You Are Here: Home » ఇతర » అదిరె.. అదిరే!

అదిరె.. అదిరే!

‘ఫ్యాషన్‌ ఇప్పుడు యువతలో అదో ్రేకజ్‌..సరికొత్త డిజైన్లపై వారు మోజుపడు తున్నారు. యువతరం అభిరుచులకు తగ్గట్లుగా సరికొత్త ఫ్యాషన్‌లు ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్నారుు . ఏ కొత్త డిజైన్‌ వచ్చినా భాగ్యనగర ఫ్యాషన్‌ప్రియులు అనుసరించడంలో పోటీపడు తుండడంతో డిజైనర్లు సరికొత్త ఆవిష్కరణ లకు సిద్ధమవు తున్నారు. ఈ తరుణంలో ముంబారుులో జరుగుతున్న ‘లాేక్మ ఫ్యాషన్‌వీక్‌’లో ప్రముఖ డిజైనర్లు సరికొత్త డిజైన్లను యువత కోసం అందుబాటులోకి తెచ్చారు. ఈ ఫ్యాషన్‌ వీక్‌పై ఈవారం ‘స్టైల్‌’ అందిస్తున్న ప్రత్యేక కధనం ఇది…’

fasioఫ్యాషన్‌ ప్రియుల కోసం డిజైనర్లు సరికొత్త అందాలను సృష్టిస్తు న్నారు. తమ సృజనాత్మకతను జోడించి వెరైటీ డిజైన్లను రూపొందిస్తున్నారు. ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు తగ్గ డిజైన్లను రూపొందించడంలో డిజైనర్లు పోటీపడుతు న్నారు. యువతీ, యువకుల మనోభావాలకు తగిన వాటిని అందించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈ తరుణంలో ముంబాయిలో జరుగుతున్న లాక్మే వింటర్‌ ఫెస్టివ్‌-2012లో డిజైనర్లు రూపొందించిన అరు దైన డిజైన్లను మోడల్స్‌ ప్రదర్శించారు. ప్రముఖ డిజైనర్లు రూపొందించిన సరికొత్త డిజైన్‌లతో ఈ ఫ్యాషన్‌ వీక్‌ ఉత్సాహంగా సాగుతోంది. మాన్‌సూన్‌ సీజన్‌లో లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లు పలువురు సెలబ్రిటీలు కూడా పాల్గొంటుండడంతో దీనికి క్రేజ్‌ ఏర్పడింది.

ఫ్యాషన్‌ హబ్‌గా హైదరాబాద్‌…
ఫ్యాషన్‌ డిజైనింగ్‌ విద్యార్ధులు అదిరే డిజైన్లను రూపొందిస్తున్నారు. సరికొత్త రీతిలో వాటిని ఫ్యాషన్‌ ప్రియులకు పరిచయం చేస్తున్నారు. అంతర్జాతీయంగా ఎప్పటికప్పుడే వచ్చే కొత్త డిజైన్లను వీరి సృజన జోడించి మరింత వన్నె తెస్తున్నారు. ముంబాయి, బెంగుళూరు నగరాలతో పాటు హైదరాబాద్‌ సైతం ప్రస్తుతం ఫ్యాషన్‌ హబ్‌గా మరుతోంది. ఇతర రాష్ట్రాల విద్యార్ధులు కూడా హైదరాబాద్‌ వైపు చూస్తున్నారు. యువతీ, యువకులు ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సులను నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో కోర్సులు…
మోడలింగ్‌ అంటే క్రేజ్‌ ఉన్న యువతీ, యువకులు ఈ రంగంలోకి అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. మోడలింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రత్యేక శిక్షణ పొంది మరీ ర్యాంప్‌పై రాణిస్తున్నారు. ఓవైపు చదువుకుంటూ పార్ట్‌టైమ్‌గా మోడలింగ్‌ చేసే వారి సంఖ్య కూడా ఇటీవలి కాలంలో పెరుగుతోంది. యువతులతోపాటు యువకులు కూడా సరదాగా ర్యాంప్‌పై క్యాట్‌వాక్‌ చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈతరుణంలో భాగ్యనగరంలోని పలు ఫ్యాషన్‌ డిజైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ విద్యార్దుల కోసం సరికొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చి వారికి శిక్షణ ఇస్తున్నాయి.

-ఇస్కా రాజేష్‌బాబు,
‘సూర్య’ లైఫ్‌స్టైల్‌ ప్రతినిధి
ఫొటోలు : కె. సర్వేశ్వర్‌రెడ్డి, శరత్‌, రమణాచారి

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top