You Are Here: Home » చిన్నారి » కథలు » అగాధ శిఖరం

అగాధ శిఖరం

SUNDAY-STORYగట్టిగా అలా కళ్ళు నులుముకొని అలా పడక కుర్చీలో కూలబడ్డాడు. కొంత అనిశ్చతి ఆయనగారిని వెంటాడుతూనే ఉంది. పెరుగుతున్న వయసు వెంట ప్రోది చేసుకొస్తూన్న అనుభవాల జడిలో తడిసి తర్వాత అనివార్యంగా సర్దుకోక తప్పడంలేదు. చెప్పాలంటే వెంగళరెడ్డి ఓ విధమైన డోలాయమాన స్థితిలో సతమతమవుతూనే ఉన్నాడు.
‘‘చౌదరి అన్నయ్యకు పురమాయించారట గదా! మసూరి బియ్యం బస్తా పంపించాడు. డబ్బులు ఇవ్వబోయాను. మేం చూసుకుంటాంలే అమ్మా! అన్నాడు’’.

‘‘పోనీ ఖరీదయినా చెప్పాడా!’’
‘‘సర్లే’’ వాడలానే అంటాడు. అయినా ఇంట్లో ఉండేది ఇద్దరం. ఇక్కడ నిత్యాన్నదానాలేమీ చేయడం లేదు కదా!? అయినా మనకు ఎన్ని బస్తాలు అవసరమవుతాయట!’’
‘‘ఈ చేతులు ఎన్నిసార్లు దానాలు చేసి ఉంటాయట! మళ్ళీకాలం కలిసి రావాలేగాని. అయి నా మనం ఎవరి దగ్గరో బియ్యం కొనుగోలు చేయడమేమిటండీ’’ భర్త మనసెరిగిన వాసవి వాస్తవాలను గుర్తుకు తెచ్చుకుంటూనే ఉంది. తెచ్చిన వేడి వేడి సేమ్యా ఉప్మా పొగలు గ్రక్కుతోంది. అలా టేబులు మీద పెట్టేసి కదిలిపోయింది.

వెంగళరెడ్డికి ఆ సమయంలో కొంచెం ఆకలిగానే అన్పిస్తోంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు వయసుతోబాటు ఆకలికూడ పెరగడం మొదలయింది. కానీ మొతాదు ఎక్కువయిదంటే అరగని పరిస్థితిని గ్రహించుకుంటూనే ఉన్నాడు. భర్త విషయాలు క్షుణ్ణంగా తెలిసిన ఆమె టైముకి కాసిం త ఉడకేసి పెడుతోంది. ‘‘చెప్ప డం మరిచాను. లోహియా మిమ్మల్ని అడిగాడట?’’
‘‘ఏమిటిట!’’ ‘‘అంటే ఏమి చెబుతాను. అయినా చౌదరి అన్న మాటలు మీకు తప్ప నాకు పూర్తిగా అర్థంకావు లెండి’’. ‘‘సోని శ్రీకరం ఏమైనా ఫోన్‌చేశాడా?’’ ‘‘చేస్తే చెప్ప నా! అయినా వాడి కన్నా కోడలే నయం. అప్పుడప్పుడు ఫోన్‌ చేసి పిల్లల చేత మాట్లాడిస్తుం టుంది’’.
‘‘వ్యాపారాలంటూ ఎప్పుడు బిజీగా తిరిగేడివాడు… ఇంట్లో తినేసి కూర్చునేది అమె. అమెరికా నుండి ఫోన్‌ అంటే మాటలా! అయినా కొడుకు కోడలు ఇద్దరూ బకటి కాదంటావా!’’

వాసవి మాట్లాడలేదు.
‘‘సరే లోహియా ఏమంటాడట. శ్రీకరం విషయంలో ఏమైనా చెప్పాడా!!’’ పరికించి చూసుకున్నాడు. తన కళ్ళకు పచ్చకామెర్లు ఏమీ పట్టలేదు. నిజంగా లోకమంతా పచ్చదనాన పరిఢవిల్లుతూనే ఉంది. మట్టిలో పుట్టి మట్టిగా ఊపిరిగా చేసుకున్నతనను చుట్టూ వాతావరణం లాగే ఊహలు ఆలోచనలు పరిపక్వమై జీవనాడిగా నిలుసున్నాయి.
ఆ ఆత్మ సంతృప్తితోనే వెంగళరెడ్డి ఇన్నాళ్ళూ జీవితాన్ని నెట్టుకురాగలుగుతున్నాడు. ఆత్మవలోకన ఓ ఉద్దిగ్నత తాలూకు ఆతృప్తఛాయ తనను ఆక్రమించడంతో లిప్తకాలం పాటు అలా ఉండిపోయాడు.
ఆక్రమన గాతం తాలూకు మరుపురాని బలమైన సన్నివేశాలు ఆలోచనలు మనసుకు ముసిరేస్తున్నాయి.
తాను పుట్టి పెరిగిన కారంచేడు ప్రాంతం మె రిసే బంగారమై మురిపిస్తున్నట్లుంది. ఆత్మీయ త పంచి ఇచ్చిన మనుషులున్న తరాన్ని తల్చుకుంటే ఆయనగారి కడుపు నిండిపోతోంది. తనకున్న పది ఎకరాల సుక్షేత్రమైన మాగాణి పొలంతో బాటు ఎప్పుడూ మరో పదిహేను ఇరవై ఎకరాలు బయట కామందుల నుండి కౌలుకు తీసుకొని సాగుచేసేవాడు.

ఇతరులకన్నా నాలుగు బస్తాల ధాన్యం ఎక్కు వ మక్తాగా చెల్లించే వెంగళరెడ్డికి తమ పొలా న్ని ఒప్పగించడానికి అందరూ మొగ్గు చూపేవారు. శాస్ర్తీయమైన వ్యవసాయ పద్దతులలో నేలను దుక్కిదున్ని విత్తుల్ని విత్తిన తర్వాత ఏపుగా పెరిగి కొతకొచ్చిన వరిపంట కంకులిని చూస్తుంటే వెంగళరెడ్డి మనసు ఆనందంతో ముప్పిరిగినేది.
వాసవి కూడా భర్తకు చేదోడువాదోడుగా నిలిచేది. చెమటోడ్చి కష్టపడి ఏటా మూడేసి పంటల్ని పండించే వెంగళరెడ్డి ఆ ప్రాంతంలో ఆదర్శరైతుగా నిలిచేవాడు.
‘‘చల్లని రామయ్యవయ్యా నువ్వు!’’ వరివంగడాలను పురులతో నింపిన తర్వాత కూలి జనాలకు ఏటా కొత్త బట్టల్ని పంచుతూంటే నే మందు మంచితనాన్ని చూసి మురిసిపోయేవారు. ఎప్పుడు శ్రమశక్తిని నమ్ముకొని వాళ్ళతలలో నాలుకలా ఉండే ఆయన ఎవరికి ఎప్పుడు ఏమి అవసరం వచ్చినా నేనున్నానంటూ ముందుండేవాడు.

ఒకసారి బుడ్డయ్య చౌదరికి నిస్త్రాణి చేయడంతో సృ్పహతప్పి పడిపోయాడు. పట్నం తీసుకెళ్ళాల్సి వచ్చింది. రక్తం తక్కువగా ఉండటంతో మరింత రక్తాన్ని ఎక్కించాల్సిన అవసరం ఉందన్నారు. తనరక్తం గ్రూపు సరిపోవడంతో మారు ఆలోచన లేకుండా రక్తాన్ని ఇచ్చి కాపాడాడు.
ఆనాటి నుండి వెంగళరెడ్డి బుడ్డయ్య చౌదరిల మధ్య స్నేహభావల మరింత విస్తృతమవసాగింది. చౌదరి కొడుకు లోహియాను స్వంత కొడుకుకన్నా ఎక్కువడా చూసుకోనేవాడు. అతగాడు కూడా ఆ అభిమానాన్ని ఎప్పుడూ కాలరాచలేదు. పెద్దయ్య పట్ల విధేయతగానే ఉంటున్నాడు.

కారంచేడు వారందరికీ ఓ మంచి నమ్మకముండేది. వెంగళరెడ్డి చేతులమీదుగా పొలానికి మంచి చేయిస్తే ఆయన హస్తవాసితో విత్తిన మొలకలు పుట్టెడవుతాయని అనుకొనేవారు. అదే సాంప్రదాయం ఊరిలో ఎప్పటినుంచో కొనసాగుతూనే ఉంది. అది నిజం కూడాను. అందుకే ఉరంతా ఆయన హస్తవాసి ద్వారానే మంచి పనుల్ని ప్రారంభించేవారు.
కానీ ఇప్పడు పరిస్థితి మారిపోయింది. గతానికి అంతా భిన్నంగా కన్పిస్తోంది. కొడుకు నిర్వాకం వల్ల తనకున్న పది ఎకరాల ఆిస్తి ఒక్కసారిగి హారతి కర్పూరంలా కరిగిపోయింది. కాంట్రాక్టు, వ్యాపారాలంటూ శ్రీకరరెడ్డి దొరికిన చోటల్లా ఎడాపెడా అప్పులు చేసి పడేశాడు. విషయం తెలిసిన వెంగళరెడ్డి కొడుకుని ఎంతగానో వారించాడు. ఇంట్లో విపత్కర పరిస్థితులు నెలకొనసాగాయి. చివరికి పరిస్థితి తమ చేయి దాటిపోయింది.

పూలు పూయించిన ఊరిలో కట్టెలు అమ్ముకొనే దుస్థితి దాపురించేసింది. క్రమంగా అప్పులోళ్ళ అధిపత్యం ఎక్కువయిపోసాగింది. ఒక్కొక్కరుగా, మూకుమ్మడిగా ఇంటి మీదకు దండయాత్రకు రాసాగారు. ఇన్నాళ్ళుగా ఊరిలో ప్రోది చేసుకోగల్గిన పరువు మర్యాదలు ఒక్కొక్కటిగా మంట కలిసిపోసాగాయి. శ్రీకరరెడ్డి పట్నంలో చేసిన అప్పుల పుణ్యమా అంటూ ఉన్న పొలాన్ని నిమిషాల మీద అమ్మిపడేయాల్సిన దుస్థితి వచ్చేసింది.
ఇన్ని సంవత్సరాలుగా తనను తనకుంటుం బాన్ని అక్కున చేర్చుకన్న పుడమితల్లిని అయి న కాడికి అమ్మి పడేసిన తప్పింది కాదు. అవమాన భారాన్ని తట్టుకోలేక వేరే ఊరికి తరలిపోవడానికి వెంగళరెడ్డి సిద్దమయిపోయాడు.
‘‘నువు అంతగా క్రుంగిపోవాల్సిన విషయం దీంట్లో ఏముంది చెప్పు! మీ వాడేమీ అతిపోకడలకు పోయి నిన్ను మంచేయలేదు. శ్రీకరం దక్షత కల్గిన కుర్రాడు. ఏవో ధైర్యం చేసిపెట్టుబడులు పెడితేనే కదా పైకొచ్చేది. టైము కలిసిరాక దెబ్బ తిన్నాడంతే!’’

‘‘……………….’’
‘‘వ్యాపారమనేది ఓ రంగులరాట్నమయ్యా! కృష్ణమ్మ పొంగి పోయినప్పుడు కోతకొచ్చిన నీవరి పంట ఎన్ని సార్లు మునిగిపోలేదు చెప్పు. జీవితంలో పడిలేచిన వాళ్లని ఎంతోమందిని చూసినవాడివి. ఇక్కడ ఊరంటా నీకు అండగా ఉంటోంది. ఊరు వదిలేసి మరో చోటికి తరలిపోవడం మాకు ఏ మాత్రం అంగీకారం కాదు’’ బుడ్డయ్య చౌదరి గట్టిగా నూరిపోశాడు.
చౌదరి తనకు బాల్య స్నేహితుడు. ఒక మం చం మీద పడుకొని ఒక కంచంలో తినకపోయినా స్నేహాన్ని ఎల్లవేళలా ప్రోదిచేసుకొనే మనిషతను. అతగాడి మాటలు వెంగళరెడ్డిని ఎంతగానో సేదదీర్చసాగాయి.
భార్యతో సంప్రదించాడు. ‘‘అన్నయ్య మాట అంటే చెప్పేదేముంది. చద్ది అన్నం మూట అ యితేను. వాస్తవానికి అమ్మేసినా ఆ పది ఎకరాల పొలాన్ని తిరిగి మీరే కౌలుకు తీసుకుంటే సరిపోతుంది కదండీ!’’ ఆలోచిస్తూంటే ఆమె మాటలు సహేతుకంగానే తోచాయి.
వాసవి, బడ్డుయ్య, లోహియా అందరూ తన కు ధైర్యం చెబుతూనే ఉన్నారు. కానీ శ్రీకర్‌ నిర్వాకం తనను సూదిలా గుచ్చుతూ క్రుంగదీస్తూనే ఉంది. కాలంలో మార్పో లేక కలిసొచ్చిన అదృష్టమోగాని వాడు ఎక్కడా లేని వ్యాపారాలు చేసి బాగా దెబ్బ తినిపోయినా శ్రీవదనతో పెళ్ళి అయిన తర్వాత దశ ఒక్కసారిగా తిరిగిపోయింది.

ఆ అమ్మాయి తండ్రి ప్రొద్దుటూరులో పెద్ద ఇండస్ట్రియలిస్ట్‌. వెంగళరెడ్డి ఆర్థికస్థితిగతులను బేరీజు వేసుకోకుండా కేవలం కుర్రాడి తెలివితేటలు మీద నమ్మకంతో శ్రీవదనను ఇచ్చి పెళ్ళిచేసి శ్రీకరాన్ని అల్లుడుగా తెచ్చుకున్నాడు. అమెను మనువాడిన మరుక్షణమే ఊహించని విధంగా దశ తిరిగిపోయింది. ఇంకా చెప్పాలంటే శ్రీకర్‌కి ఇప్పుడు పట్టిం దల్లా బంగారమే! క్రమంగా మావగారి సలహాలతో తన బిజినెస్‌ నెట్‌వర్క్‌ని విదేశాలకు కూ డా విస్తరిస్తున్నాడు. అమెరికాలో స్థిరనివాసం ఏర్పరచుకొని అక్కడికంపెనీలకు కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నాడు. క్రమేణా హైదరాబాద్‌లో లోకల్‌ ఆఫీసు ఒకటి ప్రారంభించి దాని నిర్వాహణ బాధ్యతల్ని లోహియాకు అప్పగించాడు.

‘‘డాడీ! చూశారా పొరబాటులనుండే మనిషి పాఠాలు నేర్చుకోగల్గుతాడు. అమెరికా వచ్చిన తర్వాత ఇక్కడ అవుట్‌సోర్సింగ్‌ కన్సల్టెన్సీ బాగా వర్క్‌వుట్‌ అవుతోంది. ఇక్కడి వారికి నేను ఎంత అంటే అంత’’ అని గర్వంగా చెప్పుకోగల్గుతున్నాను. ‘‘ఆనాడు నా కారణంగా తెగ అమ్మ వలసి వచ్చిన ఆస్తుల్ని మరలా సమకూర్చుకోవాలనే ఆలోచనలో ఉన్నాను. మన పొలాలు తిరిగా అక్కడ వారితో సంప్రదించి ఎంత రేటు అయినా చెల్లించే యోచన ఉంది నాకు. ఎటొచ్చీ అక్కడి వారితో సంప్రదించి ఎంత బేరం కుదర్చ వలసిన బాధ్యత మీది’’.
ముఖ్యంగా అమ్మకళ్ళలోని ఆ ఆనందాన్ని తిరిగి చూడాలి నేను. ఈ విషయమై శ్రీవదన ప్రోత్సాహం కూడా ఎక్కువగా ఉందినాకు.

‘‘……………’’
‘‘రేటు లక్షకు పదిలక్షలయినా సరే సిద్దపడుతున్నాను’’.
‘‘………….’’
‘‘మరో మాట ఇక్కడ అమెరికాలో ఇక సంస్థ నాకు సమగ్ర కార్పొరేట్‌ వ్యవసాయ డవలప్‌ మెంట్‌ అనే పథకాన్ని మన దేశంలో కూడా విస్తరించడానికి మక్కువ చూపుతున్నారు. ఒక యాభై అరవై ఎకరాల నీటిసాగు ఆయకట్టుని దత్తత తీసుకొని సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తారు. తద్వారా దిగుబడులు ఎక్కువగా సాధించే
అవకాశం ఉంది. యువతకు ఉద్యోగ అవకాశాలు ‚ూడ ఉన్నతంగా లభిస్తాయి.
నా రికమెండేషన్‌తో మన ఊరిలో దానిని అమలు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. దానికి ముందు వారు ఇచ్చిన ఖరీదుకు పొలాలను మా కంపెనీకి రిజిష్టర్‌ చేయాల్సి ఉం టుంది. రేటు కూడా మీరెవరూ ఊహించనంతగా ఇప్పించే ఏర్పాటు చేస్తున్నాను. మీ మంచితనాన్ని ఉపయోగించి మన ఊరి వారని ఒప్పించి భూముల్ని అమ్మకానికి పెట్టే ప్రయత్నయు చేయండి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్‌ వలన మన ప్రాంతం యొక్క స్వరూపమే మారిపోతుంది’’.

మొదట్లో వెంగళరెడ్డికి కొడుకు ప్రతిపాదన లు నమ్మశక్యంగా అన్పించలేదు. చాలాకా లం ఆలోచించి చూశాడు. కానీ అడ్వాన్సుగా ఎకరానికి పదేసి లక్షల రూపాయలు పంపేసరికి అతగాడి ప్రతిపాదన మీద గురి ఏర్పడుతోంది. శ్రీకర్‌ ప్రయోజకత్వానికి ఇప్పుడు ఊరు ఊరంతా ఉబ్బితబ్బిబ్బయి పోతోంది.
‘‘వాడిని ఆనాడు అందరూ ముందు వెనకా చూడకుండా ఆడిపోసుకున్నాం. ఇప్పడు చూడండి. అమెరికా విమానం ఎక్కేశాడో లేదో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోతున్నాడు’’ తల్లి కోణంలో కొడుకు మీద తన వాత్సాల్యాన్ని ప్రకటిస్తూనే ఉంది ఆవిడ. చెప్పాలంటే శ్రీకరాన్ని చూసి వాసవి
ఎంతగానో పొంగిపోతోంది.

‘‘నాకు ఇప్పటికీ కలగా ఉంది వాసవీ, కానీ ప్రొద్దుటూరు నుండి వియ్యంకుడు గారు ఇచ్చిన భరోసాతో గట్టి నమ్మకం ఏర్పడుతోంది ఇప్పుడు’’. వెంగళరెడ్డి ఆనందానికి పగ్గాలు కన్పించడంలేదు. ఊరిలో తన పరపతి పూర్వ స్థితిని మించి అమాంతం ఎదిగిపోతోంది.
వెంగళయ్య గారి అబ్బాయి ఎకరాకి ఏభై లక్షలు వెచ్చించి కొనడానికి సిద్ధమతున్నాడు. ఫారిన్‌ మనీ మరి! ఊరికి ఉన్నట్టుండి
డబ్బు కళ వచ్చేసింది. నామమాత్రపు
మనుషులు కాస్తా లక్షాధికారులుగా
ఎదిగిపోతున్నారు.

‘‘నీ కొడుకును చూసి ఊరు మాత్రమే కాదు రాష్ట్రం యావత్తు గర్వపడుతోంది’’ ఊరి
మాట విన్న వెంగళరెడ్డి ఒంటి మీద బట్ట
నిలవడం లేదు. తమ పొలాన్ని తిరిగి రాయించుకోవాలని ఎంతగానో ఉబలాట
పడుతున్నాడు. ముందర ఆలోచించిన
వారందరూ డబ్బు ఆశను చూసి
సుముఖత చూపిస్తున్నారు.

వెంగళరెడ్డికి చెరిగిపోయిన ఓ మధుర స్వప్నం తిరిగి సాకారమవుతున్నట్లుంది. కుంగదీశాడను కున్న కొడుకు ఇంత ప్రయోజకుడవుతాడని ఊహించలేదు. కార్పొరేట్‌ సమగ్ర వ్యవసాయ పథకం వలన గ్రామానికి సమకూరే ప్రయోజనాలు గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేయబడుతున్నాయి.
ఎందుకోగాని బుడ్డయ్య చౌదరి ఈ విషయంలో ముందునుండి కొంత విముఖత తెలియజేస్తూనే ఉన్నాడు.
‘‘ఎంత నీ కొడుకు అయినా పూర్తిగా విషయ పరిజ్ఞానం లేకుండ డబ్బు ఎరజూపి ఊరి జనాల దగ్గర పచ్చని పంట పొలం తాలూకు ఎగ్రిమెంట్లు రాయించుకోవడమేనా!’’
ఆయనగారి మాటలు వెంగళరెడ్డికి కొంత ఇబ్బందిని కల్గిస్తున్నాయి. దానితో ఇప్పుడు కొంత అసహనానికి లోనవుతున్నాడు కూడాను.

‘‘కార్పొరేట్‌ స్థాయిలో వ్యవసాయభివృద్ధి తాలూకూ అవకాశం మన ప్రాంతానికి దక్కడం నిజంగా అదృష్టంగాక ఇంకేమిటుంటుంది చెప్పు. తప్పక ఇప్పుడు మన వారి జీవన ప్రమాణాలు పెరిగిపోగలవన్న నమ్మకముంది నాకు చౌదరీ!’’
‘‘స్నేహితుని మాటలు చౌదరిని ఏ మాత్రం ప్రభావితం చేయడం లేదు. ముఖ్యంగా తమ పొలం తన చేతుల్లోకి వస్తుందన్న ఆనందం ఆయనగారికి కొండంత ఆత్మ స్థైరాన్ని ఆపాదించి పెడుతోంది.
లోహియా కూడా అంకుల్‌ని కంగారు పడక నిర్ణయం తీసుకోమని ఈ మధ్య నాలుగైదు సార్లు ఫోన్లు చేసి చెప్పాడు.

వెంగళరెడ్డి ఓ పెద్ద పిడుగు వచ్చి మీదపడినట్లు భావిస్తున్నాడు. లోహియా చెప్పిన వాస్తవాలు అవగతమవుతున్నాయి. తల్చుకుంటే వెన్నులో వణకు ప్రారంభమవుతోంది. కార్పొరేట్‌ వ్యవసాయం అంటూ చేస్తున్న ప్రచారం వెనుక దాగి ఉన్న భయంకరమైర కుట్ర వెలుగుచూస్తోంది.
నిజమా! కొడుకు మొసపూరితమైన ధోరణి ఏ మాత్రం ఆమోదయోగ్యంగా అన్పించడం లేదు. విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు.
‘‘దానిదేముంది బావగారూ! కార్పొరేట్‌ వ్యవసాయక్షేత్రం అయితే ఏమిటి… కార్పొరేట్‌ కార్మిక క్షేత్రం అయితే ఏమిటి చెప్పండి. మన వ్యాపారాలు మనవి మీ పిచ్చిగాని స్వంత లాభాలు చూసుకోని పిచ్చోడు ఈ రోజుల్లో ఎవరున్నారు చెప్పండి’’.

‘‘వియ్యంకుడి ఉద్దేశాలలో దాగి ఉన్న ఓ అత్యంత భయానకమైన నైజాన్ని చూడగల్గుతున్నాడిప్పుడు. అది చాలా అసంబద్దంగా జుగుప్సగా అన్పిస్తోంది.
నెమ్మదిగా కాసింత స్థిమితపడి బాధ్యత కల్గిన పౌరుడినా ఆలోచించడం మొదలు పెట్టాడు వెంగళరెడ్డి.
అంటే వ్యవసాయం పేరుతో నేలతల్లితో తరతరాలుగా జీవనం సాగిస్తూన్న చిన్నకారు రై తులను మభ్యపెట్టి నాలుగు డబ్బులు ఎక్కువ పడేసి వాటిని స్వాధీనం చేసుకున్న తర్వాత ఇక్కడ చాల భయంకరమైన విషపదార్థాలను తయారు చేయగల్గిన పెద్ద కెమికల్‌ ఫ్యాక్టరీని తీసుకురావాలన్నది వారి ఎత్తుగడ అట.
ఆ ప్రతిపాదన తీసుకొచ్చింది కూడా తన స్వంత కొడుకే నట! లోహియా నిజాయితీగా చెబుతున్న మాటల ప్రకారం అత్యంత ప్రమాదకరమైన రసాయనాలను ఉత్పత్తి చేసే ఆ కెమికల్‌ ఫ్యాక్టరీ వలన కేవలం కారం చేడుకే పరిమితం కాకుండా చుట్టు ప్రక్కల చాలా ఊర్లను కూడా పర్వావరణం తాలూకు పెనుముప్పు పొంచి ఉంటుందట! దానివలన వాతావరణ సమతుల్యతతో అలరారే ప్రకృతి, పచ్చని పొలాల సుందర దృశ్యం అలా చెదిరి పోతున్నట్లుగానే అన్పిస్తోంది. చెప్పాలంటే తమ ఊరు కూడా పూర్తిగా అదృశ్యమైపోయి ఆనవాళ్ళు కూడా లేకుండా పోయే అవకాశం లేకపోలేదు.

అలా కుర్చీలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూన్నా వెంగళరెడ్డి ఉడుకు మోత్తనం ఎగ దన్నుకొస్తోంది. కొడుకు ప్రయోజకత్వం మాట దుర్నీతి ఆవేదనను మిగులుస్తోంది. మొదట్లో తమ పొలం కోసం ఆశపడ్డది
వాస్తవమే! తిరిగి కొనుక్కొగల్గుతున్నందుకు ఇంటిల్లిపాదీ ఆనందించింది నిజమే.
కానీ అది తిరిగి తమ చేతుల్లోకి రాగానే మీరు భూమిగా రూపాంతరం చెందగలదన్న వాస్తవం సమాజం పట్ల బాద్యత కల్గిన వ్యక్తిగా తాను జీర్ణించుకోలేక పోతున్నాడిప్పుడు.

తనదనుకున్న పుడమితల్లి మరొకరి ఆధీనంలోనయినా పదికాలాల పాటు
పచ్చగా పరిఢవిల్ల గల్గితే ఆ ఆత్మ సంతృప్తి చాలు తన జీవితానికి తిరిగి రాయించు
కోవాలన్న ఆలోచన కన్నా ఆ హరిత సౌందర్యం అలా మన గలగాలనన ఊహ
ఆ పెద్ద మనిషికి కొండంత ఆనందాన్ని పంచి ఇవ్వగల్గుతోంది.
పారిశ్రామికీకరణ పేరిట దాని రూపురేఖలు సమూలంగా మారిపోవడం ముమ్మాటికీ క్షమించరాని విషయంగానే నిలుస్తుంది.

క్రమేణా కొడుకు నిర్వాకం మనలని కూడా తీవ్రంగా కలచివేస్తోంది. ఎగ్రిమెంట్లుకు సిద్దం జేసిన కాగితాలను చూసుకున్నాడు. స్వాధీనం చేయండంటూ ఊరి వారందరికీ నచ్చజెప్పి ప్రోత్సహించిన నోటితోనే ఇప్పడు అమ్మడానికి ఏ మాత్రం వీలు లేదన్న మాట విన్పిస్తోంది.
పచ్చని జీవితాలే సార్వజనీన మంటూన్న వెంగళరెడ్డి లోని నైతిక స్పృహ ఆయన చించిపారేస్తున్న ఎగ్రిమెంట్‌ కాగితాలతో మరోసారి ప్రస్ఫుటంగా అగుపిస్తోంది.

– వడలి రాధాకృష్ణ
ఫోన్‌: 9985336444

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top