You Are Here: Home » చిన్నారి » అంతరిక్షంలో ఎలా నడుస్తారు?

అంతరిక్షంలో ఎలా నడుస్తారు?

రాకెట్ అంతరిక్షంలోకి చేరిన తరువాత వ్యోమగాములు రాకెట్ బయటకు వచ్చి అంతరిక్షంలో దాదాపు నిరాధారంగా నడిచారు. అంతరిక్షంలో గాలితో సహా ఏమీ ఉండని భారరహిత స్థితి మాత్రం ఉంటుంది.

నేల మీద నడిచినట్టు అంతరిక్షంలో నడవలేరు. పోనీ ఒక పద్ధతిగా కావలసిన వైపు నడవడానికి వీలయ్యే ఆకర్షణ స్థితి కూడా ఉండదు. రాకెట్ మాడ్యుల్ కదిలినట్టే తేలిపోతూ కదలవలసిందే! రాకెట్ నుంచి బయటకు వచ్చే ముందు రాకెట్ ఇంజన్‌కు ఎక్కువ ఒత్తిడి కలిగే ఇంధనాన్ని పంపిస్తారు. దాని ద్వారా రాకెట్‌లో నుంచి వ్యర్థ పదార్థాలను బయటకు నెట్టివేసే మార్గంలో ఒకరకమైన ఒత్తిడి పనిచేస్తుంది. ఇక్కడ కూడా అటువంటి ఒత్తిడే పని చేస్తుంది. అప్పుడు వ్యోమగాములు రాకెట్‌కు వ్యతిరేకదిశలో నడవగలుగుతారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top