You Are Here: Home » చిన్నారి » అంకుల్స్ ఆఫ్ యాంఫిబియన్స్ అని వేటిని అంటారు?

అంకుల్స్ ఆఫ్ యాంఫిబియన్స్ అని వేటిని అంటారు?

యాంఫిబియన్స్ అంటే ఉభయచర జీవులు. అంటే నీటిలోనూ. నేలపైనా నివసించేవి. ఉభయచర జీవుల్లో ముఖ్యమైనవి, అందరికీ తెలిసినవి కప్పలు. అంకుల్స్ ఆఫ్ ఆంఫిబియన్స్ అని కొన్ని రకాల చేపల్ని పిలుస్తారు. ఆ చేపలను ఆలా పిలిచింది రోమర్ అనే శాస్త్రవేత్త. సాధారణంగా చేపల న్నీ మొప్పల ద్వారానే శ్వాస తీసుకుంటాయి.

కానీ దక్షిణాప్రికా ప్రాంతానికి చెందిన ప్రోటాప్టెరస్, ఆస్ట్రేలియాలో కన్పించే నియోసెరట డోస్, దక్షిణామెరికాలోని మేరి, బర్నెట్ నదుల్లో జీవించే లేపిడో సైరన్ అనే చేపలు మాత్రం, ఉపిరి తిత్తులు ద్వారా శ్వాస క్రియ జరుపుతాయి. వీటిని డిప్నాయ్ చేపలు అని అంటారు. జంతు పరిణామ క్రమంలో ఉభయ చరాల కన్నా ముందే ఈ కప్పలు ఉపిరితిత్తుల ద్వారా శ్వాస తీసుకున్నాయి . కాబట్టి వీటిని అంకుల్ ఆఫ్ ఆంపిబియన్స్ అని అంటారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top