You Are Here: Home » ఇతర » ‘అట్లు’చేయవలసినదే

‘అట్లు’చేయవలసినదే

హిందువులు ఆరోగ్య పరంగాను, సామాజిక శ్రేయస్సుకోసం ఏర్పరచిన ఎన్నో చిన్నచిన్న పండుగలు చాలా వరకూ అంతరించిపోయారుు. మారుతున్న మనుషూల స్వభావరీత్యా, కాల గమనంలో కూడా చోటుచేసుకుంటున్న పరిస్థితుల రీత్యా కొన్ని పండుగలు పూర్తిగా అంతరించిపోయాయని చెప్పవచ్చు. అరుుతే ఋతువుల్ని బట్టి, కాలాన్ని బట్టి, సమాజాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పరచిన ప్రతి పండుగ వెనుకా ఒక అద్భుత రహస్యం దాగివుందన్నది వాస్తవం.

నేడు అట్ల తద్దె
ferఅంతరించిపోతున్న చిన్న పండుగల ప్రాశస్త్యాన్ని తెలియజేయ డంకోసం ఒకరిద్దరు తమ వంతు ప్రయత్నాన్ని అందిస్తున్నా ఫలితం ఆశించినంతగా ఉండటం లేదు. ఒకనాడు ఆడపిల్లలు అత్యం త ఉత్సాహంగా జరుపుకున్న అట్లతద్దె ఇంచుమించుగా అంతరించి పోయిందనే చెప్పవచ్చు. సాటి యువతుల మనసుల్ని ఒకటి చేసే అపూర్వమైన పండుగ అట్లతద్దె. అంతేకాక పెద్దల్ని, పిల్లల్ని కలిసికట్టు గా ఆడించే మంచి సరదా అయిన పండుగ. దీనిని ఆచరించడం కూడా చాలా తేలిక.

వ్రత విధానం:
ఆశ్వయుజ బహుళ తదియనాడు వచ్చే పర్వదినాన్ని అట్లతదియ, అట్ల తద్దె అని అంటారు. ఈరోజు ఈ వ్రతం చేయగోరే వారు తెల్లవారు ఝామున లేచి చద్దె అన్నం, గోంగూర పచ్చడి, నువ్వుల పొడి, ఉల్లి పాయ పులుసు, గడ్డపెరుగు ఉల్లిపాయతో కలిపి భుజించాలి. తాంబూ లం కూడా వేసుకుని తిన్నది జీర్ణం అయ్యేంతవరకూ ఆటలు ఆడాలి. ఊయల ఊగాలి. తోటి ఆడపిల్లల్ని కూడా నిద్రలేపుతూ చలాకీగా తిరుగుతూ ఆటపాటలు అయిన తర్వాత స్నానాదులు పూర్తిచేసుకుని గౌరీదేవిని పూజించాలి. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్ర దర్శనం అయిన తరువాత శుచిగా తిరిగి గౌరీదేవిని పూజించి, అమ్మవారికి పది అట్లు నివేదించాలి. తర్వాత ముతె్తైదువకు అలంకారం చేసి, పది అట్లు, పది పండ్లు వాయనంగా ఇవ్వాలి. ఆమె కాళ్ళకు నమస్కరించి ఆమెనే గౌరీదేవిగా భావించి ఆశీర్వాదం తీసుకోవాలి. వ్రతకథ చెప్పుకుని అక్షింతలు శిరస్సున ధరించి భోజనం చెయ్యాలి. ఇది వ్రతాని ఆచరించే విధానం.

వ్రత కథ
01Feaపాటలీపుత్రాన్ని పాలించే సుశీలుడనే రాజుకు పుత్రసంతానం ఉంది కానీ ఒక పుత్రిక కూడా ఉంటే ఎంతో బాగుండును అనుకుంటున్న తరుణంలో ఒక ఆడపిల్ల పుట్టింది. ఆమెకు ‘సునామ’ అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచుకోసాగారు. అన్నలుకు కూడా సనామ అంటే ఎంతో ప్రీతి. అందువల్ల చాలా గారాబంగా పెరిగిన సునామ చాలా సుకుమారంగా ఉండేది. ఆమెకు యుక్తవయసు వచ్చింది. పెళ్ళిచేయాలన్న తలంపుతో ఎన్నో సంబంధాలు చూసేవారు. అయినా చివరి క్షణంలో తపి్పపోతూవుండేవి. ఇలా ఎందుకు జరుగుతోందో కారణం తెలీక తల్లిదండ్రులు బాధపడేవారు. ఇలా పెళ్ళిచూపులతో విరక్తి చెందిన సునామ గౌరీదేవి ఆలయానికి వెళ్ళి ఆత్మహత్య చేసుకోబోయింది. అప్పుడు అశరీరవాణి ‘‘గౌరీ వ్రతాన్ని గనుక ఆచరించినట్లైతే గుణవంతుడు, సత్సీలుడు అయిన మంచి భర్తతో వెంటనే వివాహం అవుతుందని చెప్తూ వ్రత విధానాన్ని తెలిపింది.

సునామ ఎంతో ఉత్సాహంతో ఇంఇకి తిరిగివచ్చి, ఆశ్వయుజ బహుళ తదియనాడు ఈ వ్రతాన్ని ఆచరించింది. రాత్రి చంద్రోదయం అయ్యేంత వరకూ మంచినీరు కూడా ముట్టకుండా కఠిన ఉపవాసం చేసి వ్రతఫలాన్ని పొందాలనుకుంది. ఎంతో సుకుమారంగా పెరగడం వల్ల శోషవచ్చి, నీరసంతో పడిపోయింది. ఆమె స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న సునామ సహోదరులు అక్కడికి దగ్గర్లో ఉన్న చింతచెట్టుకు గుండ్రని అద్దాన్ని కట్టి దానికెదురుగా ఎండిన రెల్లు గడ్డి కుప్పవేసి, దానికి నిప్పు పెట్టి ఆ మంట అద్దంలో ప్రతిబింబించేలా చేసారు. సునామకు సేదతీర్చి చింతచెట్టు కొమ్మలమాటు నుంచి చంద్రుడు ఉదయిస్తున్నాడు చూడు. అని నమ్మించారు. సునామ ఆ వెలుగును చూసి చంద్రోదయంగా భావించి ఆహారం భుజించింది. అన్నలు చేసిన పనికి వ్రతోల్లంఘనం జరిగి మళ్ళీ ఎన్ని పెళ్ళి సంబంధాలు వచ్చినా కుదరక వెనుతిరగడం సునామకు మనస్థాపాన్ని కలిగించింది.

atlaఆమె మళ్ళీ గౌరీదేవి ఆలయానికి వెళ్ళి ఇదివరలో లాగే ఆత్మహత్యకి ప్రయత్నించింది. అప్పుడు మళ్ళీ అశరీరవాణి తన అన్నలు చేసిన తప్పును చెప్పి వ్రతభంగం అయిన కారణంచేత ఇలా జరిగిందని మళ్ళీ వ్రతాన్ని ఆచరించమనీ ఆదేశించింది. సునామ ఈసారి అత్యంత భక్తి శ్రద్దలతో ఈ వ్రతాన్ని ఆచరించింది. అతి సౌందర్య వంతుడు, జ్ఞానప్రదీపుడు, సర్వలక్షణ సంపన్నుడు అయిన భర్తతో వెంటనే వివాహం జరిగింది. తల్లిదండ్రుల మనస్థాపం తీరి సునామ కోరిక నెరవేరింది.

పండుగలో పరమార్థం
యుక్తవయసుకు వస్తున్న ఆడపిల్లల ఆలోచనలు సక్రమ మార్గంలో నడిపించడానికి, భక్తి మీద మనస్సును లగ్నం చేయించడానికీ శాస్ర్తీయంగా ఈ వేడుక తోడ్పడుతుంది. ఆశ్వయుజ మాసం చలితో కూడుకున్నది. పిల్లల నరాలు బిగియ దీసి ఉంటాయి. అందువల్ల వారికి ఆహారం తినాలని అనిపించదు. పెైన వివరించిన ఆహార పదార్ధాలను తెల్లవారు ఝామున భుజించడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. గోంగూర, నువ్వులు ఆయుర్వేద పరంగా ఉష్ణతత్వాన్ని కలిగిఉంటాయి. కనుక రాత్రి మన నిద్రలో సేదతీరిన ఉదరానికి తెల్లవారుఝామున ఈ పదార్ధాలు ఔషధాల్లా ఉపయోగపడతాయి. ఈ తిన్నది పూర్తిగా జీర్ణం అవ్వడానికి వ్యాయామంగా తెల్లవారిన నుండీ ఆటలు ఆడటం, ఊయల ఊగటం వంటివి చేస్తారు.

ఇలా ఊయల ఊగటం వల్ల నరాల్లో రక్త ప్రసరణ సక్రమంగా జరగడానికి దోహదపడుతుందన్న విషయం అందరికీ తెలిసినదే. ఇక ఆరోజంతా పూర్తి ఉపవాసం ఉండటంచేత, చంద్రోదయ వేళకి ఆకలి పుడుతుంది. అది జీర్ణశక్తి వృద్దిచెందిందనడానికి సంకేతం. ఇలా ఆరోగ్యపరంగా ఈ పండుగ ఎంతో మేలుచేస్తుంది. ఇటువంటి చిన్న చిన్న పండుగలు చేయకపోవడం వల్లనే ఈరోజుల్లో చాలామందికి చిన్నవయసులోనే అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయన్నది అక్షర సత్యం. ఇదే ఈ పండుగ పరమార్థం.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top