You Are Here: Home » సఖి » అందం » అందం అందించే మినపప్పు ఫేషియల్‌!

అందం అందించే మినపప్పు ఫేషియల్‌!

అందం అందించే మినపప్పు ఫేషియల్‌!

అందం అందించే మినపప్పు ఫేషియల్‌!
మండే వేసవికాలంలో దుమ్ము, ధూళి చర్మాన్ని, శిరోజాలని ఎక్కువగా భాదిస్తుంది. ఈ చర్మం, శిరోజాల ప్రభావం కారణంగా ముఖంపైన మచ్చలు ఏర్పడతుంది. వీటితో పాటు చర్మం కాంతిహీనమై నిర్జీవంగా కనిపిస్తుంది. కోల్పోయిన అందాన్ని తిరిగి పొందేందుకు వంట ఇంట్లో ఉపయోగించే వస్తువులే చాలు అంటున్నారు సౌందర్య నిపుణులు. నిమ్మకాయి, పసుపు, మినపప్పు, పెసర పప్పు తదితర వస్తువులను ఉపయోగించి ముఖాన్ని, చర్మాన్ని అందంగా మార్చుకోవచ్చు.

మినపప్పు, పసుపు పేస్ట్‌ :
పూర్వ కాలం నుంచి నేటి వరకు సంప్రదాయబద్దంగా ఉపయోగించే వస్తువు మినపప్పు, పసుపు. ఇవి రెండు శరీర ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి అందాన్ని ఇచ్చేవి. ఒక పాత్రలో రెండు స్పూన్ల మినపప్పు పౌడర్‌లో చిటికెడు పసుపు, కాస్త నీటిని వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లైచేసిన అరగంట సేపు తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రపరచినట్లైతే చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

కళకళలాడేందుకు ఫేషియల్‌ :
అందాన్ని కాపాడే ముఖ్యమైన వస్తువు మినపప్పు. నిర్జీవంగా కనిపించే చర్మానికి యౌవ నాన్ని ఇచ్చేదే మినపప్పు. రెండు స్పూన్ల మినపప్పులో కాస్త నీళ్లు పోసి గట్టిగా కలుపు కోవాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రంచేస్తే ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది. అదేవిధంగా స్నానం చేసేటప్పుడు మినపప్పు చర్మానికి పూసి స్నానం చేస్తే చర్మం అందంగా యౌవనంగా కనిపిస్తుంది.

రోజ్‌ వాటర్‌, మినపప్పు :
రెండు స్పూన్ల మినపప్పు పౌడర్‌తో నాలుగు స్పూన్ల పాలు, రెండు స్పూన్ల రోజ్‌ వాటర్‌ కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లైచేసి పది నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రపరచాలి. ఇలా చేసినట్లైతే చర్మంలోని జిడ్డు తొలగి అందమైన, ఆకర్షణమైన ముఖం మీ సొంతం అవుతుంది.

మచ్చలు మాయం కావాలంటే
మినపప్పు 1 టీస్పూన్‌, మిరియాల గింజ ఒకటి తీసుకోని ఒక టీస్పూన్‌ పాలలో ఊరబెట్టాలి. దీనితో పాటు కాల్‌ టీస్పూన్‌ ముల్తాని మట్టిని చేర్చి కలపాలి. ఈ మిశ్రమాని ప్యాక్‌లా వేసుకొని ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రంచేయాలి. ఇలా చేస్తే మచ్చలు క్రమంగా మటుమాయం అయిపోతాయి.

జిడ్డు చర్మానికి…
జిడ్డు చర్మం ఉన్నవారు మినపప్పుతో పాటు పెరుగు కలిపిన మిశ్రమాన్ని ఫేషియల్‌లా వేసుకుంటే జిడ్డు తొలగి ముఖం అందంగా మారిపోతుంది. ఒక పాత్ర లో మినపప్పు తీసుకొని అందులో కాస్త పెరుగు, నిమ్మ రసం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచాలి. ఇలా చేస్తే జిడ్డు తగ్గి ముఖం అందంగా మారుతుంది.

డల్‌గా ఉన్న ముఖం కోసం
తోలుతోపాటు ఉన్న మినపప్పు అరకిలో, తులసి ఆకులు 50 గ్రాములు, వేపాకులు 5 గ్రాములు తీసుకొని వీటిని నీడలో ఎండబెట్టాలి. అనంతరం ఈ మూడింటిని బాగా గ్రైండ్‌ చేయాలి. ఒక పాత్రలో ఈ మిశ్రమాన్ని రెండు స్పూన్లు తీసుకొని అందులో రెండు చుక్కలు నిమ్మరసం చేర్చి ముఖానికి ప్యాక్‌లా వేసుకొని ఐదు నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇది వారానికి ఒక్కసారి వేస్తే చాలు కళకళలాడుతూ మీ ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top