You Are Here: Home » చిన్నారి » అక్వేరియం అనే పదం ఉనికిలోకి ఎప్పుడు వచ్చింది?

అక్వేరియం అనే పదం ఉనికిలోకి ఎప్పుడు వచ్చింది?

అక్వేరియం అనే పదం మొట్టమొదటగా 1850వ సంవత్సరంలో లండన్‌కు చెందిన ఫిలిప్ గోస్ అనే ప్రకృతి శాస్త్రవేత్త ఉపయోగించాడు. జలచరాలపై పరిశోధనల కోసం పెద్దపెద్ద గాజు గదులను తయారుచేయించిన ఆయన వాటికి అక్వేరియం అని నామకరణం చేశారు.

ఆ తరువాత 1853లో లండన్ ప్రజలు చూసేందుకు వీలుగా పెద్ద అక్వేరియమ్‌ను ఏర్పాటు చేశారు. సంపన్నదేశం అయిన అమెరికాలో అత్యధికంగా పెంచుకునే పెంపుడు జంతువుల్లో చేపలది రెండో స్థానం. అక్కడ సుమారు 75 లక్షల ఇళ్లలో అక్వేరియమ్‌లు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఈ అక్వేరియాలలో రకరకాల, రంగురంగుల చేపలు, వివిధ సైజుల్లో ఉండటాన్ని మనం చూసే ఉంటాం.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top