You Are Here: Home » ఇతర » అక్రమ లేఅవుట్లు..అరికట్టేదెలా?

అక్రమ లేఅవుట్లు..అరికట్టేదెలా?

రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఒక్క డీటీసీపీ పరిధిలోనే 65 వేల ఎక రాల్లో అనధికార లేఅవుట్లు ఉన్నాయని డీటీసీపీ నిర్వహిం చిన సర్వేలో తేలింది. మరి కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థలు, మున్సిపాల్టీలు వంటివి లెక్కిస్తే… ఎంతలేదన్నా లక్ష ఎకరాల్లో అక్రమ లేఅవుట్లు ఉంటాయని తెలుస్తోంది. అసలు ఇవి పుట్టుకురావ డానికి కారణాలేమిటి? ఏయే ప్రాంతాల్లో అనధికార లేఅవుట్లు ఉన్నాయి?

Layoawలేఅవుట్లు వేసే వారు నిబంధనల్ని పాటిస్తే… రోడ్డు, పార్కులు, ఖాళీ స్థలాల్ని ఎక్కువగా వదలాల్పి ఉంటుంది. దీంతో తక్కువ సంఖ్యలో ఫ్లాట్లు వస్తాయి. ప్రభుత్వ శాఖల నుంచి అనేక అనుమంతులను తీసుకోవడంతో బాటు లక్షల రూపాయలు ఫీజుల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం వేస్తే… తమకేం మిగలదని భావించిన రియల్టర్లు… పంచాయతీ అనుమతితో గత కొన్నేళ్ల నుంచి అక్రమ లేఅవుట్లను అభివృద్ధి చేస్తున్నారు. చూసీ చూడనట్లు వ్యవహరించే ప్రభుత్వ అధికారులు…

రియల్టర్లు ఇచ్చే అమ్యామ్యలకు అలవాటు పడి వీటిని పెద్దగా పట్టించు కోలేదు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది అక్రమ లేఅవుట్లు వెలిశాయి. ల్యాండ్‌ కన్వర్షన్‌ సర్టిఫికెట్లను తీసుకోకుండా ఉండటం కోసమే రియల్టర్లు వీటిని వేసినట్లు తేలింది. అయితే కొంతమంది రియల్టర్లు నిబంధనల ప్రకారం వేయాలని ఉన్నా… ప్రభుత్వపరమైన అనుమతుల్లో విపరీతమైన జాప్యం జరుగుతుందనే ఉద్దేశంతో పంచాయతీ అనుమతిని తీసుకొని లేఅవుట్లు వేసినట్లు తెలిసింది.

ఎక్కడెక్కడ?
డీటీసీపీ లెక్కల ప్రకారం… రాజమండ్రి రీజియన్లో సుమారు 1800 అక్రమ లేఅవుట్లు ఉన్నాయి. కృష్ణ, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి లోని డీటీసీపీ ప్రాంతాల్లో దాదాపు 4,656 ఎకరాల్లో అక్రమార్కులు లేఅవుట్లు వేశారు. అదే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు గల గుంటూరు రీజియన్లో 1,025 అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు గుర్తిం చారు. దాదాపు 2,700 ఎకరాల్లో వీటిని వేశారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే… పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ సంఖ్యలో అనధికార లేఅవుట్లు ఉన్నాయి. సుమారు 1,012 అనధికార లేఅవుట్లు వేశారు. కరీంనగర్‌, కృష్ణ, మహబూబ్‌నగర్‌ వంటివి ఆ తర్తా స్థానాల్ని ఆక్రమించాయి.

హెచ్‌ఎండీఏ ప్రాంతంలో…
హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ వంటి ప్రాంతాల్ని కలిపే హెచ్‌ఎండిఏ ప్రాంతంలో… సుమారు లక్ష ఎకరాల్లో అక్రమ లేఅవుట్లు ఉన్నాయని సమాచారం. వీటిలో పంచాయతీ అనుమతితో తీసుకున్నవే అధికంగా ఉండటం గమనార్హం. ముఖ్యంగా మహేశ్వరం, జేపీ దర్గా, శంషాబాద్‌, కొత్తూరు, శంకర్‌పల్లి, చేవేళ్ల, కీసర, ఘట్కేసర్‌, శామీర్‌పేట్‌, చౌటుప్పల్‌, భువనగిరి వంటి ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లు ఎక్కువగా ఉన్నాయి.

నిరోధించడమెలా?
Layoaఎలాంటి స్థలమైనా రిజిస్ట్రేషన్‌ చేయడానికి రిజిస్ట్రేషన్‌ శాఖ సర్వదా సిద్ధంగా ఉంటుంది. లేఅవుల్‌ అక్రమమా, సక్రమమా అన్న అంశంతో సంబంధం లేకుండా… అసలు వీటి గురించి పట్టించుకోకుండా… ఉదాసీనంగా వీటిని రిజిస్ట్రేషన్‌ చేస్తారు. అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొనకుండా కొ2నుగోలుదారుల్లో అవగాహనను పెంపొందిచడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యల్ని తీసుకోవట్లేదు. వీటిని నిరోధించాలంటే… కేవలం సక్రమ లేఅవుట్లలో ప్లాట్లను రిజిస్టర్‌ చేసేలా రిజిస్ట్రేషన్‌ శాఖకు ఆదేశాలు జారీ చేయాలని… గత కొంతకాలం నుంచి ప్రభుత్వాన్ని డీటీసీపీ కోరుతోంది. కనీసం ఇప్పటికైనా అప్రమత్తంగా వ్యవహరించకపోతే…

రానున్న రోజుల్లో అక్రమ లేఅవుట్లు మరింత ప్రమాదకరంగా మారే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. లేఅవుట్‌ నిబంధనల్లో అక్రమ లేఅవుట్లను నిరోధించే విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు లేనందువల్ల… అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయని నిపుణులు అంటున్నారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top