You Are Here: Home » ఇతర » అగ్నిప్రమాదాల నుంచి రక్షణ కల్పించే బీమా ఫైర్‌ ఇన్సూరెన్స్‌

అగ్నిప్రమాదాల నుంచి రక్షణ కల్పించే బీమా ఫైర్‌ ఇన్సూరెన్స్‌

అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు పలు సందర్భాల్లో నష్టం అపారంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే దాన్ని ఆర్పివేయలేనప్పుడు. ఫ్లాట్లు, ఇండిపెండెంట్‌ ఇళ్ళు లాంటి వాటిల్లో ఈ తరహా అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు పలు రకాలుగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఎన్నో రకాల ఆస్తులు అగ్నికి ఆహుతైపోయే ప్రమాదం ఉంది. బీమా చేయించుకోవడం ద్వారా ఈ విధమైన నష్టాలను గణనీయంగా తగ్గించుకునే అవకాశం ఉంది. అందుకు వీలు కల్పించేదే ‘ఫైర్‌ ఇన్సూరెన్స్‌’.

fire6భవనాలు, అందులోని వస్తువులు ఫైర్‌ ఇన్సూరెన్స్‌ రక్షణ పరిధిలోకి వస్తాయనే విషయం తెలిసిందే. ఇక్కడ భవనం అంటే ఆ కట్టడం అని మాత్రమే కాదు. పర్మినెంట్‌ ఫిక్చర్స్‌, శానిటరీ ఫిక్చర్స్‌ లాంటివి కూడా దీని పరిధిలోకి వస్తాయి. గ్యారేజీలు, ద్వారమంట పాలు, ఇతర మండపాలు, సరిహద్దు గోడలు లాంటివన్నీ కూడా బీమా పరిధిలోకి వస్తాయి. ప్రయివేటు రోడ్లు, స్విమ్మింగ్‌ పూల్స్‌, పునాదులు లాంటి వన్నీ ఇందులో కవర్‌ అవుతాయి. సాధారణంగా పునాదు లకు అగ్నిప్రమాదం నుంచి ముప్పు ఉండనప్పటికీ, భూకంపాలు లాంటివి వచ్చినప్పుడు మాత్రం వాటికి కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. బీమా చేయించుకునేటప్పుడు ఈ విధమైన అంశాలన్నింటినీ నిర్దిష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది.ఫైర్‌ ఇన్సూరెన్స్‌ అనేది బీమా సంస్థకు, బీమా చేయించే వ్యక్తికి మధ్య కుదిరే ఒప్పందం.

వారసత్వంగా మినహాయిస్తే ఆస్తి అమ్మకం వంటి వాటి ద్వారా దీన్ని మరో వ్యక్తి పేరు మీదకు బదలాయించలేం. ఇది నిర్దిష్ట ప్రాంతానికి సంబంధించిన పాలసీ. అంటే, పాలసీలో పేర్కొన్న ఆస్తిని మరో ప్రాంతానికి తరలించినప్పుడు ఆ ఆస్తి ఇక బీమా పరిధిలోకి రాదు. ఈ బీమా విధానం, తీరు తెన్నులు ఇప్పటికీ నియంత్రణ సంస్థ పరిధిలో ఉన్నందున అందించే కవరేజీ, నియమనిబంధనలు లాంటివన్నీ దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉంటాయి.

ఫైర్‌ ఇన్సూరెన్స్‌ పరిధిలో కవర్‌ అయ్యే రిస్క్‌
ఆవాస భవనాలకు సంబంధించిన పలు ఫైర్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు దిగువ నష్టాలపై కవరేజీని అందిస్తాయి.
1. అగ్నిప్రమాదం 2. పిడుగులు
3. పేలుడు 4. ఎయిర్‌క్రాఫ్ట్‌ డామేజీ (విమానాలు కూలడం…)
5. అల్లరిమూకల దాడులు / ఇతరులు కలిగించే నష్టం
6. ఎస్‌టీఎఫ్‌ఐ (వరదలు లాంటివి)
7. ఇంపాక్ట్‌ డామేజ్‌
8. సబ్సిడెన్స్‌ / ల్యాండ్‌స్లయిడ్‌ (మట్టిచరియలు లాంటివి విరిగిపడడం)
9. జలాశయాలు లాంటివి కట్ట తెగడం, ఓవర్‌ఫ్లో కావడం లాంటివి
10. క్షిపణి పరీక్షలు 11. ఆటోమేటిక్‌ స్ప్రింక్లర్స్‌ నుంచి లీకేజీ
12. కార్చిచ్చు లాంటివి
బేసిక్‌ ఫైర్‌ ఇన్సూరెన్స్‌కు పలు సంస్థలు రకరకాల యాడ్‌-ఆన్స్‌ జోడిస్తుంటా యి. ఇది అదనపు బీమా రక్షణను అందిస్తుంది. ఇందుకు గాను అదనపు ప్రీమి యంను వసూలు చేస్తారు.
ఆవాస భవనాలకు సంబంధించి దిగువ పేర్కొన్న యాడ్‌-ఆన్స్‌ను వివిధ సంస్థ లు ఆఫర్‌ చేస్తుంటాయి.

1. భూకంపం
2. అద్దె నష్టం (భవన యజమానులకు అనుకూలమైంది)
3. ప్రత్యామ్నాయ వసతికి అద్దె (అద్దెకు ఉండేవారికి అనుకూలమైంది)
4. ఉగ్రవాద దుశ్చర్యలు
5. ఆర్కిటెక్క్‌, సర్వేయర్‌ ఫీజులు, శిథిలాల తొలగింపు వ్యయాలు అధికం కావడానికి సంబంధించింది
అగ్నిప్రమాద బీమా తీసుకోవడంలో పరిశీలించాల్సిన అంశాలు
్ఞఆవాసభవనానికి అగ్నిప్రమాద బీమా తీసుకునే సందర్భంలో దిగువ పేర్కొన్న అంశాలను అర్థం చేసుకోవడం ముఖ్యం.
ఆస్తి విలువ కట్టడం, తగినంత బీమా రక్షణ పొందడం:

సమ్‌ ఇన్సూర్డ్‌ (ఎస్‌ఐ):సమ్‌ ఇన్సూర్డ్‌ అనే పదాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. సరైన మొత్తానికి ఆస్తి ని బీమా చేయించడం ముఖ్యం. అగ్నిప్రమాదం జరిగిన సందర్భంలో బీమా కంపెనీ గరిష్ఠంగా ఎంత మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుందో సమ్‌ ఇన్సూర్డ్‌ అనేది సూచిస్తుంది. సమ్‌ ఇన్సూర్డ్‌ విలువ ఆస్తివిలువకు తగినట్లుగా (మార్కెట్‌ విలువ లేదా రిఇన్‌స్టేట్‌మెంట్‌ విలువ ఆధారంగా) ఉండాలి.

మార్కెట్‌ విలువు, రిఇన్‌స్టేట్‌మెంట్‌, రిప్లేస్‌మెంట్‌ విలవలు:మార్కెట్‌ విలువ అనేది అదే తరహా, తయారీతో కూడిన ఆస్తి విలువ. ఈ సంద ర్భంలో అరుగుదల, తరుగుదలను పరిగణనలోకి తీసుకుంటారు. రిప్లేస్‌మెంట్‌ లేదా రిఇన్‌స్టేట్‌మెంట్‌ అంటే తేలిగా చెప్పాలంటే, పాతదానికి కొత్తది ఇవ్వడం. ఇక ఇందులో క్లెయిమ్‌ చెల్లింపు సమయంలో అరుగుదల, తరుగుదల తీసివే యడం లాంటివేవీ ఉండవు. మార్కెట్‌ విలువను ఎంచుకున్నా, రిఇన్‌స్టేట్‌ మెంట్‌ను ఎంచుకున్నా కట్టే ప్రీమియం రేటులో ఎలాంటి తేడా ఉండదు. ఇదే సమయంలో మార్కెట్‌ విలువను సమ్‌ ఇన్‌స్యూర్డ్‌గా పరిగణించలేం. ఇలాంటి సందర్భాల్లో అండర్‌ ఇన్సూర్డ్‌ కూడా పరిశీలించాలి. తగినంత మొత్తానికి బీమా చేయించకపోతే, అందుకు తగ్గ నిష్పత్తిలో ఆ నష్టాన్ని పాలసీదారు భరించాల్సి వస్తుంది.

డిడక్టిబుల్‌ / ఎక్సెసెస్‌: ఈ బీమాకు సంబంధించి వర్తించే డిడక్టిబుల్‌/ఎక్సెసెస్‌లను కూడా పాలసీదారు లు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. బీమా చేసిన వ్యక్తులు తప్పని సరి గా భరించాల్సిన మొత్తం ఇది. ఈ మొత్తానికి దిగువన జరిగే నష్టాన్ని బీమా సంస్థ చెల్లించదు. ఈ మొత్తానికి మించిన దాన్ని మాత్రమే బీమా సంస్థ చెల్లి స్తుంది. మినిమమ్‌ డిడక్టబుల్‌ అనేది ఫిక్స్‌డ్‌గా ఉంటుంది. రిస్క్‌ను దృష్టిలో ఉం చుకొని బీమా సంస్థలు ఈ మొత్తాన్ని పెంచడాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు.

కొటేషన్‌కు అవసరమైన సమాచారం
ఫైర్‌ ఇన్సూరెన్స్‌ కోసం బీమా సంస్థను సంప్రదించినప్పుడు వారు మిమ్మల్ని ఆర్‌ఎఫ్‌క్యూ (రిక్వెస్ట్‌ ఫర్‌ కొటేషన్‌) పత్రాన్ని భర్తీ చేయాల్సిందిగా కోరుతారు. సాధారణంగా వారు అడిగే వివరాలిలా ఉంటాయి.

 • ఆక్యుపెన్సీ
 • ఏ విధమైన నిర్మాణం మరియు భవనం వయస్సు
 • బేస్‌మెంట్‌ ఎక్స్‌పోజర్‌
 • గతంలో నష్టం వాటిల్లిన వివరాలు
 • గతంలో చేసిన బీమా వివరాలు
 • అగ్నినిరోధక సాధనాల వివరాలు
 • అక్కడ ఉండే బావులు,చెరువులు వివరాలు / ఎంత దూరంలో ఉన్నాయి
 • సంబంధిత వివరాలు మరేవైనా

  పాలసీ డాక్యుమెంట్‌ చదవడం ముఖ్యం
  ఇక అన్నింటి కంటే చివరిది, అన్నింటి కంటే ముఖ్యమైంది మీరు తీసుకున్న పాలసీని క్షుణ్ణంగా చదవడం. ఈ సందర్భంగా దిగువ విషయాలను పరిశీలిం చాలి.
  1. డాక్యుమెంట్‌లో పేరు, చిరునామా లాంటి వివరాలు సరైన విధంగా నమోదు కావడం
  2. పాలసీ కింద కవర్‌ అయ్యే పెరిల్స్‌, యాడ్‌ ఆన్స్‌
  3. పాలసీ కింద ఉండే డిడక్టబుల్స్‌ లేదా ఎక్సెసెస్‌
  4. పాలసీలో ఉన్న నిర్దిష్ట వారంటీలు, ఆంక్షలు లేదా మినహాయింపులు
  5. పాలసీ కాలంలో పాలసీదారు పాటించాల్సిన నియమ నిబంధనలు
  6. క్లెయిమ్‌ చేయాల్సి వస్తే అందుకు సంబంధించిన నిబంధనలు
  7. బీమా సంస్థ పేర్కొన్న ‘చేయదగ్గ, చేయకూడని’ పనులు
  ఇవన్నీ పాటిస్తే, అవసరమైన సందర్భాల్లో క్లెయిమ్‌ చేయా ల్సి వస్తే మీరు దిగ్భ్రాంతి చెం దాల్సిన అవసరం ఉండదు. మీ ఆస్తులకు ఫైర్‌ ఇన్సూ రెన్స్‌ కల్పించుకోవడం ఉత్త మం. భద్రమైన భవిత కోసం బీమా చేయించడం మంచిది. తీసుకునే పాలసీపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండడం, డాక్యుమెంట్‌లోని అంశాలను అర్థం చేసుకోవడం మర్చిపోవద్దు.

  -అనుజ్‌ త్యాగి, హెడ్‌,
  కార్పొరేట్‌ అండ్‌ రూరల్‌ అండ్‌ అగ్రి బిజినెస్‌,
  హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top