించి సరికొత్త డిజైనర్‌ ఉత్తుత్తులను ప్రదర్శించారు. ఆ వివరాలు ఈ వారం ‘స్టైల్‌’ లో మీకోసం…’

style0యువతరం నిత్యం ధరించే వస్త్రాలకు తగ్గ జ్యుయలరీ ధరించేందుకు పోటీపడుతున్నారు. దీంతో సరికొత్త డిజైనర్‌ ఆభరణాలు అందుబాటులోకి వస్తున్నాయి. పలు జ్యుయలరీ షోరూమ్‌ల నిర్వాహకులు కూడా వీటిని అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. పేరుపొందిన కంపెనీల నుంచి చిన్నచిన్న జ్యుయలరీ షాపుల నిర్వాహకులు కూడా మగువలు మెచ్చే ఆభరణాలను అందించేందుకు ముందుకు వస్తున్నారు. పేరుపొందిన కంపెనీల నుంచి చిన్నచిన్న జ్యుయలరీ షాపుల నిర్వాహకులు కూడా మగువలు మెచ్చే ఆభరణాలను అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఈతరుణంలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ స్పెక్ట్రమ్‌-2013 భాగ్యనగర వాసులను ఆకట్టుకుంది.

ఫ్యాషన్‌ యాత్రలో వెరైటీ ఉత్పత్తులు
ఫ్యాషన్‌ ప్రియులు కోరుకునే వెరైటీ ఆభరణాలు కొలువు తీరుతున్నాయి. అంతర్జాతీయంగా ఫ్యాషన్‌రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా నగర యువత ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకుంటోంది. మార్కెట్లోకి కొత్తగా వచ్చే ఎలాంటి ఉత్పత్తులనైనా కొనుగోలు చేసేందుకు పోటీపడుతున్నారు. ఈ తరుణంలో భాగ్యనగర ఫ్యాషన్‌ ప్రియుల కోసం తాజ్‌కృష్ణలో నిర్వహించిన ఫ్యాషన్‌ యాత్ర ఆకట్టుకుంది. చీరలు, ఎత్నిక్‌, ఇండో వెస్ట్రన్‌, ఆభరణాలు, విలువైన రాళ్ల ఆభరణాలు, పాదరక్షలు, బ్యాగులు, పిల్లల దుస్తులు, హోమ్‌ యాక్ససరీస్‌ వంటివి ఈ ప్రదర్శనలో కొలువుతీరాయి. ఈ ఫ్యాషన్‌ యాత్ర ద్వారా సమకూరే ఆదాయాన్ని నాన్హీ కాలీ అనే సంస్థ బాలికలకు ప్రాధమిక విద్య నుంచి పదో తరగతి వరకు విద్యను అందించేందుకు వెచ్చిస్తున్నారు.

యూత్‌ కోసం ‘లైలాక్‌’ కొత్త డిజైన్లు
styleయూత్‌ కోసం షాపింగ్‌మాల్స్‌ నిర్వాహకులు సరికొత్త డిజైన్లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. పలు ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించడంతో భాగ్యనగరంలోని షాపింగ్‌మాల్స్‌ వినియోగ దారులతో కళకళలాడుతున్నాయి. మహిళలతో పాటు కాలేజీకి వెళ్లే యూత్‌ విభిన్న వస్తధ్రారణ కోరుకుంటున్నారు. ఒకరికంటే ఒకరు భిన్నంగా కనిపించాలన్న కోరిక ఇటీవలి కాలంలో పెరుగుతోంది. దీనికి తగ్గట్లుగా ఉత్పత్తులు రూపుదిద్దుకుంటున్నాయి. కాలేజీకి వెళ్లే యువతుల కోసం డిజైనర్లు ప్రత్యేక లుక్‌తో తీర్చిదిద్దుతున్నారు. ఈ తరుణంలో హైదరాబాద్‌లోని హిమయత్‌ నగర్‌లో లైలాక్‌ పేరుతో ఓ బోటిక్‌ అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఏర్పాటు చేసిన కొత్త డిజైన్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

– ఇస్కా రాజేష్‌బాబు
‘సూర్య’ లైఫ్‌స్టైల్‌ ప్రతినిధి
rajeshiska@gmail.com
ఫొటోలు : కె. సర్వేశ్వర్‌రెడ్డి, ఎస్‌ శరత్‌బాబు, ఎ. రమణాచారి

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top