You Are Here: Home » చిన్నారి » అత్యంత ఎత్తుకు ఎగిరే పక్షి ఏది?

అత్యంత ఎత్తుకు ఎగిరే పక్షి ఏది?

పక్షులు వాటి సామర్థ్యాన్ని బట్టి ఎత్తుకు ఎగురుతుంటాయి. కొన్ని పక్షులు చాలా ఎత్తుకి ఎగరగలుగుతాయి. అన్నింటి కన్నా ఎక్కువ ఎత్తుకి ఎగరగలిగే పక్షి మధ్యఆఫ్రికాలోని సాహెల్ ప్రాంతంలో కనిపించే రూపెల్స్ గ్రిఫాన్ అనే రాబందు. ఇది మిగిలిన పక్షుల కంటె ఎక్కువ ఎత్తు ఎగరగలుగుతుంది. దీనిని రూఫెల్స్ గ్రిఫిన్ అని కూడా అంటారు. 19వ శతాబ్దానికి చెందిన జర్మన్ జంతు శాస్త్ర వేత్త ఎడ్వర్డ్ రూపెల్ పేరునే ఈ రాబందుకి పెట్టారు. ఈ పక్షి సముద్రపు మట్టం ఉంచి 36వేల అడుగుల కన్నా ఎక్కువ ఎత్తుకి ఎగురుతుంది. అందుకే ప్రపంచంలో అన్ని పక్షుల కంటె ఎత్తులో ఎగిరే పక్షిగా రికార్డులోకి ఎక్కింది. పర్యావరణ పరిశుభ్రతకు దోహదపడే వీటి ప్రస్తుతసంఖ్య 30,000 వరకు ఉన్నప్పటికీ, రోజురోజుకి తగ్గిపోతుండడం విచారకరం.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top