You Are Here: Home » భవిత » వ్యాపారం » అంతా కోరుకునేది టాబ్లెట్‌!

అంతా కోరుకునేది టాబ్లెట్‌!

అంతా కోరుకునేది టాబ్లెట్‌!

 

ఇప్పుడు అందరి నోటా వెలువడే ఒేక మాట టాబ్లెట్‌. స్మార్ట్‌ ఫోన్ల తరువాత అత్యధికంగా డిమాండ్గ ఏర్పడుతోంది వీటిేక. రూ. 3,000 మెుదలుకొని ఆ పై ధరల్లో ఇవి లభిస్తున్నా రుు. చౌక ధర ఆకాష్‌ టాబ్లెట్‌లు మార్కెట్‌లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. 2012 జనవరిలో 14 రోజుల్లోనే 14 లక్షల టాబ్లెట్లకు ఆర్డర్లు బుక్‌ అయ్యారుు.

lapటాబ్లెట్‌పై మోజు ఎంతగా పెరిగిందంటే, అదెందుకు ఉపయోగపడుతుందో, తమకు ఏవిధంగా ఉపయోగంగా ఉంటుందో తెలుసుకోకుండానే వాటిని జనం వేలంవెర్రిగా కొనేస్తున్నారు. 2011లోనే భారత్‌లో లాప్‌టాప్‌లు, నెట్‌బుక్‌లు, స్మార్ట్‌ఫోన్ల కంటే కూడా టాబ్లెట్‌ల గురించి గూగుల్‌ అన్వేషించే వారి సంఖ్య పెరిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది కనీసం రెండు లక్షల టాబ్లెట్లు దేశంలో విక్రయమయ్యాయి. 2012లో ఇది రెట్టింపు కాగలదని భావిస్తున్నారు.

ఏయే రకాల టాబ్లెట్స్‌
చైనా తయారీ: మిబ్‌, ఐరోబోట్‌ లాంటి సంస్థలు వీటిని తయారు చేస్తున్నాయి. చౌక ఉపకరణాలను కొనుగోలు చేయదల్చిన వారు, తరచూ ఉపకరణాలను మార్చే వారు వీటిని కొంటుంటారు. సాధ్యమైనంత తక్కువ ధరకే వీటిని విక్రయించే వ్యూహాన్ని ఈ కంపెనీలు అనుసరిస్తున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకొని తమ సొంత బ్రాండ్‌ పై విక్రయించే సంస్థల నుంచి వీటికి గట్టిపోటీ ఎదురవుతోంది.

భారతీయ దిగుమతిదారులు:
imgఈ సంస్థలు ప్రత్యేకంగా తాము దేశంలో తయారుచేయకపోయినా, విదేశాల నుంచి దిగు మతి చేసుకొని తమ సొంత బ్రాండ్‌పై వీటిని విక్రయిస్తున్నాయి. చైనా ఉత్పాదనలతో పోలిస్తే వీటికి డిమాండ్‌ ఎక్కువగానే ఉంది. వాటికి గట్టిపోటీ ఇవ్వగలుగుతున్నాయి. జింక్‌, మిలాగ్రో లాంటి సంస్థలను ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఎంట్రీ లెవల్‌ కస్టమర్లు, విద్యార్థులు, సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారు వీటిని ఎక్కువగా కొంటున్నారు. తక్కువ ధరలు, పటిష్ఠమైన నెట్‌వర్క్‌తో చిన్న పట్టణాలపై కూడా దృష్టి సారించే వ్యూహాన్ని ఈ కంపెనీలు అనుసరిస్తున్నాయి.

బహుళజాతి సంస్థలు:
సామ్‌సంగ్‌, ఆపిల్‌, రిమ్‌ లాంటి సంస్థలు వీటిని తయారు చేస్తున్నాయి. ప్రొఫెషనల్స్‌ వీటిని కొంటున్నారు. వినూత్న ఫీచర్లకు ఇవి ప్రాధాన్యం ఇస్తుంటాయి. వీటి ధరలు అధికమే.
టాబ్లెట్‌తో ఏమేం చేయవచ్చు…ఇబుక్స్‌ చదువుకోవచ్చు. రకరకాల రికార్డులు నిర్వహించుకోవచ్చు. గేమ్స్‌ ఆడవచ్చు. వీడియోలు చూడవచ్చు. నావిగేషనల్‌ డివైజ్‌లుగా ఉపయోగించుకోవచ్చు. కార్లలో వీడియో స్క్రీన్‌లుగా వాడవచ్చు.

మార్కెట్‌ తీరుతెన్నులు
నేడు టాబ్లెట్‌ మార్కెట్‌లో 60 శాతాన్ని ఐపాడ్‌, సామ్‌సంగ్‌ గెలాక్సీ టాబ్‌లే పంచు కున్నాయి. లార్జ్‌స్క్రీన్‌, టచ్‌ ఇంటర్‌ఫేస్‌, ఆన్‌ ది గో కంప్యూటింగ్‌, హై క్వాలిటీ అప్లికేష న్స్‌ లాంటి వాటిని ట్యాబ్స్‌ అందించగలగాలి. అప్పుడే అవి మిలియన్ల మందికి ఉపయో గపడగలవు. అవన్నీ అందించాలంటే వాటి రేటు కూడా ఎక్కువే. అధునాతన సాంకేతిక నైపుణ్యం అందుబాటులోకి వస్తున్న కొద్దీ వీటి రేట్లు కూడా తగ్గే అవకాశం ఉంది.

ఇప్పటికీ ఐపాడ్‌దే హవా
img221టాబ్స్‌లో నేటికీ ఐపాడ్‌ హవానే కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా 2011 చివరి త్రైమాసి కంలో దీని మార్కెట్‌ షేర్‌ 58 శాతం అని అంచనా. భారత్‌లో మాత్రం ఇలాంటి పరిస్థితి లేదు. దీని ఆరంభ ధర రూ. 25,000 దాకా ఉండడమే ఇందుకు కారణం. స్మార్ట్‌ ఫోన్‌ కంటే మరింత మెరుగైన సేవలను ఇది ఎలా అందిస్తుందో కొనుగోలుదారులకు వివరించ గలిగితే ఈ ఉత్పాదన విజయం సాధించగలదని మార్కెట్‌ నిపుణులు అంటున్నారు.

రిమ్‌ (రీసెర్చ్‌ ఇన్‌ మోషన్‌) ప్లే బుక్‌ ధర రూ. 28,000 అని మొదట్లో వదంతులు వచ్చాయి. డిసెంబర్‌లో ఆ ధరను 50 శాతం పైగా తగ్గించారు. వారం రోజుల్లోనే 8,000కు పైగా ప్లేబుక్స్‌ విక్రయమయ్యాయి. టాబ్లెట్‌ విడిగా అందించే ఉపయోగాలు తక్కువే. 3జీ, ఉచిత వై-ఫీ స్పాట్స్‌, సంబంధిత లోకల్‌ అప్లికేషన్స్‌ లాంటివి ఉన్నప్పుడే ఇవి మార్కెట్‌లో మరింతగా విక్రయమయ్యే అవకాశం ఉంది.

ఎన్నెన్నోప్రశ్నలు
టాబ్లెట్‌కు డిమాండ్‌ ఎంతగా ఉన్నప్పటికీ దాన్ని పరిమితం చేసేలా పలు సవాళ్ళు కూడా ఎదురవుతున్నాయి. ఐపాడ్‌, సామ్‌సంగ్‌ గెలాక్సీ టాబ్‌ లాంటివి బాగా ఖరీదు. అవి మాస్‌ ప్రోడక్ట్స్‌ కాలేవు. లో ఎండ్‌ టాబ్లెట్స్‌ యూజర్‌కు అంతగా ఆహ్లాదకరమైన అనుభూతిని అందించలేవు. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ లేటెస్ట్‌ వెర్షన్స్‌ను ఉపయోగించుకోగల శక్తిసామర్థ్యాలు తక్కువే. రూ. 10,000 లోపు తక్కువ ధరకు టాబ్లెట్లను విక్రయించే సంస్థల విశ్వసనీయత తక్కువే. మధ్యతరహాస్థాయిలో వినూత్న ఫీచర్ల లభ్యత తక్కువే. ఇంటర్నెట్‌ కనెక్షన్‌ కోసం నెలకు కనీసం రూ. 1000 వెచ్చించాల్సి ఉగా…

కొత్తకొత్తగా…
హెచ్‌సీఎల్‌ ఇటీవల మి యుఐ, మై ఎడ్యు అనేవాటిని మార్కెట్‌లోకి ఆవిష్కరించింది. మైక్రోమ్యాక్స్‌ ఫన్‌బుక్‌ను విడుదల చేసింది. మార్కెట్లో ఇప్పుడు సుమారుగా 100 రకాల మోడల్స్‌ అందుబాటులో ఉన్నట్లు అంచనా.

భారతీయతయారీసంస్థలు
మైక్రోమ్యాక్స్‌, హెచ్‌సీఎల్‌ ఇన్ఫోసిస్టమ్స్‌ లాంటి సంస్థలు దేశీయంగా టాబ్లెట్స్‌ను రూపొం దిస్తున్నాయి. విలువకు పట్టం కట్టే నగర వినియోగదారులు, విద్యార్థులు, యువ వృత్తినిపుణులు వీటిని ఎక్కువగా కొంటున్నారు. మార్కెట్‌ క్రెడిబిలిటీ, తక్కువ ధర, కస్టమైజ్డ్‌ డిజైన్స్‌, అగ్రెసివ్‌ మార్కెటింగ్‌ లాంటి వ్యూహాలను ఇవి అనుసరిస్తున్నాయి. తక్కువ ధరకు అందించే బహుళజాతి సంస్థల నుంచి ఇవి గట్టిపోటీని ఎదుర్కొంటున్నాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top