You Are Here: Home » చిన్నారి » అత్యంత చిన్న చేప ఏది?

అత్యంత చిన్న చేప ఏది?

చేపల్లో పెద్దపెద్ద చే పలూ, చిన్నచిన్న చేపలూ ఉంటాయని మనందరికీ తెలుసు. కాని చాలా చిన్న చేప గురించి ఎప్పుడైనా విన్నారా! ‘పేడోసిప్రిస్ ప్రోజెనిటికా’ అనే చేప ప్రపంచంలోకెల్లా అత్యంత చిన్న చేప అని శాస్తజ్ఞ్రులు కనుగొన్నారు. ఇది సకశేరుకాల్లో అంటే వెన్నుముక గల జీవుల్లోకెల్లా అత్యంత చిన్నది. ఇది ఎంత చిన్నగా ఉంటుందంటే… దీని పొడవు కేవలం 7.9 మిల్లీ మీటర్లు. అంటే అంగుళంలో మూడో వంతు కన్నా తక్కువే.

దీనిని ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో కనుగొన్నారు. పారదర్శకంగా ఉండే ఈ చేప చూడడానికి లార్వా లాగ కనిపిస్తుంది. ఈ చేపలు టీ రంగులో ఉన్న నీటిలో నివసిస్తాయట. ఈ చేపలు నివసించే నీటికి వర్షపు నీటి కన్నా దాదాపు వంద రెట్లు ఆమ్లత్వం ఉం టుంది. లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియమ్‌కి చె ందిన జంతు శాస్తవ్రేత్త రాల్ఫ్ బ్రిట్జ్ ఈ చేప గురించి ‘‘నా కెరీర్ మొత్తంలో నేను చూసిన అత్యంత వింతైన చేప ఇది’’ అన్నారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top