You Are Here: Home » సినిమా » పాటలు » అత్తా ఒకింటి కోడలే (1958)- జోడు గుళ్ళ పిస్తోలు ఠా

అత్తా ఒకింటి కోడలే (1958)- జోడు గుళ్ళ పిస్తోలు ఠా

పల్లవి :
జోడు గుళ్ళ పిస్తోలు ఠా
నేను ఆడీ తప్పని వాణ్ణీ జీహా… (2)

చరణం : 1
హద్దు మీరు వారు శిక్షింపబడుదురు
బుద్ధిమంతులెపుడు రక్షింపబడుదురు
॥జోడు॥

చరణం : 2
ఆఫీసరు భార్యననే అహం కూడదు
అధికారం చెలాయిస్తే ఇంక చెల్లదు
తొండ ముదిరితే ఊసరవెల్లి అత్తా
హజం ముదిరితే హళ్ళికి హళ్ళి
॥జోడు॥

చరణం : 3
కాకి పిల్ల కాకికి కడు ముద్దు
అది అందుచేత కాకూడదు మొద్దు
ఎవరి గొప్ప వాళ్ల వద్ద ఆగకున్నచో (2)
అత్తా… దేహశుద్ధి
కొండొకచో జరుగుట కద్దు
॥జోడు॥

చరణం : 4
నోరు మంచిదైతేనే ఊరు మంచిది
పోరు నష్టమూ
ఎపుడూ పొందు లాభము
ఇది కోర్టుకెక్కితే అంతా అభాసు అత్తా
నీ జోరు తగ్గకుంటేనూ కొంప కళాసు
॥జోడు॥

చిత్రం : అత్తా ఒకింటి కోడలే (1958)
రచన : ఆరుద్ర
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
గానం : ఘంటసాల

e-mail: sakshisong@gmail.com
నిర్వహణ : నాగేష్

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top