You Are Here: Home » చిన్నారి » అతినిద్రా వ్యాధి ఎలా వస్తుంది?

అతినిద్రా వ్యాధి ఎలా వస్తుంది?

స్లీపింగ్ సిక్‌నెస్ అనే అతినిద్రా వ్యాధి నాడీ వ్యవస్థను ఎక్కువగా దెబ్బతీస్తుంది. ఇది ట్రిపానోసోమా బ్రూజీ అనే ప్రోటోజోవా వర్గానికి చెందిన జీవి వల్ల వస్తుంది. ఈ జీవిలో ఉండే మూడు ఉపజాతులను బట్టి వ్యాధి లక్షణాల్లో కొన్ని తేడాలుంటాయి. ట్రి. గాంబియెన్స్, ట్రి. రొడిసియెన్సీ అనే ఉప జాతుల వల్ల మనుషుల్లో ఈ వ్యాధి వస్తుంది.

మరో ఉప జాతి వల్ల జంతువుల్లో ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధిని ఆఫ్రికన్ ట్రిపానోసోమియాసిస్ అని, గాంబియా జ్వరం అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి ఎక్కువగా ఆఫ్రికా ఖండంలోని వారికి వస్తుంది. ట్రిపానోసోమా జీవి సీసీ ఈగల ద్వారా మనుషుల్లోకి ప్రవేశిస్తుంది. ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ఉన్న వారు రాత్రి నిద్ర లేమితో బాధ పడి, పగలు ఎక్కువగా నిద్రపోతారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top