You Are Here: Home » ఇతర » అంతర్జాలంలో సందర్శిద్దాం! వర్చువల్‌ మ్యూజియం

అంతర్జాలంలో సందర్శిద్దాం! వర్చువల్‌ మ్యూజియం

మ్యూజియం …ఈ పేరు చెప్పగానే మనలో చాలా మందికి గుర్తుకువచ్చేది సాలార్‌ జంగ్‌ మ్యూజియం. ఒేక వ్యక్తి సేకరించిన వస్తువులతో రూపుదిద్దుకున్న మ్యూజియంలలో ప్రపంచప్రఖ్యాతి చెందింది అది. నేడు ప్రపంచవ్యాప్తంగా వివిధ అంశాలపై ఎన్నో ప్రత్యేక మ్యూజి యంలు నెలకొన్నారుు. జీవితంలో పెరుగుతున్న వేగం నేపథ్యంలో ఎంతో మంది ఏ మ్యూజియంనూ చూడలేకపోతున్నారు. అలాంటి వారికి ఓ తరుణోపాయం… ఆన్‌లైన్‌లో మ్యూజియంలను వీక్షించడం. ఇంటర్నెట్‌కు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఆన్‌లైన్‌లోనూ ఎన్నో మ్యూజియంలు రూపుదిద్దుకుంటున్నారుు. వీటినే వర్చువల్‌ మ్యూజియంలుగా వ్యవహరిస్తున్నారు. భౌతిక రూపంలో ఉన్న మ్యూజియంలకు డిజిటల్‌ రూపం ఇచ్చేవి కొన్నరుుతే, ేకవలం డిజిటల్‌ రూపంలో మాత్రమే ఉండేవి మరికొన్ని. మ్యూజియంలపై ప్రజల్లో అవగాహన పెరగాలనే ఉద్దేశంతో ఏటా మే 18న మ్యూజియం డే నిర్వహిస్తున్నారు. ఆ నేపథ్యంలో వర్చువల్‌ మ్యూజియంలపై కలర్స్‌ ప్రత్యేక కథనం…..

వర్చువల్‌ మ్యూజియంనే ఆన్‌లెైన్‌ మ్యూజియం, ఎలక్ట్రానిక్‌ మ్యూజియం, హైపర్‌ మ్యూజియం, డిజిటల్‌ మ్యూజియం, సెైబర్‌ మ్యూజియం లేదా వెబ్‌ మ్యూజియంగా వ్యవహ రిస్తుంటారు.
ఎన్నో రకాలు
భౌతిక మ్యూజియంల మాదిరిగానే వివిధ ప్రత్యేక అంశాలపెై మ్యూజియంలు రూపొందించే అవకాశం వర్చువల్‌ మ్యూజి యంలకు ఉంది. మరో ముక్కలో చెప్పాలంటే, భౌతిక రూపం లోని మ్యూజియంలలో ప్రదర్శించలేని వాటిని ఎన్నింటినో ఈ వర్చువల్‌ మ్యూజియంలలో ప్రదర్శించే వీలుంది.

రెండు దశాబ్దాల క్రితం నుంచే
homeనిజానికి వర్చువల్‌ మ్యూజియంల భావనకు రెండు దశాబ్దాల క్రితం నాడే పునాది పడింది. అప్పుడు ఇంటర్నెట్‌కు సంబంధించి రకరకాల సమస్యలు ఉండేవి. వెబ్‌ పేజీలు ఎంతో సింపుల్‌గా ఉండేవి. ఇమేజ్‌లు, వీడియోలు లాంటి మల్టీమీడియా టెక్నాలజీ అంశాలు జోడించడం ఎంతో కష్టంగా ఉండేది. బ్యాండ్‌విడ్త్‌ సమస్య ఉండింది. మ్యూజియం ఆఫ్‌ కంప్యూటర్‌ ఆర్ట్‌ (ఎంఓసీఏ) 1993లో నెలకొంది. న్యూయార్క్‌ రాష్ట్రం విద్యా విభాగం కింద ఇది ఏర్పడింది. 2002లో దీనికి మ్యూజియం డొమైన్‌ మేనేజ్‌ మెంట్‌ అసోసియేషన్‌ హోదా లభించింది.

వెబ్‌మ్యూజియం పారిస్‌ 1994లో ఆన్‌లెైన్‌లోకి వచ్చింది. తొలితరం వర్చువల్‌ లేదా వెబ్‌ మ్యూజియంలలో ఇది కూడా ఒకటి. నికోలస్‌ పిచ్‌ దీన్ని క్రియేట్‌ చేశారు. ఇబిబ్‌లియో దీన్ని హోస్ట్‌ చేసింది. అదే సంవత్సరంలో ది లిన్‌ హిసిన్‌ హిసిన్‌ ఆర్ట్‌ మ్యూజియం కూడా అంతర్జాలంలో ఉనికి చాటుకుంది. ఆక్స్‌ఫర్డ్‌లోని ది మ్యూజియం ఆఫ్‌ ది హిస్టరీ ఆఫ్‌ సెైన్స్‌ 1683లో ప్రారంభమై 1995 ఆగస్టు 21న ఆన్‌లెైన్‌లోకి వచ్చింది. యూనివర్సిటీలో అప్పటికే ఉన్న శాస్తస్రాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో ఈ వెబ్‌సెైట్‌ రూపుదిద్దుకుంది.

Hom3ఎల్‌జుబుల్‌జానా: ఓపెన్‌ ఎయిర్‌ మ్యూజియం 1993లో నెలకొని 1996లో ఆన్‌లెైన్‌లోకి వచ్చింది. స్లోవేనియా లోని భారీ మ్యూజియం ఇది. ఆన్‌లెైన్‌ మ్యూజియంలో ఇంటరాక్టివ్‌ మ్యాప్స్‌ చూడవచ్చు. ఇంటరాక్టివ్‌ విర్చువల్‌ రియాలిటీ కూడా పొందు పరిచారు. వర్చువల్‌ మ్యూజియం ఆఫ్‌ కంప్యూటింగ్‌ 1994లో మొదలెైంది. ఇందులో ఎలక్ట్రానికి కలెక్షన్‌ లింక్స్‌, ఆన్‌లెైన్‌ రిసోర్సెస్‌ పొందుపరిచారు. కంప్యూటర్స్‌, కంప్యూటర్‌ సెైన్స్‌ చరిత్రను తెలుసుకునేందుకు చక్కటి వెబ్‌సెైట్‌.వర్చువల్‌ మ్యూజియం ఆఫ్‌ న్యూ ఫ్రాన్స్‌- 1997లో ఆన్‌లెైన్‌లోకి వచ్చింది. కెనడియన్‌ మ్యూజియం ఆఫ్‌ సివిలెైజేషన్‌ కార్పోరేషన్‌ దీన్ని నెలకొల్పింది . ది నేచురల్‌ హిస్టరీ మ్యూజియం ఆఫ్‌ లాస్‌ ఏంజిల్స్‌ కౌంటీ 1910లో ప్రారంభమై 1998లో ఆన్‌లెైన్‌లోకి వచ్చింది.

వెబ్‌ఎగ్జిబిట్స్‌-1999లో ఆన్‌లెైన్‌ లోకి ఎంటరెైంది. ఇది ఇంటరాక్టివ్‌ వెబ్‌ బేస్డ్‌ మ్యూజియం.
శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతిక అంశాలను దీని ద్వారా తెలుసుకోవచ్చు. సెైంటిఫిక్‌ మ్యూజియం (లండన్‌) 1857లో ప్రారంభమైంది. 1999లో ఆన్‌లెైన్‌లోకి వచ్చింది. ఇబిబ్‌లియో-1992లో ప్రారంభమైంది. 2000లో ఆన్‌లెైన్‌లోకి వచ్చింది. లెైబ్రరీ ఆఫ్‌ కాంగ్రెస్‌ సహకారంతో రూపుదిద్దు కున్న ఆన్‌లెైన్‌ ఎగ్జిబిషన్‌. వర్చువల్‌ రెస్టారెంట్‌, వర్చువల్‌ పోస్టాఫీస్‌ కూడా ఇందులో ఉన్నాయి. చూసేందుకు ఇప్పుడిది ఎంతో సింపుల్‌ అన్పించినా, అప్పట్లో మాత్రం ఇదంతా ఎంతో వినూత్నంగానే ఉండింది. మ్యూజియం ఆఫ్‌ ఫ్రెడ్‌ – 1999లో ప్రారంభమై 2000లో ఆన్‌లెైన్‌లోకి వచ్చింది. పలు పెయింటింగ్స్‌ను ఇందులో చూడవచ్చు.

మరెన్నో ఆన్‌లెైన్‌మ్యూజియంలు
సాధారణ మ్యూజియంలు అనేకం ఇప్పుడు ఆన్‌లెైన్‌లోనూ తమ ఉనికిని చాటుకుంటున్నాయి. వాటి చిరునామా, ప్రదర్శ నకు ఉంచిన వస్తువుల వివరాలను ఇందులో చూడవచ్చు. కొన్ని మ్యూజియంలు మాత్రమే ఇంటరాక్టివ్‌ సదుపాయాన్ని అందిస్తున్నాయి.

ప్రత్యేక మ్యూజియంలు
immప్రత్యేక థీమ్‌లతో రూపుదిద్దుకున్న ఆన్‌లెైన్‌ మ్యూజియంలు కూడా ఎన్నో ఉన్నాయి.ఇంటర్నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఉమెన్‌ అనేది ఆన్‌లెైన్‌లో మాత్రమే ఉన్న మ్యూజియం. అంతర్జాతీ యంగా మహిళలకు సంబంధించిన అనేక అంశాలపెై చిత్రా లను, సమాచారాన్ని చూడవచ్చు. ఆన్‌లెైన్‌ కమ్యూనిటీగా కూడా ఇది పని చేస్తోంది. గ్లోబల్‌ ఆర్ట్‌ ప్రాజెక్ట్‌ అనేది ప్రపంచవ్యాప్తంగా పలువురు చిత్రకారుల చిత్రాలను హై రిజల్యూషన్‌లో అందిస్తోంది. ఆయా గ్యాలరీల వర్చువల్‌ పర్యటనలనూ అందిస్తోంది. 2011 ఫిబ్రవరి 1న గూగుల్‌ దీన్ని ప్రారంభించింది. మూవ్‌మెంట్‌ మ్యూజియం, ది మ్యూజియం ఆఫ్‌ సోహో (లండన్‌), ఆర్ట్‌లా.కామ్‌లాంటివి కూడా వెబ్‌ మ్యూజియంలుగా ప్రసిద్ధి చెందాయి.

వర్చువల్‌ మ్యూజియం ఆఫ్‌ నెైజీరియన్‌ ఆర్ట్‌, బ్లూ వరల్డ్‌ వెబ్‌ మ్యూజియం, టక్సన్‌ గే మ్యూజియం, యూకేస్‌ కల్చర్‌ 24, హాంప్సన్‌ విర్చువల్‌ మ్యూజియం, విర్చువల్‌ మ్యూజియం ఆఫ్‌ కెనడా, విర్చువల్‌ మ్యూజియం ఆఫ్‌ స్లొవేనియా, మ్యూజియం విత్‌ నో ఫ్రాంటియర్స్‌, నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌, విర్చువల్‌ మ్యూజియం ఆఫ్‌ పాటగోనియన్‌ ఫాసిల్స్‌, కమ్‌2టెల్‌, కార్నామాహ్‌ హిస్టారికల్‌ సొసెైటీ అండ్‌ మ్యూజియం, ది ఈస్ట్‌ ఇండీస్‌ మ్యూజియం, మ్యూజియం సిండికేట్‌, మ్యూజియం ఆఫ్‌ ఆన్‌లెైన్‌ మ్యూజియమ్స్‌, మ్యూజియం ఆఫ్‌ ఆంటిక్యూ సీయింగ్‌ మెషిన్స్‌ లాంటివెన్నో అంతర్జాలంలో తమ ఉనికి చాటుకుంటున్నాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top